సర్వాంతర్యామి

జై గురుదేవ్ 
దేవుడు సర్వాంతర్యామి అని వేదం ఘోషిస్తుంది, మరి సర్వాంతర్యామి అయినప్పుడు ఆ దేవుడు ఒక రూపం, ఒక విగ్రహం గా ఎలా ఉంటాడు? సర్వాంతర్యామి అనగా సర్వం వ్యాపించి ఉన్నవాడు, ఈ సృష్టి అంతా నిండినవాడు అని.  అలా అంతా వ్యాపించినది, ఈ సృష్టి అంతా నిండినది ఏంటిది...?  అది శక్తి, ఆ శక్తే దేవుడు, అంతకు మించింది లేదు. మరి అలాంటి శక్తి ఒక రూపంగా ఉంటె మిగతా అంతా ఎవరు ఉన్నారు? మరి వేదంతో పోల్చితే సబబుగా అనిపిస్తుందా? ఆలోచించండి... 
దేవుడికి ఒక విగ్రహ రూపమే ఉంటే అందులోనే ఉంటాడు అంతేగానీ అంతటా ఎలా ఉంటాడు, దేవుడికి విగ్రహ రూపం లేదు కాబట్టే అతను సర్వాంతర్యామి. మరి ఈ విగ్రహాలు ఎలా వచ్చాయి? మనం మనుషులం, మనం ఒక ఆకారంలో ఉన్నాము కావున మనలోని మనస్సుకు  ఆకారం లేని వాటిని అర్ధం చేసుకోవటం కష్టం అనిపిస్తుంది, మరియొక సమయంలో స్వీకరించదు కూడా...  
భారతదేశంలోని పురాణ పురుషులు ఇలాంటి కష్ట సాధనను సిద్దించుకోని నిరాకారి అయిన ఆ సర్వాంతర్యామి యొక్క సత్యాన్ని తెలుసుకొని ముక్తిని పొందారు. అదే సాధనను తమ శిష్యులకు ఉపదేశించారు. అలా  అలా... కొంత కాలానికి ఈ సాధన మెల్లి మెల్లిగా మరుగున పడే స్థాయికి వచ్చింది. ఎందుకంటే ముందుగా చెప్పినట్లు ఇది చాలా కష్ట సాధన, ఇక్కడ మీకు మీరే సాధనలోని మెట్లను అధిగమించాలి, ఇందులో ఎక్కడైనా పొరపాటు పడితే  తిరిగి మళ్ళి మొదటి మెట్టుకు పడిపోతారు. ఇంతటి కష్ట సాధనను అభ్యసించే వారు కరువైన సమయంలో ఆనాటి ఋషులు ప్రజలను ముక్తి మార్గంలోకి నడిపించడానికి ఈ సాధనకు ముందుగా కొంత సరళమైన అభ్యాస సాధన చేకురుస్తే దానితో సిద్దించిన జ్ఞానంతో ఈ కష్ట సాధన చేయటం సులువు అవుతుందని తలచి దాని ముందు యోగ సాధనను జోడించారు. 
ఈ యోగ సాధన కొంత సులభతరంగా ఉన్నందునా ... ఇది ప్రజాభిమానం పొందింది. ఇలా కొంత కాలం గడిచేకొద్ది  ఈ విద్య కూడా మెల్లి మెల్లిగా అంతరించె దశకు వచ్చింది, ఎందుకనగా మానవులలోని బుద్ది కుశలతలోని మార్పుల కారణంగా మొదటి కష్ట సాధన ఉన్న కాలం నుండి ఇప్పటి కాలం వరకు మానవుడిలో చాలా మార్పులకారణంగా ఈ యోగ సాధన అప్పటి కాలంలో సరళంగా తోచిన ఇప్పటి కాలానికి అది మరింత కష్టంగా మారింది. ఆ యుగం నుండి ఈ యుగం వచ్చేసరికి..  ఈ యోగ సాధన సంసార బంధంలో ఉన్నవారు చేయలేరు, ఏ బంధం లేని వారికే ఈ సాధన అనే స్థితికి వచ్చారు. 
ఇలా ఉంటె మానవుడి మోక్ష సాధన జరగదు. అందుకు మన ఋషులు ఆలోచించి, వీరు బంధంలో ఇరుక్కుపోయి అసలైన సాధనను వదులుకుంటున్నారు అని గాడి తప్పిన మన ఆలోచనలకు ఇంకా అతి సరళమైన ఒక క్రమశిక్షణ సాధన అవసరం అని గుర్తించి, మన కోసం ఒక సరళమైన మార్గమును యోగసాధన ముందు జోడించారు. 
ఒక ఆకారంలో ఉన్న మనస్సును ముందుగా దారిలోకి తెచ్చే ప్రయత్నంగా ఆకారం లేని దేవుడికి ఒక రూపం ఇచ్చారు.  సాధన సిద్దించాక తెలుసుకోవల్సిన సర్వాంతర్యామిని ముందుగానే లభించిందనే ధ్యాసతో సాధన మొదలుపెట్టి తర్యాత ఆ మనస్సు దారిలోకి వచ్చాక విగ్రహంలో ఉన్నది దేవుడు కాదు, ఆ రూపానికి అతీతంగా ఉన్నదే దేవుడు, ఎందుకనగా దేవుడనగా శక్తి. ఆ శక్తి అనేది రూపంగా ఉండడు అనే జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం సిద్దించాక తిరిగి వెనుకంజ వేయలేరు, అసలైన జ్ఞానం అందుకోవడానికి ఎంతటి కష్ట సాధనైనా సాగిస్తారని తలచి దేవుడికి ఒక విగ్రహ రూపం ఇచ్చారు. 
ఇది ఏంతో సులువుగా ఉన్నందున దీనికే ప్రజలు ఇష్టపడినారు. అలా  ఆలా.. కాలం గడుస్తున్నకొద్దీ అది కాస్త మొహంగా మారి దేవుడిని ఆ రూపంలోనే బందించుకొని, ఆ విగ్రహ బంధంలో ఇరుక్కుపోయి మతాలని, కులాలని ఏర్పరుచుకొని గొడవలు, కొట్లాటలు పెట్టుకొని అసలైన సాధనకు దూరం అవుతున్నాడు. ఇలాంటి సాధనతో ఇంకా మొదటి మెట్టులోనే ఉంటూ... దేవుడు సాక్షాత్కరిస్తాడు అని ఆ మోహ బంధంతోనే జీవితాలను ముగిస్తున్నారు. ఇలా అయితే ఎన్ని జన్మలు పట్టాలి అసలు జ్ఞానం సిద్దించడానికి. 
ఏ సాధనైనా ధర్మంతో సాగాలి. దర్మం ఏమి చెబుతుంది? ధర్మం ఎక్కడ దేవుడి విగ్రహం గురించి ప్రస్తావించలేదు. దేవుడికి ఒక రూపమే ఉంటె ఆ రూపం ఎలా ఉండాలి? అందరి ప్రజల దేవుడి రూపంగా ఉండాలి, మరి ఆలా లేదే... ఒక మతం ఇది దేవుడి రూపం అంటే మరొక మతం అంటారు అది కాదు మా దేవుడి రూపమే దేవుడు అని. అంటే దేవుడనేవాడు ఒక్కడు కాదా...? మరి ఎంత మంది? దేవుడు అంటే ఒక శక్తి, దాన్ని మించింది లేదు. అలాంటప్పుడు శక్తి అనేది ఒకటే ఉంటుంది. అలాంటి ఈ విశ్వ శక్తి ఒక రూపంగా ఎలా ఉంటుంది? అది సర్వవ్యాప్తం అయినది. ఆ శక్తే దేవుడు అంతేతప్ప ఈ విగ్రహాలు కాదు. దీనిని చాల బాగా అర్ధం చేసుకోండి. 
అప్పటికాలంలో సాధనలు చాలా కష్టంగా ఉండేవి, వాటిని సరళంగా మీకు అందించడానికి మీ మనస్సును ఒక మార్గంలో నడిపించడానికి మొదటి మెట్టు శిక్షణగా ఈ రూపాలను సృష్టించారు, ఎందుకనగా ఇంత ముందు చెప్పుకున్నాం మనుష్యుడు ఒక రూపంలో ఉండి రూపానికి అతీతంగా ఉన్న జ్ఞానంను అందుకోవడానికి మనస్సు అవరోదంగా ఉంది, కావున ఆ మనస్సును దారిలో వేయడానికి వారు బయటకూడా ఒక రూపం సృష్టించి సాధన చేయమన్నారేగాని అదే దేవుడు అని అలానే పట్టుకోమనలేదు. దాని వలన మనం మొదటి మెట్టులోనే ఉండి... వాళ్ళు ఏర్పరిచిన సాధనలో అంతిమ మెట్టు అయినా ఆ రూపాతీతంగా ఉన్న శక్తిని చేరుకోలేము. 
వేదాల్లో ఎక్కడ చెప్పలేదు దేవుడికి ఒక రూపం ఉందని. ఇది ఈ మద్యే వచ్చినదే. పైన చెప్పిన ఆ కష్ట సాధన ఇంకా ఇప్పటి కాలంలో కూడా ఉంది, ఇగ రెండవ సాధన...  యాగ సాధన గురించి మీకు చెప్పవల్సిందేమీలేదు, ఇప్పుడు ఎక్కడ విన్న అదే వినబడుతుంది. ఎన్నుకోండి ఎలా వెళ్ళాలి ఈ జ్ఞానార్జన కోసం అని, అది మాత్రం మీ వంతు... దేవుడు సర్వాంతర్యామి, ఒక శక్తి, రూపాతీతుడు.. అలాంటి జ్ఞానంను అందిపుచ్చుకుందాం, అందరం కలిసి జీవిద్దాం... మోక్షం సాధిద్దాం ఈ జన్మలోనే. 


భవతు సర్వ మంగళం

కామెంట్‌లు