మనకు ఆదివారమే సెలవు ఎందుకు ?

 

          మనమందరం ఆదివారం ఎప్పుడు వస్తుంది అని ఎంతో ఎదురుచూస్తుంటాము... ఎందుకంటే ఆదివారం సెలవు కాబట్టి. 6 రోజులు కష్టపడి 7 వ రోజు అయిన ఆదివారం విశ్రాంతి తీసుకోవడానికి ఎంజాయ్ చేయడానికి అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తుంటారు. ఈ ఆదివారం అన్ని కార్యాలయాలకు, ఫ్యాక్టరీలకు , స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ఉంటుంది. sunday ని funday గా కీర్తిస్తారు కూడా. భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాల్లో sunday ని సెలవు దినంగా జరుపుకుంటారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఒక్క ఆదివారమునే holiday గా ఎందుకు జరుపుకుంటారు ? వేరే రోజులు అయిన సోమవారం, మంగళవారం వాటిని ఎందుకు జరుపుకోరు ?

మన భారతదేశంలో కూడా మనకు ఆదివారమే సెలవు, ఎందుకు... ! అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా.... ?



why sunday is holiday

Why Sunday is Holiday ?


      
          ప్రపంచవ్యాప్తంగా ఈ ఆదివారమునే holiday గా ప్రకటించబడిన కారణాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం. 

 International organization for standardization ISO. 

 

          ఈ ISO 8601 standard ప్రకారం ఆదివారం 7వ రోజుగా వారపు చివరి రోజుగా ఉంది. ISO అంటే అందరికి తెలిసేందే. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మధ్య ఒకే రకమైన ప్రమాణాలు ఉండేలా ఒక స్టాండర్డ్ లను రూపొందిస్తుంది. దీనితో ప్రపంచ వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది. ఇలా ఆయా దేశాలు తయారుచేసిన ఉత్పత్తులు మరియు సాంకేతిక పరిజ్ఞానం నుండి ఆహార భద్రత, వ్యవసాయం మరియు ఆరోగ్య సంరక్షణ వరకు ప్రతిదానిపై ఇప్పటివరకు 20,000 లకు పైగా స్టాండర్డ్ లను రూపొందించింది. అందులో ఒకటియే ఈ ISO 8601. ఈ ISO 8601 ఆదివారం ను 7 వ రోజుగా ఎందుకు చూపింది అంటే ఇది Gregorian calendar నే ప్రామాణికంగా తీసుకుంది కాబట్టి. ఈ Gregorian calendar లో 7 వ రోజుగా ఆదివారం ఉంటుంది. ఈ Gregorian calendar ఏంటి? ఇది ఎలా తయారుచేసారు అనే విషయమై ఇంతకుముందు  History of Happy New Year అనే ఆర్టికల్ వివరించాను. 

Gregorian calender ను ఎవరు రూపొందించారు ? 

 


          ఈ Gregorian calendar ను రూపోందించింది క్రైస్తవ మతస్తులు. కావున వారి బైబిల్ ఆధారంగా వారి దేవుడు ఈ సృష్టిని 6 రోజులు సృష్టించి 7 వ రోజు అయిన ఆదివారం విశ్రాంతి తీసుకున్నాడని ఉంది. అందువల్ల ఆదివారం ను వారంలో చివరిరోజుగా విశ్రాంతి దినంగా భావిస్తారు. అంతేకాక ఏసుప్రభు చనిపోయిన 3 వ రోజు సమాధి నుండి తిరిగి బ్రతికాడని, ఆ రోజు ఆదివారమని అందుకు ప్రతి సంవత్సరం good friday తర్వాత వచ్చే ఆదివారమును Easter sunday గా జరుపుకుంటారు. 


Why sunday is holiday

          
          అలా వారికీ ఆదివారం ఎంతో ప్రాముఖ్యతగా ఉంది, కావున వారు ఆదివారంను విశ్రాంతి రోజుగా, ప్రార్ధన రోజుగా చూస్తారు. ఇలా క్రైస్తవ మతపెద్దలు తమ మతసాంప్రదాయ బైబిల్ ఆధారంగా ఆదివారం కుటుంబ సమేతంగా చర్చ్ కి వచ్చి ప్రార్ధనలు జరపాలనే ఉద్దేశ్యంతో 1843 సంవత్సరంలో ఆదివారంను సెలవు దినంగా ప్రవేశపెట్టాలని తీర్మానించుకుని చివరికి 1844 వ సంవత్సరంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఇంగ్లాండ్ లో ప్రకటించారు, ఆదివారం సెలవు అని. 


Why sunday is holiday


          అలానే ముస్లిం మత దేశాల్లో మాత్రం వారి మతప్రకారం ప్రత్యేక ఆరాధన రోజు శుక్రవారం కావున, వారి దేశాల్లో శుక్రవారమే సెలవుగా ఉంది. 

Why sunday is holiday


  మరి మన దేశంలో ఆదివారమే సెలవు ఎందుకు?

 

          ఇలా ఈ సెలవు రోజును పరిశీలిస్తే వారి మత సంప్రదాయాల బట్టి ఉంది. మరి మన దేశంలో చుస్తే మాత్రం ఆదివారమే సెలవుగా ఉంది. మరి మన మతసాంప్రదాయంలో ఏమి ఉంది. మనం కూడా క్రైస్తవ మతదేశస్థుల్లా ఆదివారమే సెలవు తీసుకుంటున్నాము ఎందుకు?

          మన హిందూ సాంప్రదాయం ప్రకారం చూస్తే వారములోని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఏ రోజునైనా విశ్రాంతి రోజుగా చూడడానికి కనబడదు. ఎందుకంటే మన దేశం కర్మ భూమి. అంటే కర్మ చేయమనే చెప్పాయి మన శాస్త్రాలు. దానికోసం ఒక పద్దతి కరమైన time table ను తయారుచేసిచ్చింది. ఆత్మ జ్ఞాన సాధనకు కొంత సమయం, కుటుంబ పోషణకు కొంత సమయం, సంఘ సంస్కరణకు కొంత సమయం, శరీర పుష్టికి కొంత సమయం ఇలా ప్రతిరోజు ఒక ప్రణాళిక పద్దతిగా రూపొందించి అందించింది. 

          అలానే మన దేశం పాడి-పంటల ఆధారిత దేశం కావున ప్రతిరోజు పాడి-పంటల పనులు చేసుకుంటూ, వారి జ్ఞానార్జన కోసం సమయాన్ని కేటాయిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవారు. అంతేగాని ప్రత్యేకంగా ఒక రోజు సెలవు అని అలాంటి ఆచారం మనకు లేదు. అంతేకాక మన వారాలను చూసుకుంటే ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ఆరాధ్య దేవతగా చేసుకొని ప్రతిరోజూ వారం మొత్తం మన సాధన సాగుతుండేది. అందుకే మన సాంప్రదాయ కేలండర్ లో ఆదివారం మొదటి రోజుగా ఉంటుంది. ఎందుకంటే ఆదివారం సూర్య భగవానుడి ఆరాధ్య రోజుగా పెట్టారు. ఆదివారం అనేది ఆదిదేవుడు అనే దానినుండి వచ్చింది. దీనికే భానువారం అని కూడా పేరు ఉంది. భానుడు అంటే సూర్యుడు అని అర్ధం. 


Why sunday is holiday



          ఇక్కడ మనం ఒకటి గుర్తించాలి, మన భూమి కర్మ భూమి కావున ఆదివార అధిష్ట దేవతైన ఆ సూర్య భగవానుడిని ఆరాధిస్తూ మనలో కూడా ఆ భానుడిలా నూతన ఉత్తేజం, నూతన శక్తితో ఆ వారం అంతా కర్మలు చేయాలనే ఉద్దేశంతో ఆదివారమును మన సాంప్రదాయ క్యాలెండర్లో మొదటి రోజుగా పెట్టారు మన పూర్వికులు. ఇలా మొదటి రోజుగా ఉన్న ఈ ఆదివారమును మనకు ఇప్పుడు సెలవు రోజుగా ఎలా మారింది? అంటే... మన దేశంను బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలంలోకి వెళ్లాల్సిందే. 

ఆదివారం సెలవు రావడానికి గల కారణం...  

 

           ఆదివారం సెలవు రావడానికి నారాయణ మేఘాజి లోఖండే గారి పుణ్యమే. ఈ మహాపురుషుడు బ్రిటిష్ వారితో ఒక్క సంవత్సరమో, రెండు సంవత్సరాలో కాదు ఏకంగా 8 సంవత్సరాలు పోరాడితే వచ్చింది ఈ ఆదివారం సెలవు రోజు. ఈ నారాయణ మేఘాజి లోఖండే గారు మహారాష్ట్రలోని థానే లో 1848 లో జన్మించారు. భారతదేశ ట్రేడ్ యూనియన్ ఉద్యమ పితామహుడిగా పేరు పొందారు. భారత కార్మిక సంఘాల చరిత్రలో సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన మొదటి నాయకుడు ఈయన. 

Why sunday is holiday

          బ్రిటిష్ వారు మన దేశంను ఆక్రమించుకున్న తర్వాత వారు మన దేశంలో తలపెట్టిన వివిధ కార్యాలయాల్లో, కర్మాగారాల్లో కూలీలుగా మన దేశ ప్రజలను వాడుకునేవారు. మన వాళ్ళు కూడా ధనం వస్తుందని వారి కార్యాలయాల్లో, కర్మాగారాల్లో ప్రతిరోజూ పనికి వెళ్లేవారు. మన దేశంలో వారంలో ఒకరోజు సెలవు అనే సాంప్రదాయం లేదు కావున బ్రిటిష్ వారు వారానికి 7 రోజులు పని చేయించుకునేవారు. అదికాక పని సమయం కూడా రోజు మొత్తం ఉండేది. అలాగే మన వారు కూడా ధనం వస్తుంది కదా అని వారు విధించిన నియమాలు అనుసరించి ఉండేవారు. దీని వలన అప్పటి సంఘంలో ఎన్నో సమస్యలు చుట్టుముట్టగా వాటిని పరిష్కరించలేక చాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేది అప్పటి సమాజం. వీటిని పరిష్కారించాలంటే వారంలో ఒకరోజు సెలవు ఉండాలని, ఆ రోజు జనులందరు కలిసి సంఘ సంస్కరణకు పాటుపడుతారనే ఉద్దేశ్యంతో ఈ నారాయణ మేఘాజి లోఖండే అనే అభ్యుదయ వాది సెలవు కావాలని బ్రిటిష్ వారిని డిమాండ్ చేసాడు. 

మన దేశంలో ఎప్పటినుండి ఆదివారం సెలవు ప్రవేశపెట్టారు ?

 


          వారానికి ఒకరోజు సెలవు అనేది ఈయన డిమాండ్ చేసే సమయానికి ముందే బ్రిటిష్ వారి దేశాలలో అమలులో ఉంది. కానీ వారు మన దేశంలో ఆ విధానాన్ని అమలుచేయకుండా మనవారితో పనులు చేయించుకునేవారు. ఈ విషయాన్నీ గ్రహించిన నారాయణ మేఘాజి లోఖండే గారు మన దేశంలోని ప్రజలకు కూడా సెలవు కావాలనే నినాదాన్ని 1881 లో లేవనెత్తారు. ఈ ఉద్యమం 8 ఏండ్లు సాగింది. అలా 1889 లో ఉద్యమ చివరిదశలో ఒక మహా ఉద్యమంగా మారి వేలకొద్దీ ప్రజలు అఖండ భారతావని మొత్తం ఈయన నాయకత్వాన ఆందోళనలు చేసారు. ఈ ఉద్యమానికి అప్పటి సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలె గారు కూడా తోడు నిలిచారు. అంతటి మహా ఉద్యమానికి తలొగ్గిన బ్రిటిష్ ప్రభుత్వం 1890 జూన్ 10 వ తేదీన వారి దేశాలా మాదిరిగా ఆదివారం సెలవు రోజుగా ప్రకటించింది. ఈ విధంగా మన దేశంలో ఆదివారం సెలవు వచ్చింది. ఇదే విధంగా మెల్లిమెల్లిగా బ్రిటిష్ వారు క్రైస్తవ మతం వ్యాప్తి చెందిన ప్రతి దేశంలో ఆదివారమే సెలవు అనే పద్దతిని ప్రవేశపెడుతూ వచ్చారు. 

          ఈ విధంగా భారతదేశంలో జరిగిన మొట్టమొదటి కార్మిక ఉద్యమనేతగా నారాయణ మేఘాజి లోఖండే గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ ఉద్యమం తరువాత కూడా కార్మికుల బాగుకై నారాయణ మేఘాజి లోఖండే గారు ఎన్నో కార్మిక ఉద్యమాలు చేసారు, సాధించారు కూడా. అవి ఏంటంటే... 
          1. మధ్యాహ్నం అరగంట భోజన విరామం
          2. పనివేళ సమయాన్ని ఉదయం 6:30 గంటల నుండి సాయంత్రం       సూర్యాస్తమయానికి కుదించడం, అలాగే 
          3. ప్రతి నెల 15 వ తేదీన నెలవారీ జీతం చెల్లించబడాలి లాంటివి సాధించి పెట్టారు. 

          అంతేకాక అప్పట్లో ఎంతో ప్రాచుర్యం పొందిన "దీనబంధు" పత్రికలో కీలక భాద్యతలు నిర్వహించి కార్మిక సంక్షేమానికై ఎన్నో వ్యాసాలు కూడా రచించారు. ఈ విధంగా తన ఆఖరిరోజుల వరకు కార్మికుల సంక్షేమానికి సంఘ సంస్కరణకు పాటుబడి 1897 లో ఫిబ్రవరి 9న ముంబై నగరంలో కన్నుమూసారు. ఈ మహనీయుడు చేసిన విశేష కృషిని గుర్తించిన మన దేశ ప్రభుత్వం 2005 లో నారాయణ మేఘాజి లోఖండే గారి జ్ఞాపకార్ధం ఒక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది. 


Why sunday is holiday


          ఈ నారాయణ మేఘాజి లోఖండే గారు చేసిన కృషి ఫలితమే ఇప్పుడు మనం ప్రతివారం ఎదురుచూస్తున్నా ఆదివారం సెలవు. అంతటి మహనీయుడిని ప్రతిఒక్కరం ఒక్కసారి స్మరిద్దాం. 

         ఇదండీ మన దేశంలో కూడా ఆదివారమే సెలవు రావడానికి గల కారణం. 

ఈ ఆర్టికల్ యొక్క వీడియో ను చూడండి.







 మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి. 


KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.

KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips  

ఇవి కూడా చదవండి... 

History of Jan 1st New Year

గణపతి ఉత్సవాల వెనక అసలు రహస్యం

స్వదేశీ ఉద్యమం 

తలవెంట్రుకల జీవితకాలం ఎంతో తెలుసా...?

     

 ఈ ఆర్టికల్ మీకు నచ్చినదని భావిస్తూ... 

భవతు సర్వ మంగళం

కామెంట్‌లు