Why Bharat called India

భారత దేశానికి ఇండియా అనే పేరు ఎలా వచ్చింది ?

Why Bharat called India ?




          మనం నివసించే ఈ దేశానికి భారతదేశం, హిందుస్థాన్, ఇండియా అని పేర్లు ఉన్నాయి. హిందీ లో భారత్, హిందుస్థాన్ అని, అదే ఇంగ్లీష్ లో అయితే ఇండియా అని అంటారు, వ్రాస్తారు. ప్రపంచంలో ఏ దేశానికైనా ఇలా ఉందా? ఒక మనిషి పేరైన, దేశం పేరైన ఏదైనా పేరును ఏ భాషలో రాసినా ఆ పేరును అలానే రాస్తారు, చదువుతారు కూడా. ఉదాహరణకు జపాన్, నేపాల్ ఇలా ఏ దేశం పేరును తీసుకున్నా, తెలుగు లో అయినా హిందీ లో అయినా ఇంగ్లీష్ లోనైన ఒకేలా రాస్తాం. అదే మన దేశం పేరును మాత్రం భారతదేశం అని రాసుకుంటే, ఇంగ్లీష్ లో మాత్రం దాన్ని ఇండియా అని రాస్తారు, చదువుతారు, చివరికి ఇండియా అనే అంటారు. ఏంటి ఇది? ఒక్క మన దేశానికే ఇలా ఎందుకు ఉంది ?

           మనం స్కూల్లో చదువుకున్నప్పుడు పుస్తకాల్లో భారతదేశంగా చదువుకున్నాం. కానీ బయటి ప్రపంచంలో మాత్రం భారతదేశానికి బదులు ఇండియా అనే వింటున్నాము, అలానే మనం కూడా గత్యంతరం లేక ఇండియా అనే చెప్పుకుంటున్నాము. ఇలా ఎందుకు జరిగింది? 

          భారతదేశం అనే పేరు చాలా పురాతనమైనది. ఇది మన దేశంపై ఎవ్వరూ దండెత్తి రాని కాలానికి పూర్వమే ఉన్న పేరు. మనం దేశంపై ఒక్కోక్కరు దండెత్తి రావడం, మన సంస్కృతి, సంపదను దోచుకోని పోవడం దానితో మన దేశ గొప్పతనం ప్రపంచానికి తెలిసి ప్రతిఓడు మన సంపద పై కన్నేసి ఎలా కొల్లగొట్టాలని ఆలోచించినవారే... మన దేశం స్వర్గంలా తలపిస్తుందని, ఇక్కడి జ్ఞానంను, సంపదను కొల్లగొట్టడానికి పర్శీయన్ లు, ముస్లింలు, మొగలాయి లు, గ్రీకులు, రోమన్ లు, బ్రిటన్ లు దండెత్తి వచ్చి, వారి మిడి మిడి జ్ఞానంతో మన సంస్కృతంను అర్థం చేసుకోలేక, సరిగా పలకలేక దానితో వచ్చిన తిప్పలే ఇది. ఎవడికి నోరు ఎలా తిరుగుతుంటే అలా పిలిచి, అదే పేరునా చరిత్రలోకి ఎక్కించి, అదే పేరు మన దేశం పేరు అని మన పైనే రుద్దడం లాంటివి చేయడం ద్వారా మన భారతదేశానికి ఇండియా అనే పేరు వచ్చింది.


ఇంతకీ ఏ ఏ పేరు ఎవరి వల్ల వచ్చిందో తెలుసుకుందాం...


           క్రీ.పూ. 513 వ సంవత్సరంలో డారియస్ (Darius I) అనే పర్శీయన్ రాజు మన దేశం కు సింధూ నది మీదుగా వచ్చాడు. 

 పర్శీయన్ వాళ్ళకు 'S' పలకడం రాదు, అందుకు వాళ్ళు 'S' కు బదులు 'H' పలుకుతారు. దానితో వాళ్ళు సింధూ (Sindhu) కు బదులు హిందు (Hindu) గా పలికేవారు. అలా మెల్లి మెల్లిగా వారు మన దేశంను హిందు గా పిలిచి పిలిచి మనల్ని హిందూస్ (Hindus) అని అనేవారు. ఇలా మనకు హిందువులు (Hindus) అనే పేరు వచ్చింది. 

           ఇలా మన దేశం యొక్క గొప్పతనం పశ్చిమం వైపు పాకింది. దానితో గ్రీక్ దేశస్థులు, రోమన్ దేశస్థులు మన దేశానికి వచ్చారు. అప్పుడు వాళ్ళు 'Hindus' అనే పేరులోని 'H' ను తీసివేసి 'Indus' గా మార్చారు. ఎందుకంటే వీళ్ళకు కూడా పలకడంలో ఇబ్బంది ఉండేది, అందుకు 'Hindus' అనే పేరులోని 'H' తీసివేసి 'Indus' అనే పలికినారు. 

           ఆ తర్వాత 11వ శతాబ్దంలో ఇరాన్ ముస్లిం ఫిలాసఫర్ మన దేశ సంస్కృతిని తెలుసుకోని హిందూవులు నివసించే ప్రాంతం కాబట్టి మన దేశానికి హిందూస్థాన్ (Hindustan) గా పేరు మార్చారు. అలా మన దేశానికి హిందూస్థాన్ అనే పేరు వచ్చింది.

           ఆ తరువాత బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చాకా గ్రీక్ లు, రోమన్ లు పిలిచె 'Indus' అనే పేరును ఈ బ్రిటిష్ వాళ్ళు 'India' గా పిలవడం మొదలుపెట్టారు, అలానే మన దేశంలో ఉన్న సంపదను, సంస్కృతిని, జ్ఞానంను ఎలా కొల్లగొట్టాలా అని జరిపిన ప్రయత్నం లోనే మన దేశం పేరును ఇండియా గా మార్చి, ఇదే మన మాతృభూమి పేరు అని అనుకునే విధంగా మన చదువుల్లో, మన బుద్ధి లో చొప్పించారు. ఇలా ఈ పేరు ఒక్కటే కాదు, వాళ్ళు మన జ్ఞాన గ్రంథాల్లో కూడా వేళ్ళు పెట్టి, వారి మిడి మిడి జ్ఞానంతో వచ్చి రాని సంస్కృతంతో వాళ్ళు వాటిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసారు. అలా ట్రాన్స్లేట్ చేసే క్రమంలో మన మూల గ్రంథాల్లో, శాస్త్రాల్లో లేనివి కూడా చొప్పించి పబ్లిష్ చేయించి ప్రపంచంలోకి వదిలారు. వాటిని తిరిగి మళ్ళీ మన భాషలలోకి అనువదించేసి ఇదిగో మీ శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఇంత తప్పు ఉందని నమ్మించారు. అలానే మన సంస్కృతిలో లేని సాంప్రదాయాల్నీ కూడా చొప్పించి, మీ సాంప్రదాయాలు ఎంత మూడంగా ఉన్నాయి అని ఇక్కడ నివసించే విభిన్న మతాల వారి మధ్య గొడవలు సృష్టించారు. ఇప్పుడున్న కొన్ని మూడ సాంప్రదాయాలలోని కొన్నింటినీ మూఢనమ్మకాలు అని అనుకుంటున్నాము కదా!  వాటిని అప్పుడు పుట్టించినవే. మన సనాతన సంస్కృతిని తప్పుగా చూపెట్టడానికే ఇలా చేసి వాటిని చరిత్ర లోకి ఎక్కించారు. వాటినే ఇప్పటి నాస్తికులు అని చెప్పెవారు, వాటినే పట్టుకోని ఇదా సాంప్రదాయం! ఇవన్నీ మూడసాంప్రదాయాలు, వీటి ద్వారా మనిషీ, దేశ పురోగతికి అడ్డువస్తున్నాయని, మన దేశ జాతి సంస్కృతినే తప్పు అంటున్నారు. కానీ ఇవన్నీ అప్పుడు పుట్టిన తప్పిదాలే. మన సనాతన సంస్కృతిని తెలుసుకోవాలంటే ఇలా తప్పులు కల్గిన వాటిని కాకుండా మన అసలైన మూలగ్రంథాలనే చదివండి. 

           హిందు, హిందూస్థాన్, ఇండస్, ఇండియా అనే ఈ పేర్ల గురించి తెలుసుకున్నాం. అలానే వీటికంటే ముందు ఎన్నో వేల సంవత్సరాలకు పూర్వమే ఉన్న పేర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం... 

          మన పురాణాలలో, శాస్త్రాల్లో సందోర్భచితంగా ఎక్కడ ఏ పేరు వాడాలో ఆ పేరును వాడారు మన పూర్వీకులు. అలాంటి పేర్లలో ముఖ్యమైనవి... జంబుద్వీప్, ఆర్యవర్తనం, భారత్ వర్షం. ఇందులో మొదటిది జంబుద్వీపం. ఇది చాలా పురాతనమైన పేరు. ఈ పేరును మన సాంప్రదాయంలో చేసే పూజలు, యజ్ఞాలు చేసేప్పుడు సంకల్పం చెప్పుకునెప్పుడు చెప్పె మంత్రంలో ఈ పేరు ఉంటుంది. ఈ ప్రాంతంలో జంబులా చెట్లు ఎక్కువగా ఉండేవి, అందుకు దీనిని జంబుద్వీపం అంటారు. జంబూలా అనేది సంస్కృత పదం. దీని అర్థం ఏమనగా నేరెడు అని. ఈ ద్వీపం లో నేరెడు చెట్లు చాలా పెద్ద పెద్దగా ఎక్కువగా ఉంటాయి. అందుకు ఈ పేరు వచ్చింది. ఈ జంబుద్వీపం ఇప్పటి భారతదేశం హద్దులుగా లేదు. ఇది మన దేశంతో పాటు ఆసియా, యూరోప్ లో దాదాపుగా అంతా విస్తరించి ఉండేది. అందుకే ద్వీపం అన్నారు.

           ఆ తర్వాత ఆర్యవర్తనం. ఇది కూడా చాలా పురాతనమైన పేరు. ఇక్కడ వేదాలు వెలసి ఒక ధర్మ బద్ధమైన జీవనం సాగిస్తుండేవారు. ఇలా ధర్మంతో జీవించేవారిని ఆనాడు ఆర్యులు అనేవారు. అధర్మంగా నడిచేవారిని అనార్యులు అని అనేవారు. ఇలా ధర్మంతో జీవించే నేల కావున దీనిని ఆర్యవర్తనం అన్నారు. 

          ఇగ భరతవర్షే. ఈ పేరు ఒక రాజు పేరు మీదుగా వచ్చింది. కురువంశానికి చెందిన పాండవుల కంటే ఎన్నో తరాల ముందు తరంకు చెందిన దుష్యంతుడు, శకుంతల కొడుకు అయిన భరతుడు అనే రాజు ఈ ఖండాన్ని ఎంతో సుసంపన్నంగా, ధర్మ పథంలో పరిపాలించారు. అందుకు ఈ భూమికి భరతవర్షం అని భారతదేశం అని పేరు వచ్చింది.

ఇదండీ మన దేశం యొక్క పేర్ల చరిత్ర. ఇలా వేదకాలం నుండి మన దేశం యొక్క పేరు జంబుద్వీపం, ఆర్యవర్తనం, భరతవర్షం, హిందూస్, హిందూస్థాన్, ఇండస్ అని చివరికి ఇండియా గా మారుతూ వచ్చింది. అయినా మనం మన దేశ రాజ్యాంగంలో మొదటి ఆర్టికల్ లో ఇండియా దట్ ఈజ్ భారత్ అని రాసుకున్నాం కూడా. 

వేరే దేశస్థులు వారి నోరు తిరగక పెట్టిన పేర్లు కాక మన నాగరికత నుండి వచ్చిన పేరునే ఉపయోగిద్దాం. కావున మనం మన దేశం ను ఇండియా కంటే భారత్ అనే పిలుచుకుందాం. 

జై భారత్.



ఈ ఆర్టికల్ యొక్క వీడియో ను చూడండి.




 మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి. 


KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.

KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips  

ఇవి కూడా చదవండి... 

History of Jan 1st New Year

గణపతి ఉత్సవాల వెనక అసలు రహస్యం

స్వదేశీ ఉద్యమం 

తలవెంట్రుకల జీవితకాలం ఎంతో తెలుసా...?

     

 ఈ ఆర్టికల్ మీకు నచ్చినదని భావిస్తూ... 

భవతు సర్వ మంగళం.





కామెంట్‌లు