Methods of drinking water Part-3


ఆరోగ్యంగా ఉండడానికి నీరు త్రాగే విధానం   Part-3

Methods of drinking water  part-3





 Part-1 & Part-2 లో మనం మంచినీటిని ఎప్పుడెప్పుడు త్రాగాలి ? ఏ ఏ సమయంలో ఏమేమి త్రాగాలి ? అలా పాటించకపోతే ఏమిజరుగుతుంది ? ఆ water ని ఎలా త్రాగాలి? ph value, చల్లటి నీరు, ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా గోరువెచ్చటి నీటినే త్రాగాలని మొదలైన విషయాల గురించి తెలుసుకున్నాం.  


అలానే వాటి తరువాతి Part ఈ Part-3... 

ఆ నీటిని ఎందులో త్రాగాలి ?

          మనం చిన్నప్పటి నుండి గ్లాసులోనే నీళ్ళను త్రాగుతున్నాం. దాదాపుగా 90 శాతం మంది ఇలానే త్రాగుతున్నారు కూడా. కానీ అది సరియైనది కాదు. 

          ఈ గ్లాసు అసలు భారతదేశానిది కాదు, ఇది పోర్చుగీసు వాళ్ళది. అక్కడి నుండి మన భారతదేశానికి వచ్చింది. అంతకు ముందు మన భారతదేశంలో చెంబులు ఉండేవి. వాటిలోనే త్రాగేవాళ్ళం. ఎప్పుడు త్రాగినా ఈ చెంబులోనే త్రాగండి, గ్లాసులో త్రాగకండి. 

ఎందుకు చెంబులు మంచివి ?          

ఎందుకంటే గ్లాసులోని నీటికి సర్ఫేస్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. సర్ఫేస్ టెన్షన్ అనగా ఉపరి తలతన్యత అని అర్ధం. ఎలా అనగా గ్లాసు కింది నుండి పై వరకు ఒకే పరిమాణంలో లేక కింది నుండి పైకి వస్తుంటే ఉపరితం ఎక్కువగా ఉంటుంది. అందువలన దాని సర్ఫేస్ టెన్షన్ ఎక్కువగా ఉండి, అందులోని నీటికి కూడా సర్ఫేస్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. అదే చెంబులు అయితే గుండ్రంగా ఉండి వాటి ఉపరితలం తక్కువగా ఉండటం వలన దాని సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉండి, అందులోని నీటికి కూడా సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉంటుంది. 

సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉండటం వలన లాభం ఏంటి?          

ఇలా సర్ఫేస్ టెన్షన్ తక్కువ ఉన్న నీటికి శుబ్రపరిచే గుణం కలిగివుంటుంది. దానితో శరీరంలోని మలినాలను శుభ్రం చేయగలుగుతుంది. అందుకే మన పూర్వికులు బావిలోని నీరు, చెరువులోని నీటినే త్రాగడానికి ఉపయోగించేవారు. ఎందుకంటే బావి, చెరువులు గుండ్రంగా ఉంటాయి. అందువల్ల వాటిలోని నీటికి సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉండి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అదే నదులు పొడుగ్గా ఉంటాయి కావున వాటి సర్ఫేస్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. అందుకోసం మీరు గ్లాసులకు బదులు చెంబులో నీరును త్రాగండి. ఇంకొక విషయం చల్లటి నీటిలో కూడా సర్ఫేస్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. అదే గోరువెచ్చటి నీటిలో సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉంటుంది.

మరి అలా అయితే ఎండకాలంలో కూడా గోరువెచ్చని నీటినే త్రాగాలా ?

          అంటే ఎండకాలంలో మీరు మట్టితో చేసిన కుండలోని నీరు త్రాగవచ్చును. మట్టి కుండలోని నీటిని వేడి చేయనవసరం లేదు. ఎందుకంటే మట్టి కంటే నీటిని శుద్దిచేయగలిగినది మరొకటిలేదు కనుక. 

          ఎండకాలంలో మాత్రమే మట్టికుండలు వాడాలా? మిగతా కాలంలో ఏమి వాడాలి?

ఎండకాలంలో కాకుండా మిగతా కాలంలో కూడా వాడవచ్చు కానీ ఎండకాలంలో మాత్రమే ఈ మట్టికుండలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

          అదే వర్షాకాలంలో మీరు రాగి బిందెలలోని నీటిని త్రాగాలి మంచిది. రాగి బిందె అనగానే ఒకటి గుర్తుకొస్తుంది... ఈ మధ్యలో రాగి బిందె, రాగి గ్లాసు, రాగి బాటిల్ వాడకం పెరిగింది. ఇలా ప్రతి రోజు రాగి పాత్రలోని నీరు త్రాగటం కూడా మంచిది కాదు అని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. రాగి పాత్ర ఏదైనా 3 నెలలు వాడాక మధ్యలో కనీసం ఒక 20 రోజులు వాడకుండా తిరిగి మళ్ళి రాగి పాత్రలను వాడవచ్చు. అలా కాకుండా రోజు రాగి పాత్రలనే వాడుతుంటే మీలో కాపర్ ఎక్కువై దానితో కొన్ని దుష్ఫలితాలు కలుగుతాయి. కావున వర్షాకాలంలో రాగి బిందెలోని నీరు త్రాగండి. 

          ఆ తరువాత చలికాలం మొదలవగానే బంగారం బిందెలలోని నీరు మంచివి. మళ్ళి ఎండకాలంలో మట్టి కుండలు వాడండి. 

బంగారు బిందె కాకా ఇంకేమైనా పరిష్కారం ఉందా ?

          బంగారు బిందెలలోని నీటిని త్రాగాలి అంటే అంత బంగారు బిందె కొనేంత ఆర్ధిక స్థోమత అందరికీ ఉండదు కదా, దానికో పరిష్కారం ఉంది. 

          చలికాలంలో ఏదైనా బిందె తీసుకోండి, అది మట్టికుండైన ఏదైనా, కానీ ఆ బిందె అల్యూమినియం బిందె మరియు ప్లాస్టిక్ ది కానిది అయి ఉండాలి. ఎందుకంటే అల్యూమినియం వాడటం వలన మనకు ఎన్నో అనారోగ్యాలు కలుగుతాయి. అలానే ప్లాస్టిక్ లో నీరును నిల్వవుంచడం వలన ఆ నీటిలో హానికరమైన బాక్టీరియా రెట్టింపు సంఖ్యలో వృద్ధి చెందుతుంది. కావున అల్యూమినియం, ప్లాస్టిక్ బిందె కాకుండా ఏదైనా బిందెలో బంగారంతో చేసిన గొలుసు గాని, రింగ్ గాని, గాజు గాని ఏదైనా ఒక బంగారు నగను అందులో వేసి ఆ నీటిని త్రాగండి. ఇలా చేయటం వలన బంగారు పాత్రలోని నీటి గుణం మాదిరిగా ఈ నీరు కూడా ఉంటాయి. 

ఎందుకు బంగారు పాత్రలోని నీరు చలికాలంలో మంచిది?

          బంగారం వేడి చేసే గుణం కలిగివుంటుంది. అందువల్ల ఆ నీరు వేడి గుణం పొందుతుంది. కావున చలికాలంలో ఈ నీరు ఎంతో శ్రేయస్కరం. కొందరు వెండి పాత్రలతో నీటిని త్రాగుతారు. ఈ నీరు ఎలాంటి గుణం కలిగి ఉంటుంది అంటే.... చలువ చేసే గుణం. అదే బంగారు పాత్రల నీరు వేడి చేసే గుణం.

బంగారు పాత్రలోని నీటిని సేవించడం వలన కలిగే ఉపయోగాలు...  


          బంగారు పాత్రలోని నీరు ఎన్నో వ్యాధులను నయం చేస్తుంది కూడా. అందులో మెంటల్ డిసీస్, కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళకు, మెంటల్ డిప్రెషన్ వాళ్ళకు, నెగటివ్ థాట్స్ మరియు భయం భయంగా ఉండే ఆలోచనలు కలిగే వాళ్లకు, రాత్రి సరిగా నిద్రపడటం లేదని చెప్పేవాళ్ళకు ఇంకా వయసుతో పాటు మెదడు ఎదగని వ్యక్తులకు ఈ బంగారు పాత్రలోని నీరు ఔషదంగా పనిచేస్తాయి. 

          అంతేకాక ఎవరైనా కఫంతో బాధపడేవారికి ఈ నీరు చాలా మంచి ప్రభావం చూపుతుంది. కఫం అనగా జలుబు, దగ్గు, మైగ్రేన్ లాంటివి. ఈ కఫం యొక్క ప్రభావం మన శరీరంలో ఛాతి నుండి తల పై భాగం వరకు ఉంటుంది. కావున మన పూర్వికులు బంగారంతో చేసిన నగలను కేవలం తలకు, మేడలో, ఛాతి పైనే ధరించేవారు. చేతులకు, కాళ్ళకు వెండితో చేసినవి ధరించేవారు. బంగారం కఫం ను తగ్గిస్తుంది. అందుకు బంగారు పాత్రలోని నీరు చాలా మంచి ప్రభావం చూపుతాయి. 

Methods of drinking water part 3 యొక్క వీడియో చూడండి.




మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి. 

KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.
 
KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips 
 


ఇంకా ఉంది...



          తర్వాత భాగం పార్ట్-4 లో ఇంకా కొన్ని విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. 

ఇవి కూడా చదవండి... 


Simple methods to control diabetes

Full detail information about curd



                       భవతు సర్వ మంగళం 

        

కామెంట్‌లు