Simple methods to control diabetes

 
డయాబెటిక్ ను అదుపులో ఉంచేందుకు కొన్ని చిట్కాలు



          
                 ఈ రోజుల్లో సర్వసాధారణంగా వినపడుతున్న పదం డయాబెటిక్, ఒకప్పుడు మన భారతదేశంలో ఇది వినబడేది కాదు. ఎదో ఒక లక్షల్లో ఒకరికి ఉండేదేమో. అదే ఇప్పుడు ఎవరినైనా మందలిస్తే ఇదే వినబడుతుంది. దీనికి ఏమి కారణం అంటే మనం మన జీవన క్రమానికి వ్యతిరేకంగా జీవనం సాగిస్తున్నందుకు. ఏమి విరుద్దంగా ఉంటున్నాము, ఏమి తినాలో, ఏమి అయితే తినడానికి లభిస్తున్నాయో వాటినే ఉపయోగిస్తున్నాము. ఇంకేం విరుద్దంగా ఉంటున్నాము. మా తాతలు ఇవే పప్పులు, అప్పులు తిన్నారు మేము కొత్తగా అవి కాకా ఇంకేం తింటున్నాము అంటుంటారు. అవును, మీరు మీ తాతలు తిన్నవే తింటున్నారు, కానీ వారికీ ఈ జబ్బులులేవు మరి మీకెందుకు వస్తున్నాయి. అంటే ఎక్కడ లోపం జరుగుతుందో గమనించాలి. అవే పప్పులు, ఉప్పులూ కానీ వాటిని పండించడంలో, వాటిని అమ్మడంకోసం వచ్చిన వ్యాపార పద్ధతిలోని మార్పులనుగుణంగా చోటుచేసుకున్న మార్పుల కారణంగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీ తాతలనాటి కాలంలో ఉన్న వ్యవసాయ పద్ధతులు, వ్యాపారరంగం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. వాటిలోని మార్పులను గమనించండి. ఈ మార్పులు ఎక్కడినుండి వచ్చాయి?

          ఇవన్నీ మన విదేశీ వ్యామోహం వల్ల, విదేశీ వ్యాపారుల లోభాపూరితమైన ప్రకటనలకు, వాటి రుచులకు, వారు చూపించే ధరలకు మొగ్గుచూపి ఈలాంటి పరిస్థితులకు తలుపులు తెరుస్తున్నారు. ఈ డయాబెటిస్ అనేది భారతదేశంలో లేని కాలంలోనే విదేశాలలో విస్తృతంగా ఉండేది. ఇప్పుడు మనం ఆ విదేశీ పద్దతులను అనుసరిస్తూ, మరియు వారు నిత్యావసరాలను వారి పద్దతిలో తయారుచేసి ఇలానే తినాలి, ఇదే తినాలి అనే విదంగా వారు చేసే మార్కెటింగ్ కు ముగ్దులమై వారిని మన భారతదేశంలోకి ఆహ్వానించి దాదాపుగా వారి ఆహారవ్యవహారాలను మనం అవలంభిస్తున్నందుకు ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ డయాబిటీస్ అనేది వ్యాపించసాగింది. ఒక్కటి గమనించండి! రైతు 4 నెలల నుండి 6 నెలలు కష్టపడి  పండించిన పంట మార్కెటులో ఉన్న ధర కంటే ఆ విదేశీ కంపెనీ అమ్మే వాటి ధర తక్కువగా ఉంటుంది. మరి ఇది ఎలా సాధ్యం? ఆలోచించండి! 

          ఆ విదేశీ కంపెనీ వారి వ్యాపార లాభార్జనకోసం వాటిని తయారుచేయడంలో మనకు హానికరమైన పద్దతులతో కల్తీ చేసి మార్కెటింగ్ చేస్తాడు. ఎలా అనగా వాడి కంపెనీ బ్రాండెడ్ కంపెనీ అని వాడి సరుకులు వాడటం వలన ఆరోగ్యానికి మంచిదని, మిగతా వాటితో అనారోగ్యాలు కలుగుతాయని ప్రకటనలు చూపిస్తూ, ఒక మోసపూరితమైన వ్యాపార రంగాన్ని సృష్టించి మన అనారోగ్యాలతో లాభార్జన సాగిస్తున్నారు. ఆనాటి తాతల కాలంలో కల్తీ చేసి వ్యాపారం చేసేవాడిని బహిష్కరించేవాళ్ళు, అలా చేయడం వల్ల వారి మర్యాద ఆ ఊరిలో ఉండేది కాదు. కానీ అదే పని ఇప్పుడు బ్రాండ్ కంపెనీ అని చెప్పుకునే ఈ బ్రాండ్ కంపెనీలను మనం ఏమి చేయాలి? ఆలోచించండి. మరి ఏమి చేయాలి... ఇంకో పరిస్థితి లేదు కదా అని అనుకోకండి. ముందు మనం మారాలి. వాడు చేస్తున్న ఈ వ్యాపార మోసానికి బలి అవ్వకుండా, వెతకండి కల్తీ లేనివి ఎక్కడ లభిస్తాయా అని. దానితో వాటిని తయారుచేసే వారికీ ప్రోత్సాహం లభించి, మన వ్యాపార రంగం మారుతుంది. 

          ముందుగా మనం ఈ డయాబిటీస్ ఎందుకు వస్తుందో టూకీగా తెలుసుకుందాం. ఇంతకుముందు చెప్పుకున్న అనారోగ్యం కలుగజేసే వాటికీ అలవాటుపడటం వలన, మన లైఫ్ స్టైల్ లోని మార్పుల వలన, వంశపారంపర్యంగా, ఇంకా స్ట్రెస్ అంటే చాలా కాలంగా ఒత్తిడికి గురికావడం లాంటి కారణాల ద్వార ఈ డయాబిటీస్ వస్తుంది. లైఫ్ స్టైల్ అనగా మన జీవితంలో సాగించే నిత్యకృత్యాల్లోని మార్పులు. అనగా పొద్దుపోయేవరకు  పడుకోనేవుండటం, రోజంతా బద్దకంగా ఉండటం, రాత్రిల్లు మేల్కొనేఉండటం, నాన్ వెజ్ మరియు మసాలాలు, శీతలపానీయాలు, బేకరీ పదార్ధాలు తినడం, రోజుల్లో ఎక్కువసార్లు కడుపు నిండుగా, ఒక టైం లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు తినడం, తినకుండా ఖాళీగా కడుపును ఉంచడం లాంటివి చేయడం, చాలా ఆలస్యంగా రాత్రి భోజనం చేయడాలు, తినగానే నిద్రపోవడాలు ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక పద్దతిగా కాకుండా ఇష్టమొచ్చినట్లు నడవడం వల్ల లైఫ్ స్టైల్ దెబ్బతిని ఇలాంటి డయాబిటీస్ వాటికీ దారితీస్తుంది. 

          వంశపారంపర్యం అనగా దీన్ని మీకు వివరించవలసిన అవసరం లేదు. అయినా అది మన చేతిలో లేదు, కానీ మీ నుండి మీ వంశానికి వెళ్లకుండా చేయగల శక్తి మిలో ఉంది. ఎలా అనగా ఈ డయాబిటీస్ మీకు రాకుండా మీ జీవితాన్ని మార్చుకొని, మీ సంతతి వాళ్ళ జీవితాలను కూడా ఇదే విధమైన పద్ధతుల్లో నడిచేవిదంగా మారుస్తే దీన్ని అరికట్టవచ్చు. ఇగ స్ట్రెస్ అంటే చెప్పేదేమిలేదు, ఎందుకంటే దీని గురించి అందరికి తెలిసిందే, అందరు చెబుతారు కూడా టెన్షన్ పడవద్దు అని, కానీ ఆ సమయానికి అది బయటపడుతూనే ఉంటుంది. దీనికోసం యోగ ను అబ్యాసం చేసుకోవడమే ఉత్తమం. అంతేకాక ఈ డయాబిటీస్ ను అదుపులో ఉంచుకొనే కొన్ని చిట్కాలు మరియు మన రోజువారీ ఆహార వ్యవహార శైలిలోని కొన్ని మార్పులు చేసుకొనే పద్ధతుల గురించి తెలుసుకుందాం. 

          ఒక చెంచా త్రిఫల పొడి ఒక గ్లాస్ నీళ్లలో వేసి కలపండి, అలానే ఒక చెంచా మెంతులు ఇంకొక గ్లాస్ నీళ్లలో నానబెట్టండి రాత్రంతా. ఉదయం కాలకృత్యాలు తీర్చుకోకుండానే ముందు త్రిఫల పొడి వేసిన నీటిని మంచిగా కలిపి త్రాగండి, ఆ తరువాత మెంతులు నానబెట్టిన నీటిని తాగి చివరికి ఆ మెంతులను కూడా నోట్లో వేసుకొని మెత్తగా నమిలి మింగండి. ఇలా తీసుకున్న గంట నుండి గంటన్నర వరకు ఏమి తీసుకోకండి. ఎందుకంటే ఈ సమయంలో మనం తీసుకున్న త్రిఫల పొడి మరియు మెంతులు మన శరీరంలోని డయాబిటీస్ మరియు ఇంకా ఎన్నో రుగ్మతలపైనా పని చేస్తాయి. అలాకాకుండా ఈ లోపులో ఏమైనా తీసుకుంటే వాటి పనికి ఆటంకం ఏర్పడి వాటి వల్ల కలిగే లాభాలు కలుగకుండా పోతాయి. ఈ ప్రక్రియా క్రమం తప్పకుండా 3 నెలలు పాటించండి, తరువాత తేడా మీకే తెలుస్తుంది. ఇలా 3నెలలు తీసుకున్న తరువాత కనీసం 20 రోజులైనా తీసుకోవడం ఆపి మల్లి ఒక 3 నెలలు తీసుకోండి. ఇలా ప్రతి 3 నెలలకు ఒకసారి గ్యాప్ ఇస్తుండాలి లేకుంటే దానితో వేరే పరిణామాలు ఏర్పడుతాయి. ఈ విదంగా మీ షుగర్ లెవల్స్ లని బట్టి వాడవచ్చు, ఇలా పాటించడం వలన ఒకానొక సమయానికి మీ షుగర్ లెవల్ నార్మల్ గానే ఉండిపోతుంది. 

          ఇంకా ఆలుగడ్డలు తినకూడదు, అలాగే చెక్కర ను కూడా. ఇది సల్ఫర్ తో శుద్ధి చేసి వస్తుంది. దీనిని మొత్తానికే వాడకూడదు. కావలిసివస్తే ఆర్గానిక్ బెల్లం, పటికబెల్లం ఉపయోగించండి. ఇంకా నాచురల్ బ్రౌన్ షుగర్ తీసుకోవచ్చు. ఈ నాచురల్ బ్రౌన్ షుగర్ ఎందుకు మంచిది, ఎలా తయారుచేస్తారనే విషయమై ఇంతకుముందు పెరుగులో ఉప్పు కలుపుతున్నారా...? అయితే ఇది మీకోసమే. అనే బ్లాగ్ ఆర్టికల్ లో వివరించాను, దీనిని కొన్ని కంపెనీలు బెల్లంనే ఈ విధంగా చేసి నాచురల్ బ్రౌన్ షుగర్ అని అమ్ముతున్నారు, చూసి తీసుకోండి. అన్ని పండ్లను తినండి ఏమి నష్టం కాదు కానీ పండ్ల రసాలను మాత్రం తీసుకోకండి. పండ్ల రసాలలో చెక్కరను వేస్తారుగా, చెక్కరను వేసుకోకుండా తాగవచ్చా అంటే అలా కూడా వద్దు. ఎందుకంటే పండ్ల రసాలలో ఫైబర్ ఉండదు. డయాబిటీస్ వాళ్ళు ఆహారంగా తీసుకునే దానిలో ఫైబర్ ఉండేవిదంగా చూసుకోవాలి. పండ్లను మంచిగా నమిలి తినండి. మామిడి పండు కూడా 2 లేక 3 ముక్కలు తినవచ్చు నష్టం ఏమి లేదు. 

          షుగర్ లెవెల్స్ ఎప్పుడు పెరుగుతాయి అంటే వనస్పతి నూనెలు, వనస్పతి డాల్డా, రిఫైన్డ్ నూనెలు వాడటం వల్ల, ఆలుగడ్డ తినడం వల్ల, అలాగే ఎక్కువ ఒత్తిడికి గురి అయినప్పుడు. ఇంకా బాగా మాసాలతో కూడిన ఆహరం తీసుకోవడం వల్ల, ఫ్రిడ్జ్ వాటర్ త్రాగడం వల్ల, రాత్రి మిగిలిన అన్నం, కూరలు ఏదైనా ఉదయం తీసుకోవడం వల్ల ఈ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందరు అనుకుంటారు తీపి పదార్ధాలు తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కానీ ఈ మసాలా భోజనం తింటే పెరుగుతుందా అని! కానీ ఇదే నిజం తీపి పదార్ధాల కంటే మసాలా వంటకాలతో షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతాయి. ఎప్పుడైనా బెల్లం, తేనే తీసుకుంటే ఏమీకాదు. అలాగే మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉండదో అప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఫైబర్ లేనివి అంటే, పాలిష్ పెట్టిన బియ్యం, మినపప్పు, సోయాబీన్ పప్పు లాంటివి. మరి ఏ పప్పు వాడాలి అంటే, పెసర పప్పు, శనగపప్పు, కందిపప్పు, ఇలా మిగతా పప్పు దినుసులు అన్నివాడవచ్చు. ఎందుకంటే వీటిలో ఫైబర్ ఉంటుంది. 

          డయాబిటీస్ అని తెలుసుకోగానే మొట్టమొదటగా భోజనంగా గోధుమ పిండితో చేసిన చపాతీలను తీసుకుంటారు. అలా కాదు, మీరు గోధుమలను చాలా అంటే చాల తక్కువగా, ఎప్పుడైనా ఒకసారి మాత్రమే తీసుకోండి. అంతేగాని రోజు తీసుకోకండి. ఇదేంటి మీరు రివర్సగా చెబుతున్నారు అని అనుకుంటున్నారా...  మరి ఒకటి ఆలోచించండి! డయాబిటిక్ ఉందని రోజు గోధుమ పిండి చపాతీలు తినే వారిలో దాదాపుగా చాలావరకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ గా  ఉండదు ఎందుకు? ఎందుకంటే గోధుమలలో ఫైబర్ చాల తక్కువగా ఉంటుంది. మనం ముందు చెప్పుకున్నాం కదా.. ఫైబర్ ఉన్న ఆహరం తీసుకోవాలని. అందుకే గోధుమలను ఎక్కువగా ఉపయోగించకండి. గోధుమలే వాడుతాం అనుకునేవాళ్లు గోధుమలతో పాటు నల్ల శనగలను కూడా పిండిని మెత్తగాకాకుండా పట్టించి సమపాల్లలో కలిపి దానితో చపాతీలు చేసుకొని తినవచ్చు. ఇంకొక విషయం ఏ రొట్టెలు చేసే పిండిని అయినా బాగా జల్లడ పట్టకుండా ఫైబర్ ఉండేలాగా చూసుకొని ఉపయోగించండి. బజారులో దొరికేవాటిలో ఏ మాత్రం ఫైబర్ ఉండదు. మీరే స్వయంగా పిండిని మెత్తగా కాకుండా మందంగా పట్టించి జల్లెడించకుండా ఉపయోగించండి. ఎందుకంటే మెత్తగా పట్టిస్తే దానిలోని ఫైబర్ మాయమవుతుంది. 

          అల్లం, వెల్లుల్లి ఉపయోగించండి, అలాగే పచ్చి ఉల్లిగడ్డలు సన్నగా తరిగి దానిపై నిమ్మరసం, మిరియాలపొడి చల్లుకొని సలాడ్ గా మధ్యాహ్న భోజనంతో తీసుకోండి. ఎప్పుడైనా భోజనం చేసిన గంటన్నర తర్వాత నిదానంగా గుటక గుటకగా వాటర్ త్రాగండి. అంతకంటే ముందు వాటర్ తాగకండి. అయోడిన్ ఉప్పు వదిలేసి సైంధవలవణము (Rock Salt) ను వాడండి. అల్యూమినియం పాత్రలను వాడకండి. 

          ఇంకా కావాలంటే సాయంత్రం ఖాళీ కడుపునా ఫైబర్ తో కూడిన అలోవిరా రసం 4,5 చెంచాలు మరియు అందులో 2,3 చెంచాల గిలోయ్ (giloy) రసం, కొన్ని నీళ్లు కలుపుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత గంట వరకు ఏమి తీసుకోకూడదు. ఈ గిలోయ్ రసం షుగర్ పై చాలా మంచి ప్రభావం చూపెడుతుంది. అలాగే వీలయితే వేపపుల్లను వాడండి టూత్ బ్రష్, పేస్ట్ బదులు. వేపపుల్ల రసం కూడా చాల మంచి ప్రభావం చూపెడుతుంది. జామపండ్లు మంచిగా హాయిగా తీసుకోండి. 

          వీటన్నిటితోపాటు ఆసనాలు, ప్రాణాయామం చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. రోజు ఉదయం సాయంత్రం చిన్న చిన్నబాడీ వార్మ్ అప్ లు తప్పకుండా చేయండి, ఇంకా సూర్య నమస్కారాలు, తాడాసనం, ధనురాసనం, పశ్చిమోత్తాసనం, మర్కటాసనం, సర్వాంగాసనాలు వేయండి. ఇంకా ప్రాణాయామంకు వస్తే భస్త్రిక ప్రాణాయామం, కాపాలభాతి ప్రాణాయామం, అగ్నిసార్ ప్రాణాయామం, మహత్ ప్రాణాయామం, ఈ మహత్ ప్రాణాయామం మాత్రం హై బి. పి. , హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళు , హార్ట్ సమస్యలు ఉన్నవాళ్లు చేయకూడదు. సుఖ ప్రాణాయామం, బ్రామారి ప్రాణాయామం. ఈ బ్రామరీ ప్రాణాయామం మాత్రం 21 సార్లకు తక్కువకాకుండా చేయాలి. డయాబిటీస్ అనేది ప్యాంక్రియాస్  గ్రంధి సరిగా పనిచేయక వస్తుంది. కానీ ఒక్కక్కసారి డయాబిటీస్ అనేది మెదడుతో కూడా సంబంధం ఉంటుంది. ఎలా అంటే కొందరికి ప్యాంక్రియాస్ ఆరోగ్యంగానే ఉంటుంది కానీ మెదడు ఒక్కొక్కసారి ప్యాంక్రియాస్ కు సరియైన సంకేతాలు పంపించలేకపోతుంది. ఇలాంటి సమయాల్లో ఈ బ్రామరీ ప్రాణాయామం చాలా మంచి ప్రభావం చూపుతుంది. ఎలా అనగా ఈ బ్రామరీ ప్రాణాయామం మెదడును ఉత్తేజపరుస్తుంది. దీనితో మెదడుతో సంబంధం ఉన్న ప్యాంక్రియాస్, పిట్యూటరీ, పీనియల్ గ్రంధి లాంటి వాటిని సరిగా పనిచేసేటట్లుగా చూసుకుంటుంది. వీటన్నిటి తరువాత శవాసనం తప్పకుండా వేయాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ ఆసనాలు, ప్రాణాయామాలు పుస్తకాలు చదివో లేక  టి. వి. లోనో యూట్యూబ్ లోనో చూసి మీకు మీరుగావేయవద్దు. వీటిని యోగ టీచర్ దగ్గరనో లేక గురువుల దగ్గరనో శిక్షణ తీసుకోవాలి లేకపోతె పరిణామాలు తారుమారు అవుతాయి జాగ్రత్త!


          ఈ ప్రాణాయామాలు వజ్రాసనంలో కూర్చొని చేయండి ఫలితం ఎక్కువగా ఉంటుంది, అలా కూర్చోలేము అనుకుంటే సుఖాసనంలో కూర్చోవచ్చు. కానీ రోజు భోజనం చేసిన తరువాత వజ్రాసనంలో ఒక 10 నిమిషాలు తప్పకుండా కూర్చోండి. రాత్రి భోజనం అయిన 2 గంటల తరువాత గాని నిద్రించకండి.  

          ఈ విధమైన జీవనశైలితో అనుసరించి మిమ్మల్ని మీరు ఆరోగ్యవంతులుగా మలుచుకుంటారని భావిస్తూ...



భవతు సర్వ మంగళం  
          

         


కామెంట్‌లు