History of Jan 1st New Year

ఆంగ్ల క్రొత్త సంవత్సర చరిత్ర 
History of Jan 1st New Year 




       
           ప్రస్తుతం మనం రోజు చూస్తున్న క్యాలెండరు పేరేంటో మీకు తెలుసా? 
దాని పేరు గ్రెగొరీయన్ క్యాలెండరు ( Gregorian calender ). ఇందులో కేవలం 1 నుండి 31 వరకు అంకెలే ఉంటాయి అంతే. ఈ క్యాలెండరుగా రూపం తీసుకోవడానికి దీనికి దాదాపుగా 2000 సంవత్సరాలు పట్టింది. అది ఎలా అంటే..... 

          క్రీ. పూ. 46 వ సంవత్సరం వరకు పశ్చిమ దేశాలు రోమన్ క్యాలెండర్ నే అనుసరించేవారు. ఆ రోమన్ క్యాలెండర్ను రోములుస్ అనే మొదటి రోమ్ చక్రవర్తి రూపొందించాడు. ఎప్పుడు రూపొందించాడు అనేది సరైన ఆధారాలు లేవు కానీ కొందరి చరిత్రకారుల ప్రకారం ఈ మొదటి రోమ్ చక్రవర్తి క్రీ. పూ. 753 వ సంవత్సరంలో రోమ్ నగరం స్థాపించి దానికి రాజు అయినాడు అని తెలుస్తుంది. 

          ఈ రోమన్ క్యాలెండర్ లో 355 రోజులుగా, మొత్తం 10 నెలలుగా మాత్రమే ఉండేది. ఈ రోమన్ క్యాలెండరు మార్చ్ నెల నుండి మొదలై డిసెంబర్ నెలతో ముగిసేది. ప్రతి నెల లో 30, 31 రోజులుగా ఉండేవి, మిగతా కొన్ని రోజులకు నెల పేరు లేకుండా లెక్కించేవారు, ఇలా 355 రోజులయ్యేసరికి అందరికి ఇబ్బందికరంగానే ఉండేది. పండుగలు జరుపుకోవడానికి, వ్యవసాయ పంటలు వేయడానికి కన్ఫ్యూషన్ గా ఉండేది. ఎందుకంటే ఈ సారి వచ్చిన పండుగా వచ్చే సంవత్సరానికి ఇదే తేదికి రాకపోయేది. అలాగే పంటలు వేయడానికి కూడా తేదీల్లో తేడా వచ్చేది, దాని వల్ల వారికీ తికమకగా ఉండేది. 

          ఆ తరువాత రోమన్ రెండవ చక్రవర్తి నుమా పొంపిలిస్ అప్పటివరకు ఉన్న క్యాలెండర్ కు జనవరి మరియు ఫిబ్రవరి నేలలను జోడించాడు. దానితో 12 నెలల క్యాలెండరుగా మార్పు చెందింది. దానితో కూడా ఎవరు సంతృప్తి పొందలేదు. అయినా ఆ క్యాలెండర్ క్రీ. పూ. 506 వ సంవత్సరం వరకు నెట్టుకొచ్చింది. ఎందుకంటే క్రీ. పూ. 753 నుండి 506 వ సంవత్సరం వరకు రోమ్ రాచరిక రాజులయిన ఏడుగురు రాజులచే నడిచింది. ఆ తరువాత క్రీ. పూ. 506 వ సంవత్సరం లో రోమన్ రిపబ్లిక్ స్థాపన జరిగి క్రీ. పూ. 27 వ సంవత్సరం వరకు రోమన్ రిపబ్లిక్ గా ఉంది.


          ఈ రోమన్ రిపబ్లిక్ స్థాపన జరిగాక ఎవరు నియంతగా ఎన్నికయితే వారు వారి రాజకీయ అవసరాలకోసం రోమన్ క్యాలెండర్ లో మార్పులు చేస్తూ వచ్చారు. క్రీ. పూ. 46 వ సంవత్సరం లో జూలియస్ సీజర్ ( Julius caesar ) రోమ్ ప్రధాన పొప్ గా ఎన్నికయ్యాక, సాంప్రదాయక రోమన్ క్యాలెండర్ ఎన్నో
మార్పులకు గురైందని గ్రహించి దానికి సంస్కరణ అవసరమని నిర్ణయించుకొని, అలెగ్జాండ్రియన్ సోసిజినెస్ అనే గ్రీక్ ఖగోళ శాస్త్రవేత్త సహాయం తీసుకోని అప్పటి రోమన్ క్యాలెండరు చాంద్రమానం ప్రకారంగా రూపొందించబడింది కావున తను సౌరమానం ప్రకారంగా లెక్కించాలని చూడగా 365.25 రోజులుగా లెక్కించబడినాయి. దానితో అప్పటి రోమన్ క్యాలెండరుకు 10 రోజులు జోడించి సంవత్సరానికి 365 రోజులుగా ఒక కొత్త క్యాలెండరును రూపొందించాడు. అలానే 4సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి నెలకు ఒక రోజు కలపాలని ఆ సంవత్సరాన్నిలీప్ ఇయర్ గా ఉంటుందని చెప్పాడు. మరియు అప్పటివరకు మార్చ్ లో జరుపుకునే కొత్త సంవత్సరం జనవరి 1తో జరుపుకోవాలని మార్పులు చేసి క్రీ. పూ. 45 వ సంవత్సరం లో ప్రవేశపెట్టాడు. ఇలా జూలియస్ సీజర్ తో రూపొందింది కావున ఈ క్యాలెండర్ను జూలియస్ క్యాలెండర్ గా పిలువబడింది. 

          క్రీ. పూ. 44 లో జూలియస్ సీజర్ హత్యకు గురైన తర్వాత అతని వారసుడు మార్క్ ఆంటోనీ జూలియస్ గౌరవార్ధం జూలియస్ జన్మించిన నెలైన క్విటిలిన్ (Quintilis) ను జులై గా మార్చాడు. ఆ తర్వాత  క్రీ. పూ. 27 లో అగస్టస్ (Augustus) రోమ్ నియంత్రణ భాద్యతను పొంది రోమ్ చుట్టూ ఉన్న దేశాలను కలుపుకొని ఒక పెద్ద రోమ్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. క్రీ. పూ. 9 వ సంవత్సరం వరకు లీప్ సంవత్సరం 4సంవత్సరాలకు ఒకసారి కాకుండా ప్రతి 3సంవత్సరాలకు లెక్కించారు మత పెద్దలు, అలా 36 సంవత్సరాలు కొనసాగించారు. అది గమనించిన అగస్టస్ దానిని సరైన స్థానానికి తీసుకరావడానికి 12 సంవత్సరాలు లీప్ ఇయర్ ను రద్దు చేసాడు. క్రీ. పూ. 8 వ సంవత్సరం లో అగస్టస్ గౌరవార్ధం అప్పటివరకు  సెక్సటిలిన్ గా ఉన్న నేలను అగస్ట్ (August) గా మార్చారు. తిరిగి క్రీ. శ. 4 వ సంవత్సరం నుండి జూలియస్ ప్రతిపాదించిన విదంగా లెక్కించారు, తద్వారా తదుపరి లీప్ ఇయర్ క్రీ. శ. 8 వ సంవత్సరం నుండి కొనసాగింపబడినాయి. 

          ఆ తర్వాత కొందరు చక్రవర్తులు కొన్ని నెలల పేర్లను మార్చారు కానీ అవి అంత ప్రాముఖ్యత పొందక వాటి పాత నెలల పేర్లతోనే చలామణి అయినాయి. ఈ జూలియస్ క్యాలెండరు రోమన్ సామ్రాజ్యంలో ఎక్కువ భాగం ప్రామాణికంగా తీసుకోనబడలేదు. కొత్త సంవత్సరాన్ని కూడా జనవరి 1న కాకుండా పాత రోమన్ క్యాలెండర్ మాదిరిగా మార్చ్ లో జరుపుకున్నారు. ఎందుకంటే జూలియస్ తప్పుగా లెక్కించాడని వారు భావించారు. అలా వారు భావించింది కూడా నిజమైంది తర్వాత. అది ఏమిటంటే జూలియస్ సౌరమానం కంటే సంవత్సరానికి 11నిమిషాలు ఎక్కువ లెక్కించడం వల్ల 1000 సంవత్సరాలకు 7రోజులు మరియు 15వ శతాబ్దం మధ్య నాటికీ ఏకంగా 10రోజులు ఎక్కువ కలిసాయి. 

          క్రీ. శ. 1570 లో దీనిని గ్రహించిన రోమ్ చర్చ్ పోప్ గ్రెగొరీ XIII ( Pope Gregory XIII) దీనిని సవరించాలని జేసుయిట్ ఖగోళ శాస్త్రవేత్త క్రిస్టోఫర్ (క్రిస్టోఫర్) తో కలిసి జూలియస్ క్యాలెండరును కొద్దిగా సవరించి ఒక కొత్త క్యాలెండర్ ను క్రీ. శ. 1582 లోతీసుకువచ్చాడు. అదే గ్రెగోరియన్ క్యాలెండర్. జూలియస్ తన క్యాలెండర్ లో సంవత్సరానికి 365.25 రోజులుగా లెక్కించగా, ఈ గ్రెగొరీ తన గ్రెగోరియన్ క్యాలెండర్ లో సంవత్సరానికి 365.2425 గా లెక్కించి, అప్పటికి 10 రోజులు ఎక్కువున్నవాటిని తొలగించి, జూలియస్ క్యాలెండర్ లోని లీప్ ఇయర్ ను కూడా కొద్దిగా సవరించి లీప్ ఇయర్ అనేది ఆ సంవత్సరాన్ని 4 అంకెతో సరిగ్గా భాగించబడితే అది లీప్ ఇయర్ అవుతుంది మరియు శతాబ్దాన్ని మాత్రం 400 అంకెతో సరిగ్గా భాగించబడితే అది లీప్ ఇయర్ అవుతుందని ప్రతిపాదించాడు. అనగా శతాబ్దం అనగా 1700,1800,1900,2000 లాంటివి కానీ ఇందులో లీప్ ఇయర్ మాత్రం 2000వ సంవత్సరం. ఎందుకనగా 2000 మాత్రమే 400తో సరిగ్గా భాగించబడుతుంది. 

          ఈ గ్రెగొరీ రూపొందించిన గ్రెగోరియన్ క్యాలెండరు సౌరమానానికి కొద్ది దగ్గరగా లెక్కింపబడినది కావున ఈ క్యాలెండరు మెల్లి మెల్లిగా ప్రపంచంలోని అన్ని దేశాలు అనుసరించడం మొదలెట్టినాయి. పొప్ గ్రెగొరీ XIII కూడా జూలియస్ చెప్పినట్టుగానే కొత్త సంవత్సరం జనవరి 1నే అని నిర్ధారించాడు. అలాగే ఫ్రాన్స్ చక్రవర్తి చార్లెస్ కూడా అప్పటివరకు 11వ నేలగా అనుసరిస్తున్న జనవరి ని మొదటి నేలగా ఉంచి నూతన సంవత్సరాన్ని ప్రారంభించాడు. దానితో కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీన జరుపుకోవడం మొదలయింది. 

          ఎందుకు ఈ జనవరి 1నే జూలియస్, గ్రెగొరీ ప్రతిపాదించారనేదానికి సరైన అధరాలు లేవుకాని చరిత్రకారులు చెప్పేదేమంటే, డిసెంబర్ 25న జీసస్ జన్మించి జనవరి 1కి 8రోజులు అవుతుంది. ఆ రోజు జీసస్ కు నామకరణం చేసారని ఆ రోజు ప్రార్ధనలు జరుపుతారు కావున దానికి గుర్తుగా జనవరి 1ని కొత్త సంవత్సరంగా నిర్ధారించి ఉంటారని చెబుతారు. అంతేకాక ఈ రోమన్ మరియు జూలియస్ క్యాలెండర్ లోని నెలల పేర్లను పరిశీలిస్తే కారణం ఏంటో తెలుస్తుందంటారు.

          జనవరి అనేది రోమన్ దేవుడు అయినా  జానుస్ (Janus) నుండి వచ్చింది. జానుస్ దేవుడికి రెండు ముఖాలు ఉంటాయి, ఒక ముఖం గడిచిన కాలం చూస్తుంటే, రెండో ముఖం రాబోయే కాలంను చూస్తుంది. కావున ఇది ఒక కారణం అయిఉంటుంది అని అంటారు. 

అలాగే మిగతా నెలల పేర్లు కూడా పరిశీలిద్దాం ఒకసారి. 

ఫిబ్రవరి (February)  -  ఫెబ్రా (Febra) అనే పండుగ నుండి వచ్చింది. 

మార్చ్ (March)  -  మార్స్ (Mars) అనే రోమన్ దేవుడు నుండి వచ్చింది. ఈ దేవుడు యుద్దానికి మరియు వ్యవసాయానికి అధిపతి. వ్యవసాయ పనులు కూడా ఈ నెలలోనే మొదలుపెట్టేవారు. కావున ఈ నెలనే కొత్త సంవత్సరంగా జరుపుకునేవారు. 

ఏప్రిల్ (April)  - ఇది రోమన్ క్యాలెండర్ లో రెండవ నెలగా ఉండేది. ఏప్రిలిస్ (Aprilis) అనే పేరు నుండి వచ్చింది. ఏప్రిలిస్ అంటే వికసించడం అని అర్ధం, ఈ నెలలోనే పంటలు మొలకెత్తడం, చెట్లకు పూలు పూయడం మొదలవుతాయి.

మే (May)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో మూడవ నెలగా ఉండేది. మైస్ (Maius) అనే దేవుడి పేరుమీద గుడి వార్షికోత్సవాలను, పుట్టినరోజులను ఒక పండుగగా చేస్తారు. అందులోనుండి వచ్చింది. 

జూన్ (June)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో నాల్గవ నెలగా ఉండేది. రోమన్ దేవత అయిన జూనో (Juno) నుండి వచ్చింది. ఈ దేవత ప్రేమ మరియు వివాహాల యొక్క దేవత. ఈ నెలల్లో వివాహం చేసుకోవడం అదృష్టంగా భావించేవాళ్లు.

జులై (July)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో క్విటిలిస్ (Quintilis) పేరుతొ ఐదవ నెలగా ఉండేది. క్విటిలిన్ అనగా ఐదు (Five) అని అర్ధం. దీన్ని జూలియన్ (Julian) గౌరవార్ధం జులై (July) గా మార్చారు. 

ఆగష్టు (August)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో సెక్సటిలిన్ (Sextilis) పేరుతొ ఆరవ నెలగా ఉండేది. సెక్సటిలిన్ అనగా ఆరు (Six) అని అర్ధం. దీన్ని 
అగస్టస్ (Augustes) గౌరవార్ధం ఆగష్టు (August) గా మార్చారు. 

సెప్టెంబర్ (September)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో ఏడవ నెలగా ఉండేది.
సెప్టెం (Septem) అనే పదం నుండి వచ్చింది. సెప్టెం అనగా సెవెన్ (seven) అని అర్ధం. 

అక్టోబర్ (October)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో ఎనిమిదవ నెలగా ఉండేది. ఆక్టో (Octo) అనే పదం నుండి వచ్చింది. ఆక్టో అనగా ఎనిమిది (Eight) అని అర్ధం.   

నవంబర్ (November)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో తొమ్మిదవ నెలగా ఉండేది. నోవేమ్ (Novem) అనే పదం నుండి వచ్చింది. నోవేమ్ అనగా తొమ్మిది (Nine) అని అర్ధం. 

డిసెంబర్ (December)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో పదవ నెలగా ఉండేది. డెసెమ్ (Decem) అనే పదం నుండి వచ్చింది. డెసెమ్ అనగా పది (Ten) అని అర్ధం. 

మొదట ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ను కొన్ని దేశాలు స్వీకరించలేదు. జూలియస్ క్యాలెండర్ లోని లోపాలను సరిచేసి సౌరమానం కు దగ్గరగా లెక్కకట్టిందని భావించి మెల్లి మెల్లిగా దీన్ని స్వీకరించడం మొదలెట్టినాయి. దీన్ని ముందుగా క్రీ. శ. 1582 లో స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇటలీ స్వీకరించాయి. అలాగే 1700 లో జర్మనీ, 1752 లో బ్రిటన్, 1873 లో జపాన్, 1875 లో ఈజిప్ట్, 1896 లో కొరియా, 1912లో చైనా, 1916 లో బల్గేరియా, 1918 లో రష్యా స్వీకరించాయి. తర్వాత 17, 18 శతాబ్దంలో తమ ఆదీనంలో ఉన్న అన్ని దేశాలలో బ్రిటిష్ వారు దీన్ని ప్రవేశపెట్టారు. 

          ఇంతటి ప్రసిద్దిగాంచిన ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ లో కూడా కొంత తప్పు ఉంది. అది ఏంటంటే ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరానికి 24సెకనులను ఎక్కువగా లెక్కించుకుంటున్నాము. ఆ ప్రకారంగా 3600 సంవత్సరాలకు ఒక రోజు ఎక్కువ వస్తుంది. 19శతాబ్దంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సర్ జాన్ హెర్షెల్  (Sir John Herschel) దీన్ని సవరించడానికి ఒక ఉపాయం చెప్పాడు. అది ఏమిటంటే రాబోయే 4000 సంవత్సరం ను లీప్ ఇయర్ గా లెక్కించకుండా వదిలివేయడం అని. ఆ తర్వాత దీనిపై కమిటీ కూడా వేశారు, వారు కొన్ని ప్లాన్ లను పరిశీలించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. కానీ అది ఇప్పటి వరకు ఎటు తేలలేదు. జూలియస్ క్యాలెండర్ ప్రకారం ప్రతి 128 సంవత్సరాలకు ఒక రోజు ఎక్కువ వస్తుంది. దాన్ని బట్టి చుస్తే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రస్తుతానికి కొంత ఖచ్చితంగా ఉందని ఉరుకుంటున్నాయి. 

          ఇలా కేవలం అంకెలు కల్గిన క్యాలెండర్ ను తయారుచేయడానికి ఎన్నెన్నో తప్పులు చేసుకుంటూ చివరికి మాదే సైన్స్, ఆ సైన్స్ ను మేమే కనుగొన్నాం, డెవలప్ చేసాము అని చెప్పుకొనే వీళ్ళు ఈ క్యాలెండర్ ను సవరించలేకపోతున్నారు. దానిలోని తప్పును చిన్నదిగా భావించి పరిగణలోకి తీసుకోవటంలేదు. 

          అదే మన ఋషులు సెకండ్ లో మిలియన్ వంతు వరకు వెళ్లి లెక్కించగలిగారు. దానితో రాబోయే లక్షల లక్షల సంవత్సరాలకు మరియు జరిగిపోయిన లక్షల లక్షల సంవత్సరాలలోని ఏ తేదీలో ఏ తిది, వర్జ్యం, దుర్ముహూర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా అనేక వాటిని తెలుపుతుంది. అంతేకాదు ఏ రోజు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అనేది కూడా పక్కగా క్షణాలతో సహా చెబుతుంది. అంతెందుకు మన భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో అనేది కూడా మన వేదాలు ఎప్పుడో చెప్పినాయి. ఇప్పుడు సైన్స్ పెరిగాక దానితో వాళ్ళు కనుగొన్న భూమి వయస్సు మన వేదాల్లో చెప్పినదానికి దగ్గరగా ఉంది. 

          వాళ్లకు సైన్స్ ఇప్పుడు వచ్చింది, అదే మనకు ఆ దేశాల్లో నాగరికత లేనప్పుడే ఇక్కడ వేదాలు ఉన్నాయి. దానితోనే మనం ఎంత కాలమైనా ఖచ్చితంగా లెక్కించగల జ్ఞానం పొందాము. ఒక విషయం ప్రకృతి అనేది క్షణ క్షణం మారుతుంది. అలాంటప్పుడు ఈ రోజటి తేదీ వాతావరణ గుణం వచ్చే సంవత్సరానికి కూడా అలానే ఎలా ఉంటుంది వెర్రి కాకపోతే. అదే మనం ప్రకృతితోనే జీవిస్తాము, దానితోనే జ్ఞానం పొందుతాము. అదే మన ధర్మం కూడా... అందుకే ఇక్కడి ఈ జ్ఞానం గొప్పది. మరి అంతటి గొప్పదైన జ్ఞానంతో వెలిసిన ఖగోళ శాస్త్రంతో రూపొందిన మన పంచాంగం చెప్పిన క్రొత్త సంవత్సరం కాక ఈ జనవరి 1ని క్రొత్త సంవత్సరం అంటే మనం ఎంత దిగజారుతున్నామో మనకే తెలువాలి. 

          మనలో కూడా చాలా పంచాంగాలు ఉన్నాయి, ఒక్కక్క పంచాంగం ఒక్కక్క రోజు క్రొత్త సంవత్సరం అని చెబుతున్నాయి అని సందేహం కలుగుతుంది కదా. 

         ఇక్కడ ఒక పంచాంగం చాంద్రమానం బట్టి ఇంకొ పంచాంగం సూర్యమానం బట్టి లెక్కిస్తుంది. అలాగే భూమి సూర్యుని చుట్టూ ఒక కక్షలో గుండ్రంగా తిరుగుతుంది. అలాంటప్పుడు ఏ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పలేము కదా అందుకు ప్రాశ్చాత్యులు ఏ పాయింట్ ను పరిగణలోకి తీసుకోవాలో తికమక పడి చివరకు ఒక పాయింట్ ను తీసుకున్నారు, కానీ దాన్నే ఎందుకు తీసుకున్నారో సరైన ఆధారాలు లేవు. అదే ఇక్కడ మన జ్ఞానం ప్రకృతితో ముడిపడి ఉంటుంది కావున ఈ దేశ వివిధ స్థల ప్రకృతులను బట్టి తీసుకోవడం వలన మన భారతదేశంలో వారి వారి స్థల ప్రకృతిని బట్టి కొత్త సంవత్సరం ఉంటుంది. 

          ఇలా ఎన్ని పంచాంగాలు ఉన్న చివరకు ఆ తేదీల  తిధిలు, వర్జ్యం, దుర్ముహూర్తం, గ్రహణాలు అన్ని ఒక్కటిగానే చెబుతాయి. చూసారా... మన దేశంలో ఉన్న జ్ఞాన శక్తి. మన స్థలానికి ఉగాది రోజే ప్రకృతి వికసిస్తుంది. క్రొత్తగా ఉంటుంది. ఇంకా మనస్సుకు ఆహ్లాదంగా ఉంటుంది. గమనించుకోండి, మీకు మీరే ... మళ్ళి అదీకాక ఆ సంవత్సరములో ఆటు పోట్లను, విజయాలను ఎలా తీసుకోవాలి అనేది కూడా షట్రుచుల ద్వారా పరిచయం చేస్తుంది. వాటితో పొంగిపోవడం, కృంగిపోవడం కాకుండా ఎలా ముందుకు నడవాలనేది నేర్పేది ఉగాది.

          అదే ఇంగ్లీష్ న్యూ ఇయర్ ఏమి నేర్పుతుంది, పడుకొనే సమయంలో పడుకోకుండా మెలుకువగా ఉండి, అర్ధరాత్రి సమయంలో త్రాగుతూ, తూలుతూ, పిచ్చి పిచ్చి గెంతులు వేస్తూ, పెద్ద పెద్ద సౌండ్ లతో అందరికి డిస్టర్బ్ చేయడం నేర్పుతుంది. తెల్లారి పొద్దుపోయేవరకు లేవకుండా రాత్రి తాగింది దిగకుండా హ్యాంగ్ ఓవర్ గా, బద్దకంగా ఉండటం నేర్పుతుంది. 

          అవును మనం ప్రతిరోజూ కామన్ గా వారి క్యాలెండర్ నే వాడుతున్నాం, కానీ దాన్ని ఎంత వరకు చూడాలో అంతవరకే దాన్ని ఉంచాలి, అంతేగాని దాన్ని తీసుకువచ్చి మన నెత్తిమీద పెట్టుకోవద్దు. మనం ఇప్పుడు ప్రపంచ దేశాలతో ఎన్నో బిజినెస్ లు, కార్యకలాపాలు సాగిస్తున్నాము. కావున వారికీ మనకు ఇబ్బంది కలుగకుండా ఉండడానికి మాత్రమే ఈ క్యాలెండర్ ను చూడాలి అంతే. అయినా ఏముంది దీనిలో ఒక నెల గడవగానే ఇంకో నెల వచ్చినట్లు ఈ జనవరి 1కూడా అలానే వస్తుందే తప్పా ఇంకేమైనా తేడా ఉందా ఇక్కడ భారతదేశంలో!

          ఇక్కడ ఒకటి గమనించుకోవాలి, మనం ఇంగ్లీష్ ను నేర్చుకున్నాం ఎందుకు? మనం కూడా ఈ ప్రపంచ దేశాలతో సమానంగా వ్యాపారాలు సాగించడానికి, దానికోసం వాడి భాషలో వాడితో కమ్యూనికేట్ చేస్తూ వ్యాపారాలు, ఉద్యోగాలు చేయడానికి, అంతేగాని ఇంగ్లీష్ నేర్చుకున్నాం, వాడితో వాడి భాషలో వాడిలా మాట్లాడగలుగుతున్నామని మన మాతృ భాష ఇంగ్లీష్ అని అనం కదా... అలానే ఎలాంటి గొప్పలేని, ప్రకృతితో సంబంధం లేని ఆ క్యాలెండర్ ను వాడుతూ వారి న్యూ ఇయర్ ను మన కొత్త సంవత్సరంగా జరుపుకోవడం పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వంటిది. 

          కావున ఇది గమనించి... ఆలోచించి... ఎంతవరకు దాన్ని మన జీవితాల్లో పాటించాలో అంతవరకే పాటిస్తూ, మన సంస్కృతిని గౌరవిస్తూ మన ధర్మం వైపుకు అడుగులేస్తారని భావిస్తూ.... 

ఈ article యొక్క వీడియో చూడండి.



మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి. 

KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.
 
KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips 


భవతు సర్వ మంగళం   

 
 

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి