దీపావళి శుభాకాంక్షలు
మిత్రులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, ధ్యాన మార్గ సాధకులకు మరియు ఆత్మీయులకు పేరు పేరున దీపావళీ శుభాకాంక్షలు.
కృతయుగంలో హిరాణ్యాక్షుణ్ణి వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో నరకుడు జన్మిస్తాడు. అతడు లోక కంటకుడైనా మహా విష్ణువు వధించరాదని, తన తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు.
మహా విష్ణువు ద్వాపర యుగంలో శ్రీ కృష్ణ భగవానునిగా, భూదేవి సత్యభామగా జన్మిస్తారు. నరకాసురుడు లోక కంటకుడై చెలరేగి సాధుజనాలను పీడిస్తూ... దేవ, మర్త్యలోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు.
నరకాసురుడు చేస్తున్న అకృత్యాలను అరికట్టడానికి శ్రీ కృష్ణుడు, సత్యభామ సమేతంగా తరిలి వెళ్తాడు. వారి మధ్య జరిగిన భీకర పోరాటంలో భూదేవి అంశం అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకాసురుడు.
నరకాసురుడు మరణించిన రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి కావున ఈ రోజును నరక చతుర్దశి అంటారు. నరకాసురుని పీడ విరగడైందని సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు.
ఈ సంబరాలు జరుపుకొనే రోజు అమావాస్య కావడంతో, చీకటిని ప్రాలదోలడానికి ప్రజలు దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక జరుపుకుంటారు. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగే ఈ దీపావళీ .
ఈ దీపావళీ .....
అవనికంతా ఆనంద విజయోత్సహం, అజ్ఞానపు చీకట్లు తొలగించే విజ్ఞాన దీపాల తేజోశ్చాహం.
దీపావళీ, దివ్య దీపాల వరుస దీపావళీ, నవ్య ఆనంద ఆరావళి ఈ దీపావళీ .
మన జీవితాలలో వెలుగును నింపే నిత్య సంతోష సరాగవాలి ఈ దీపావళీ.
నేలను మెరిసే దీపపు వరుసలు, నింగికి ఎగసే తారాజువ్వలు, తరిమేస్తాయి అమావాస్య చీకట్లు, నింపుతాయి పున్నమి కాంతులు.
ఈ దీపావళీ దివ్య కాంతుల వేళ...
దుష్ట శక్తులను పారద్రోలి కొంగొత్త జీవితాన్ని ప్రసాదించడానికి శ్రీ మహాలక్ష్మి మీ ఇంట నర్తించగా ...
మీకు, మీ కుటుంబ సభ్యులందరికి....
సిరి సంపదలు, సుఖసంతోషాలు, సౌభాగ్యం, సమృద్ధి, స్నేహం ఎల్లప్పుడూ మీ ఇంట వెల్లివిరియాలని కోరుకుంటూ... నరక చతుర్దశి మరియు దీపావళీ శుభాకాంక్షలు.
భవతు సర్య మంగళం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి