Methods of drinking water Part 2


ఆరోగ్యంగా ఉండడానికి నీరు త్రాగే విధానం   Part-2
Methods of drinking water  part-2




          Part-1 లో మనం మంచినీటిని ఎప్పుడెప్పుడు త్రాగాలి ? ఏ ఏ సమయంలో ఏమేమి త్రాగాలి ? అలా పాటించకపోతే ఏమిజరుగుతుంది ? లాంటి విషయాలగురించి తెలుసుకున్నాం.  

అలానే దాని తరువాతి Part ఈ Part-2... 


నీటిని ఎలా త్రాగాలి ?         

           మనలో చాలా మంది గ్లాసులు గ్లాసులు లేక చెంబలులకు చెంబులు పైకెత్తి గట గట త్రాగేస్తారు. ఇలా త్రాగడం చాలా అంటే చాల తప్పు పద్దతి. మంచి నీళ్ళను ఎప్పుడు త్రాగిన చప్పరిస్తూ త్రాగాలి. అంటే మనం వేడి వేడి పాలు త్రాగుతాము చూడండి అలా నీళ్ళను త్రాగాలి ఎప్పుడు త్రాగిన. ఎందుకంటే మనం ఒకసారి చెంబెడు నీళ్ళను ఒకేసారి గట గట త్రాగినదానికీ వేడి పాలలా చప్పరిస్తూ త్రాగినదానికి చాలా వ్యత్యాసం ఉంది.

గట గట త్రాగినదానికి, సిప్ చేస్తూ త్రాగినదానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే!

           మన కడుపులో, తిన్న ఆహారాన్ని అరిగించడానికి అగ్ని ఉంటుంది. ఆ అగ్నిని వృద్ధి చేయడానికి ఆమ్లాలు అంటే Acids వెలువడుతాయి. ఈ ప్రక్రియ సహజసిద్దంగా జరుగుతుంది మన కడుపులో. అలాగే మన నోట్లో లాలాజలం ఊరుతుంది. ఈ లాలాజలం క్షారగుణం కలిగి ఉంటుంది. మనం చిన్నప్పుడు స్కూల్ లో చదువుకున్నాం ఆమ్లాలు, క్షారాలు అని. వీటిని ph value తో కొలుస్తారు. ఆ ph value 7 అయితే న్యూట్రల్ అని, 7 కంటే ఎక్కువగా ఉంటె క్షారం అని, అలానే 7 కంటే తక్కువుంటే ఆమ్లం అని అంటారు. మన కడుపులోని ph value నూ ఎప్పుడూ 7 గా అంటే న్యూట్రల్ గా ఉంచుకుంటే మనిషి 100 సం. లకు పైగా ఎలాంటి అనారోగ్యాలు లేకుండా బ్రతకగలుగుతాడని వాగ్భాటాచార్యులు తమ ఆయుర్వేద శాస్త్రం లో చెప్పారు. 

ఆహరాన్ని అరిగించక ఆమ్లాలు చేసే పని..           

          మనం తిన్న ఆహరం ఈ అగ్ని ప్రభావంతో గంటన్నర వరకు ఉంటుంది కదా... ఆ తరువాత అలా అరిగిన ఆహరం కడుపులో నుండి ప్రేగుల్లోకి వెళ్ళుతుంది. అప్పుడు కడుపు ఖాళీగా ఉంటుంది. ఆహారాన్ని అరింగించడానికి ఉపయోగపడిన ఆమ్లాలు ఇప్పుడు ఖాళీగా ఉన్న కడుపులో అలానే ఉంటె దాని ద్వారా దుష్ఫలితాలు కలుగుతాయి. కావున కచ్చితంగా మనం వాటిని ఈ సమయంలో శాంతింపజేయాలి.  


ఆ ఆమ్లాలను ఎలా శాంతిపజేయాలి?

         అందుకు భోజనం చేసిన గంటన్నర తర్వాత తప్పనిసరిగా నీళ్లను త్రాగాలి. ఈ నీటి ph value 7 కు దగ్గరగా ఉంటుంది. అలా ఆ నీటిని త్రాగడం వలన కడుపులోని ఆమ్లాల గుణం కొంతవరకే తగ్గింప చేయగల్గుతాము, అంతేతప్ప దాని ph value ని న్యూట్రల్ కు తీసుకురాలేము. 

ph value 7 గా అంటే న్యూట్రల్ గా ఎలా తీసుకురావాలి ?

          అందుకు మనం ఈ నీటిని మన నోటిలోని లాలాజలం తో పాటు త్రాగితే కడుపులోని ఆమ్లాలతో ఈ క్షారగుణం కల్గిన లాలాజలం కలిసిపోయి ph value ని న్యూట్రల్ గా మారుస్తుంది. 

          అలా నీటితో లాలాజలం కలవాలంటే నీటిని వేడి పాలు త్రాగినట్టు చప్పరిస్తూ త్రాగాలి. అల కాకుండా నీటిని ఒకేసారి గట గట త్రాగేస్తే లాలాజలం తో కలవకుండా కేవలం నీరు మాత్రమే కడుపులోకి వెళ్ళుతాయి. కావున నీటిని ఎప్పుడు త్రాగిన వేడి పాలు త్రాగినట్టుగా చప్పరిస్తూ త్రాగాలి. 

ph value న్యూట్రల్ గా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటామా ?          

         ఈ ప్రకృతిలో మానవుడు తప్ప మిగతా జీవరాశులు అన్ని ఇదే విదంగా నీటిని త్రాగుతున్నాయి. ఒక్క మానవుడే తప్పుగా త్రాగుతున్నాడు. ఒకసారి గమనించుకోండి... పిట్టలు, పక్షులు అన్ని ఒక్కొక్క బొట్టు నోట్లోకి తీసుకోని తలను అటు ఇటు ఊపుకుంటూ త్రాగుతాయి, అలానే జంతువులైన పిల్లి, కుక్క, పులి అన్ని తమ నాలుకతో అద్దుకొని త్రాగుతాయి. అలా అవి ప్రకృతి నియమాలను అనుసరిస్తున్నాయి కావున వాటికీ ఎలాంటి అనారోగ్యాలు లేవు. 

మా గురువుగారి మాట...          

           మా గురువుగారు చెప్పేవారు ద్రవపదార్ధాలు నమలాలి, ఘనపదార్ధాలను త్రాగాలి అని. దీన్ని గమనిస్తే తెలుస్తుంది... ఏంటంటే నీటిని ఈ విధంగా చప్పరిస్తూ త్రాగటమే అని. 


అలా త్రాగడం వలన కలిగే ఫలితాలు... 

          ఎవరైతే ఊబకాయం, కొలెస్ట్రాల్, షుగర్ లాంటివి ఉన్నవాళ్లు నీరు త్రాగవలసిన సమయంలో ఎప్పుడు త్రాగిన ఇలా చప్పరిస్తూ గుటక గుటకగా త్రాగటం మొదలుపెట్టండి. దానితో వచ్చే ఫలితాలు చుస్తే ఆశ్చర్యం కలుగుతుంది మీకు. ఇన్ని రోజులు త్రాగిన పద్దతి ఎంత పెద్ద తప్పు అని మిరే తెలుసుకుంటారు. 

          ఇదంతా మనం మన లాలాజలాన్ని కడుపులోకి నీటి ద్వారా పంపించడం వాళ్ళ కడుపులోని ఆమ్లాలతో కలిసి దాని ph value ని న్యూట్రల్ గా చేస్తుంది. కడుపు ph value న్యూట్రల్ గా ఉన్నంతకాలం మానవుడు ఆరోగ్యంగా ఉంటాడు. 


నోటిలో ఉండే లాలాజలానికి అంత శక్తి ఉందా ?         

           ఒకటి గమనించండి... ఏదైనా జంతువూ దానికి దెబ్బతగిలితే అది ఏ డాక్టర్ దగ్గరకు వెళుతుంది. అది కేవలం తన నాలుకతో నాకుతుంది ఎప్పటికప్పుడు. దాంతో ఆ గాయం తగ్గుతుంది. 

          ఒకటి గుర్తుతెచ్చుకోండి.. మనం కూడా ఇలానే చేసేవాళ్ళం చిన్నప్పుడు. దెబ్బతగలగానే దానిపై మన నోటిలోని ఉమ్మును రాసేవాళ్ళం. అలా అది కొన్ని రోజులకు తగ్గిపోయేది. అంటే మన నోటిలో ఉరే ఆ లాలాజలానికి అంతటి గొప్ప శక్తి ఉంది. ఈ లాలాజలం తయారుకావడానికి మన నోటిలో ఎన్నో లక్షల గ్రంధులు ఉన్నాయి. 


మరి దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి?         

           ముఖ్యంగా ఉదయం పూట అనగా నిద్రనుండి లేవగానే మన నోటిలో ఉండే లాలాజలం ఎన్నో వేల రెట్ల ఔషధగుణాలు కలిగి ఉంటుంది. అందుకోసం మనం ఉదయం నిద్రలేవగానే నోరు కడుక్కోకుండా, బ్రష్ లాంటివి చేయకుండా నీళ్లను గుటక గుటకగా చప్పరిస్తూ ఆ నీరు లాలాజలంతో కలిసిపోయేటట్లుగా చేస్తూ త్రాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ఫలితాలు కలుగుతాయి. 
         
         అందుకోసం మన నోటిలో ఉరే లాలాజలాన్ని ఎప్పుడు వృధా చేయకండి. కొందరు దీన్ని ఎప్పటికప్పుడు ఉసేస్తారు. అలా చేయకండి. ఇలా నోటిలో ఉరే లాలాజలాన్ని ఒకే ఒక సందర్బంలో మాత్రమే ఉమ్మివేయాలి. అది ఎప్పుడంటే జలుబు, దగ్గు ఉన్నప్పుడు మాత్రమే. ఇలా ఉదయమే నీటిని త్రాగడాన్ని ఉషాపానం అంటారు. 

ఉషాపానం అనగా?

          ఉషోదయపు వేళలో నీటిని సేవించడం అన్నమాట. ఉషోదయం అనగా సూర్యోదయ సమయం అని, అంతేగాని ఏ 7, 8 గంటలకో నిద్ర నుండి లేచి ఉషాపానం చేస్తా అంటే అది కాదు. సూర్యోదయానికి ముందే ఉషాపానం చేసేసి ఉండాలి. అది సరైన పద్దతి. 

          ఉషాపానం చేసే నీరు గోరువెచ్చగా ఉండాలి. అంతేగాని చల్లని నీరు, ఫ్రిడ్జ్ లోని నీరు త్రాగకూడదు. నీటిని ఎప్పుడైనా గోరువెచ్చటి ఉష్ణోగ్రతలోనే తీసుకోవాలి. 

గోరువెచ్చటి ఉష్ణోగ్రత అనగా ?

          మన శరీరంలో ఉండే ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండే ఉష్ణోగ్రతలో ఉండే నీళ్ళు అన్న మాట. అంతేగాని మరి చల్లని నీరు, ఫ్రిడ్జ్ వాటర్ అసలుకే త్రాగకూడదు. అదీనూ ఉషాపాన సమయంలో మరియు రోజు మొత్తంలో అయినా. ఈ ఉషాపానం అనేది మాత్రం మనకు దాహం అయినా కాకపోయినా కచ్చితంగా త్రాగాలి శ్రేయస్కరం. 

చల్లని నీరు త్రాగడం వలన ఏమి జరుగుతుంది?   

           ఇలా చల్లని నీరు త్రాగటం వలన మన కడుపు ఉష్ణోగ్రత పడిపోతుంది. అలా దాని ఉష్ణోగ్రత పడిపోవడం వలన మన కడుపులతో అనుసంధానంగా శరీరంలోని అన్ని అవయవాలు కలిసివుంటాయి. ఇలా కడుపు యొక్క ఉష్ణోగ్రత పడిపోవడం వలన ఆ ఉష్ణోగ్రతను పెంచడానికి అధిక శక్తి కావాల్సివస్తుంది, అందుకు రక్తం ఎక్కువ మొత్తంగా కడుపు దగ్గరకు చేరుతుంది. ఇలా మిగత అవయవాలకు అందవలసిన రక్తం అందకుండా పోతుంది. దాంతో ఏ ఏ అవయవాలకు రక్తం అంధదో ఆ అవయవాల పనితీరులో మార్పు వస్తుంది. ఇలా ప్రతిసారి జరుగుతుందంటే కొద్దీ సం. లకు ఆ అవయవం పూర్తిగా పనిచేయకుండా పోతుంది జాగ్రత్త. 

          ఇలా రక్తం అందకుండా ఉండే మొదటి అవయవాలు ఏంటంటే ప్రేగులు. ఇలా చల్లని నీరు త్రాగినప్పుడల్లా వాటికీ రక్తం సరిగా అందక అవి కుచించుకుపోతాయి. అలా చాలాసార్లు ఇలానే జరుగుతుంటే వాటిలోని సంకోచ వ్యాకోచాలు ఆగిపోయి, తిన్నా ఆహరం జీర్ణం కాక, గ్యాసులాంటి  సమస్యలు ఇంకా మలబద్దకం, చెడు కొలెస్ట్రాల్ పెరగడం లాంటి ఇంకా ఎన్నో వ్యాధులకు దారితీస్తుంది. కావున ఎప్పుడు చల్లని నీరు, ఫ్రీడ్జ్ వాటర్ త్రాగకండి. 
     

నీటిని త్రాగినప్పుడల్లా వేడి చేసుకొని త్రాగేలా?      

          గోరువెచ్చని నీరు అన్నాం కదా అని త్రాగినప్పుడల్లా వేడి చేసుకొని త్రాగనవసరం లేదు. రోజులో ఒకసారి నీటిని కాచి చల్లార్చి రోజంతా ఆ నీటిని త్రాగితే సరిపోతుంది. 

Methods of drinking water part 2 యొక్క వీడియో చూడండి. 



మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి. 

KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.
 
KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips 


ఇంకా ఉంది...

          తర్వాత భాగం పార్ట్-3 లో ఇంకా కొన్ని విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. 

ఇవి కూడా చదవండి... 


Simple methods to control diabetes

Full detail information about curd


                       భవతు సర్వ మంగళం      


            

కామెంట్‌లు