Ugadi
ఉగాది
కొత్త సంవత్సరం అంటె ఎదో తేది మార్పు కాదు,
ప్రకృతిలోని మార్పు... పాతదనం నుంచి క్రోత్తదనం లోకి వెళ్ళడమె క్రోత్త సంవత్సరం.
ఎవిధమైన మార్పులేని, కేవలం క్యాలేండర్ లోని తేది మార్పును వెర్రి చేష్టలతో
జరుపుకోనె పరధేశి సంస్కృతి అయిన జనవరి 1వ తేదీని మనలోకి స్వాగతించడం....
ఎంత పిచ్చితనం. మనం పరదేశియులనుండి స్వాతంత్ర్యం పోందాము కాని...
ఇంకా వాళ్ళ వెర్రి చేష్టల మోహం నుండి స్వాతంత్ర్యం పోందలేదు.
ఇంకా అందులో మునిగిపోతున్నామే గాని బయటికి రాలేకపోతున్నాము.
రాత్రంత పార్టిలని మందుతొ, కుప్పిగంతులతొ, వెర్రి చెష్టలతొ...
తెల్లవారు ప్రోద్దుపోయెదాక మెల్కోకపోవడం...
ఇదా... సంస్కృతి?
క్రోత్త సంవత్సరం అంటె క్రోత్తగా జీవితం ఆరంభించడం.
కాని పరదేశి చేష్టల మోహంలో పడి ఎమి చేస్తున్నారు...?
క్రోత్త సంవత్సరం అని చెప్పుకునె మీరు...
క్రోత్త సంవత్సరం లో జీవితం ఆలస్యంగా,
బద్దకంగా, నీరసంగా... మొదలుపెడుతున్నారు.
ఇదా... క్రొత్త సంవత్సరం?
క్రొత్త సంవత్సరం సూర్యోధయంతో మొదలవుతుంది.
కుటుంబ సభ్యులంత కలిసి ఆనందంగా
ఉదయం నుండి ఉత్సహంగా జరుపుకునేది.
క్రొత్త సంవత్సరం అంటే ఉగాది.
షడ్రుచులు కలిసినది ఈ పండుగ.
మన సంస్కృతి... ప్రకృతిని ప్రేమించడం, పూజించడం.
ఎందుకంటె భవం అంటె విశ్యం, అంటె ప్రకృతి.
భవాని అంటె శక్తి, ఆ శక్తె మనల్ని కాపాడుతుంది.
శక్తి లేకుంటే విశ్వం లేదు, ప్రకృతి (విశ్వం) లేకుంటే శక్తి లేదు.
ప్రకృతి, శక్తి ఇవి విడదీయలేము,
అందుకె మనం భవం భవాని అని
శివ శివా (శివా అనగ పార్వతి, శక్తి) అని శివపార్వతులను అర్దనారీశ్వరులని పూజిస్తాము.
ప్రకృతిలోని మార్పులనుబట్టి పండుగలు చేసుకునె సంస్కృతి మనది.
ప్రకృతి ని ప్రేమించి ప్రకృతిని పెంచి మన ఆరోగ్యాలను,
మన సంతోషాలను పంచుకోవడానికి వీలుగా...
మన సంస్కృతి ఎన్నో పండుగలను అందించింది.
వాటి గురించి తెలుసుకోని పాటిద్దాం. అందులో మొదటిది ఉగాది పండుగ.
ఉగాదే మన నూతన సంవత్సరం. అందుకే ఉగాది ని మన నూతన సంవత్సరంగా మన సంస్కృతిలో జరుపుకుందాం.
అది ఈ విళంబి నామ సంవత్సరం నుండి మొదలుపెడుదాం.
మన సంస్కృతిని కాపాడుకుందాం.
ఈ విళంబి నామ సంవత్సరం అందరికి జయాలు, ఆరోగ్యాలు,
పేరు ప్రతిష్టలు కలగాలని కోరుకుంటు....
విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి