శిష్యుడి లక్షణాలు


Qualities of Shishya 


 


        

           ఆధ్యాత్మిక సాధన అనేది గురు శిష్య పరంపరతో వేదకాలం నుండి ఇప్పటి వరకు సాగుతూనే ఉంది. ఈ సాధన పొందాలంటే గురువు అనేవారు ఎంతో ముఖ్యం.

          సాధకుడు ఆ శిక్షను పొంది తాను ఆ మార్గంలో ఉన్నతిని సాధించి, తాను పొందిన ఉన్నత స్థితిని తనతో అంతం అవ్వకుండా అందరు ఆ స్థితిని పొందాలనే, ఆ జ్ఞానాన్ని పంచాలనే ఉద్దేశ్యంతో శిష్యుడికై ఎదురుచూస్తూ ఉంటాడు.

          అలా ఆ సాధకుడు గురుత్వాన్ని పొందుతాడు. అలా అతని ఎదురుచూపుకు సరియైన శిష్యుడు దొరికితే అప్పుడు ఆ గురువు ఎంతో సంతోషిస్తాడు. ఆ శిష్యుడికి తాను పొందిన స్థితిని చేరుకోవడానికి కావాల్సిన మార్గాన్ని సులభతరంగా అందేలా చేస్తాడు.

        ఈ సాధనను పూర్తిగా తన గురువు ఉపదేశించిన మార్గాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్ధం చేసుకొని తాను ఆ ఉన్నత స్థితిని పొందాలంటే ఆ సాధకుడు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఆ లక్షణాలు కలిగి ఉన్నవాడినే శిష్యుడు అనబడతాడు.

         ఆ శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు ఎలాంటివో, వాటి గురించి సత్ గురువులు ఏమని తెలిపారో ఇక్కడ తెలుసుకుందాం...

Ananda Bodhini, Qualities of Shishya

  • అప్రమత్తుడై ప్రతిక్షణం జాగరూకుడై వుండి అభ్యాసం చేసేవాడు సాధకుడు/శిష్యుడు. 
  • శీలసదాచారములు పాటించువాడే సాధకుడు/శిష్యుడు. 
  •  శీలసదాచారములో ప్రతిష్టితుడై తనలో తెలివిని, వివేకమును జాగృతం చేసుకొని చెడునుండి విమోచనం పొందుతూ, సత్కర్ముడిగా, సజ్జనుడిగా తయారవుతూ... సమాధి-ప్రజ్ఞలలో వృద్ధి చెందేవాడు సాధకుడు/శిష్యుడు.
  • సమాధి - ప్రజ్ఞతో తనలోని సత్యములను దర్శించుకుంటూ, అనుభూతి ద్వారా వాటిని తెలుసుకుంటూ తన మనస్సును నిర్మలం చేసుకుంటాడు. 
  •  సాధకుడు ప్రకృతి నియమానుసారం జీవిస్తాడు. 
  • ఇలా ప్రకృతి నియమానుసారం నడవడమే ధర్మం అని గ్రహించి, శుద్ధ ధర్మాన్ని ఆచరించడమే సాధనగా మార్చుకున్న వాడే సాధకుడు/శిష్యుడు.
  • సత్యాన్ని స్వయంగా అనుభవంలోకి తెచ్చుకొనేవాడే సాధకుడు/శిష్యుడు. 

  • అంతర్ముఖుడై సత్వాన్వేషణ చేసే వాడే సాధకుడు/శిష్యుడు.
  • సత్వాన్వేషణ సాధన చేయాలనే ఉత్సాహం, పట్టుదల కలిగి ఉండేవాడే సాధకుడు/శిష్యుడు. 

  • ఎ కారణం వల్లనైనా సాధనలో ఆటంకాలు ఏర్పడినా మరింత ప్రేరణాబలంతో సాధన చేసేవాడే సాధకుడు. 
  • ధర్మాన్ని శరణు పొందినవాడు సాధకుడు/శిష్యుడు. 

గురువు 

బుద్ధ భగవాన్  


gautama buddha, Ananda Bodhini, Shishyudi lakshanalu

 

 

 

 

 

మూలం  

గౌతమ బుద్ధ ధర్మ ప్రబోధాలనుండి...

భారతావనిలో సంచరించిన కాలం 

480 BCE నుండి 400 BCE.


 
  • శిష్యుడనువాడు బాహిరములైన భోగములమీద ఇచ్ఛను వీడవలను, సాధుపుంగవుడైన గురుదేవున్ని ఆశ్రయించవలెను.   
  • అతని చేత ఉపదేశింపబడిన విషయాలపై సమాహితమైన చిత్తముతో ప్రవర్తిల్లుచు ముక్తి కొరకు ప్రయత్నము చేయుచుండవలెను. 
  • నిరంతరము సత్యంను దర్శించుచు ఉండునట్టి నిష్ఠ వహించియుండవలెను. 
  • జిజ్ఞాస కలవాడై గురువును శరణు పొందిన వాడే శిష్యుడు. 
  • బుద్దిమంతుడు, విద్యావంతుడు, తర్కవితర్క చతురత గలవాడే శిష్యుడుగా అర్హుడు అగును. 
  • ఎవనియందు వైరాగ్యము, మోక్షకాంక్షయు తీవ్రదశయందు ఉండునో వానియందే శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధాన గుణములు ఫలవంతములు కాగలుగును.  
  • (శమము :- విషయముల సమూహమందు మాటి మాటికి దోషదృక్పధమును ఏర్పరచుకొని విరక్తి చెందిన మనస్సు తన లక్ష్యమునందు స్థిరముగా నిలిచిపోవుట "శమము" అనబడును.   దమము :- కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను రెండింటిని వాని వాని విషయముల నుండి వెనుకకు మరలించి వాని వాని స్వీయ గోళకములందు నిలుపుట "దమము" అనబడును.   ఉపరతి :-  వృత్తి బాహ్య విషయములను ఆశ్రయింపకుండుట ఉత్తమమైన "ఉపరతి" అనబడును.   తితిక్ష :-  చింతాశోకములకు లోబడక, ఎటువంటి ప్రతీకారాచార్య పాల్పడక యుండుచు సర్వవిధదుఃఖములను సహించుట "తితిక్ష" అనబడును.   శ్రద్ధ :-  శాస్త్రమునందు, గురువాక్యమునందు సత్యబుద్ది కలిగియుండుట "శ్రద్ధ" అనబడును.   సమాధాన :-  తన బుద్ధిని సర్వవిధముల శుద్ధబ్రహ్మమునందు సర్వదా స్థిరపరచుకొని ఉండుటయే "సమాధాన" అనబడును. )
  • ఆత్మ తత్త్వజిజ్ఞాస గల పురుషుడు పైన చెప్పబడిన సాధనా  సంపదను సమకూర్చుకొన్నప్పుడే శిష్యుడు అనబడతాడు. 
  • అప్పుడే ఆ శిష్యుడు స్థితప్రజ్ఞుడు అయిన గురువు వలన భవబంధ విముక్తి పొందగలుగును.  

గురువు 

 
Adi Shankaracharya, Ananda Bodhini, Shishyudi lakshanalu

 

మూలం  

శంకర భగవత్పాదులు రచించిన  వివేక చూడామణి

భారతావనిలో సంచరించిన కాలం 

788 CE నుండి 820 CE.




  •  శరణాగతుడైన వాడే శిష్యుడు. 
  • అతడు తన అహంకారాన్ని, తాను ఫలానా అన్న పరిమిత తత్వాన్ని మరియు గర్వాన్ని తన గురువు పాదాల చెంత ఉంచేవాడు శిష్యుడు.  
  • అతని శరణాగతి అన్నది ఏ నిబంధనలు లేనిది. 
  • ఏ నిబంధనలు లేని ఇట్టి శరణాగతే  ప్రేమ, భక్తి. 
  • శిష్యుడు ఇవ్వడం నుండి వస్తాడు. 
  • శిష్యుడు సంపూర్ణమైన సామర్ధ్యం ఆధారంగా జీవిస్తాడు. అందువలన అతను అంచనాలకు అతీతంగా మరియు సంపూర్ణమైన సృజనాత్మకతతో ఉంటాడు. 
  • శిష్యుడు తనను తాను విశ్లేషించుకుంటాడు. 
  • అతను గురువుని ఎన్నడూ అంచనా వేయడు. 
  • శిష్యుడు సమాధిలో ధ్వందాలకు అతీతంగా జీవిస్తుంటాడు.  

గురువు 

 
bharatsahajavaani

 

 

 

 

 

 

మూలం  

ఋషి ప్రభాకర్ గురూజీ ప్రవచనాల నుండి.....

భారతావనిలో సంచరించిన కాలం 

అగష్టు 30, 1948 నుండి ఫిబ్రవరి 16, 2014.



  • యోగాలో గురువు చాలా ప్రదానం, చాలా అవసరం. ఎందుకంటే ఏకాత్మ సాధించిన వ్యక్తికీ దగ్గరగా మీరుంటే, మీలో కూడా ఏకాత్మ సాధ్యమవుతుంది. 
  •  శిష్యుడంటే స్వీకరించేందుకు సిద్ధంగా, నేర్చుకునేందుకు సంసిద్ధంగా ఉన్నవాడు. 
  •  ఎవరైతే గర్భంలా ఉంటారో, వారిలోకి గురువు చొచ్చుకొని పోగలడు. 
  •  శిష్యుడంటే వెదికేవాడు. 
  •  ఎవరైతే ఏకాత్మ సాధించాలనుకుంటారో, ఎవరైతే రాటుదేలాలనుకుంటారో, కనీసం అందుకు ప్రయత్నిస్తారో, ఎదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారో, నిజాయితీగా ఒక సంపూర్ణ మానవునిగా ఉద్భవించాలని కోరుకుంటాడో, అతని ఉనికిని అతడు గుర్తిస్తాడో, అతనిపై అతనికి పూర్తీ నియంత్రణ కావాలనుకుంటాడో అతడే శిష్యుడు.
  • శిష్యుడిగా తయారవ్వడం అనేది గొప్ప సాధన. 
  • కేవలం శిక్షణ ద్వారానే శిష్యుడిగా తయారవగలడు. 
  • సాధకుడు కేంద్రీకృతమైతేనే, వినయంగా ఉండగలడు, స్వీకరించగలడు, ఖాళీగా ఉండగలడు.అప్పుడే గురువు సాధకుడు లోకి ప్రవేశించగలడు.
  • మీ శూన్యంలో, మీ నిశ్శబ్దంలో... ఆయన మీ దగ్గరికి రాగలడు. మిమ్మల్ని చేరగలడు. మీతో అనుసంధానం సాధ్యమవుతుంది. 
  • ఎవరైతే ఏకాత్మగా ఉంటారో, వినయంగా ఉంటారో, స్థిరంగా ఉంటారో, తెరిచినా మనస్సుతో ఉంటారో, జాగరూకతో ఉంటారో, స్వీకరించగలరో, ఎదురుచూస్తూ ఉంటారో, ప్రార్ధనా మనస్కుడై ఉంటారో వారినే శిష్యుడు అని అనబడుతారు. 


మూలం  

యోగా - మనసులేని మార్గం అనే పుస్తకం లోనిది. 

గురువు 

 
Osho













భారతావనిలో సంచరించిన కాలం 

డిసెంబర్ 11, 1931 నుండి జనవరి 19, 1990.

ఈ ఆర్టికల్ వీడియో చూడండి .... 

 

మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి. 

KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.
 
KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips  


ఇవి కూడా చదవండి...

 నిజాయితీ

 

 



భవతు సర్వ మంగళం

కామెంట్‌లు