ఆరోగ్యంగా ఉండడానికి నీరు త్రాగే విధానం Part-4
Methods of drinking water part-4
Part-1, Part-2 & Part-3 లో మనం మంచినీటిని ఎప్పుడెప్పుడు త్రాగాలి ? ఏ ఏ సమయంలో ఏమేమి త్రాగాలి ? అలా పాటించకపోతే ఏమిజరుగుతుంది ? ఆ water ని ఎలా త్రాగాలి? ph value గురించి, చల్లటి నీరు, ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా గోరువెచ్చటి నీటినే త్రాగాలని, ఆ నీటిని ఎందులో త్రాగాలి? ఆ నీటిని ఋతువుల ప్రకారం ఎందులో స్టోర్ చేసుకోవాలనే విషయాల గురించి తెలుసుకున్నాం.
అలానే వాటి తరువాతి Part ఈ Part-4...
మనం నిత్యం చేసే చిన్న చిన్న తప్పులు..
మనం రోజు చేసే చిన్న చిన్న తప్పులు ఏంటంటే...మనం ఎప్పుడైనా మూత్రం చేసి వచ్చాక వెంటనే నీళ్ళను త్రాగడం చేస్తుంటాము. ఇలా సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు చేస్తుంటారు. ఇది చాల తప్పు. ఎందుకంటే మూత్రవిసర్జన చేసాక మీ కడుపు ఖాళీ అయ్యి దాని కండరాలు రిలాక్స్ అవుతుంటాయి. సరిగ్గా ఆ సమయంలో మీరు నీరు త్రాగడం చేస్తే, రిలాక్స్ అవుతున్న కండరాలపై బరువు పడి ఒక్కసారిగా షాక్ కు గురవుతాయి.
సింపుల్ గా చెప్పాలంటే ఈ కండరాలు స్ప్రింగ్ లా ఉంటాయి. దానిపై బరువు తీయగానే అవి మెల్లిగా దాని ఒరిజినల్ స్థానానికి వస్తుంటాయి, అది వాటి నైజం అలా వాటి చర్య జరుగుతుండగా మల్లి దానిపై వాటి చర్యకు వ్యతిరేకంగా మీ చర్య ఉండటం వలన దాని ఎలాస్టిసిటీ గుణం పై ప్రభావం పడుతుంది. అలా రెగ్యులర్ గా జరుగుతుంటే ఆ కండరాల పటుత్వం తగ్గి దుష్ఫలితాలు కలుగుతాయి. అలంటి వాటిలో ముందుగా అచ్చట దురద కలుగుతుంది, ఆ తరువాత నొప్పి కలుగుతుంది. చివరికి దాని పటుత్వం కోల్పోయి మూత్రాన్ని ఆపుకోలేని పరిస్థితి ఏర్పడి, మూత్రం కొద్దీ కొద్దిగా మాటి మాటికీ వచ్చే లక్షణం వస్తుంది. ఎందుకంటే దాని ఎలాస్టిసిటీ గుణం కోల్పోయింది కాబట్టి మూత్రాన్ని ఎక్కువగా స్టోర్ చేసుకొనే శక్తి ఉండదు దానికి.
మరి దానికి ఏమి చేయాలి ?
అంటే మీరు ఎప్పుడు మూత్రవిసర్జనకు పోయే ముందే నీరు త్రాగి ఆ తరువాత మూత్రవిసర్జన చేయండి. అప్పుడు ఆ కండరాలకు ముందు జరిగినట్లు సడన్ షాక్ కు గురికాదు. కావున ఎలాంటి ఇబ్బంది కలుగదు.ఒకవేళ మీకు చాల ఫోర్స్ గా ఉంది, అలాంటి సమయంలో నీరు త్రాగలేము అని అనుకుంటే.. మూత్రవిసర్జన చేసాక ఒక 10 నిమిషాలు ఆగి ఆ తరువాత నీళ్ళను త్రాగండి. ఇల చేయడం ద్వారా ఈ 10 నిమిషాలలో ఆ కండరాలు సర్దుకొని పని చేయడానికి సిద్ధంగా ఉంటాయి.
అలాగే భోజనం చేసాక మూత్రవిసర్జన చేయండి, అంతేగాని మూత్రవిసర్జన చేసొచ్చి భోజనం చేయకండి. అదికాక రాత్రి పడుకోవడానికి పోయే ముందు మూత్రవిసర్జన చేసి నిద్రించండి. మళ్ళి ఉదయం నిద్రలేవగానే నీటిని త్రాగి మూత్రవిసర్జన చేయండి. అంతేగాని మూత్రవిసర్జన చేసొచ్చాక నీళ్ళు త్రాగకండి.
అలానే ఇంకొక తప్పు పని ఏంటంటే...
ఎండలో పడి వచ్చిన వెంటనే నీళ్ళు త్రాగుతుంటారు. ఇలా ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఎండలో నుండి నీడలోకి మీరు వచ్చినట్టుగా మీ శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా మార్పు చెందదు. అలా మీరు వచ్చినప్పుడు మీ శరీరం థర్మల్ షాక్ కు గురి అవుతుంది. ఆ సమయం లోనే మీరు నీరు త్రాగితే అది షాక్ పైన షాక్ లా అయ్యి దానితో దుష్పరిమాణాలు ఎదురవుతాయి.మరి దానికి ఏమి చేయాలి ?
ఇలాంటి థర్మల్ షాక్ నుండి మీ శరీరం తేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇంతవరకు ఉన్న ఉష్ణోగ్రత నుండి ఇప్పుడున్న ఉష్ణోగ్రతకు మీ శరీరం రావడానికి కనీసం 15 నిమిషాలు పడుతుంది. కావున ఇలాంటి సమయంలో మీ శరీర ఉష్ణోగ్రత, చుట్టూ ఉన్న ఉష్ణోగ్రతకు దగ్గరగా వచ్చాక నీళ్ళు త్రాగాలి.కామన్ గా ఉద్యోగ సమయంలో చేసే చిన్న చిన్న తప్పులు..
ఇంకా IT sector, chemicals, testing, research organization లో పనిచేసేవాళ్ళు ఎప్పుడు వారు Air-conditioned రూమ్ లో ఉంటారు. ఇలాంటి వారు ఎప్పుడు పని ఒత్తిడితో ఉంటారు, కావున అలానే కూర్చొని పని చేయడం వలన కలిగే ఇబ్బందులతో విసిగి ఆరోగ్య సూత్రాలని... గంట గంటకు రిలాక్స్ కోసం అని లేసి, ఎట్లాగో లేసాము కదా అని నీళ్ళు త్రాగడం మంచిదని ఆ రూమ్ నుండి బయటకు వచ్చి గబ గబ వాటర్ త్రాగి మళ్ళి పనికి టైం లేదని వెళ్లి పనిలో నిమగ్నమవుతారు. ఇక్కడ కూడా ఇంతకూ ముందు చెప్పుకున్న థర్మల్ షాక్ కలుగుతుంది.ఎలాంటి పరిస్థితిలో వెంటనే దాహం తీర్చుకోవచ్చు ?
ఇక్కడ ఇంకొక విషయము ఏంటంటే కొందరికి అదే Air-conditioned రూమ్ లోనే వాటర్ ఉంటాయి. అలాంటివారు వెంటనే నీళ్ళను త్రాగవచ్చు. ఎందుకంటే మీరు నీళ్ళు త్రాగకముందు ఏదైతే ఉష్ణోగ్రతలో ఉన్నారో అదే ఉష్ణోగ్రతలో ఉండి నీళ్ళు త్రాగుతున్నారు, మళ్ళి మీరు త్రాగిన తరువాత కూడా అదే ఉష్ణోగ్రతలోనే ఉంటారు కావున మీరు ఆరముగా నీళ్ళను త్రాగవచ్చు.అలానే ఎండలో పని చేస్తున్నప్పుడు, ఎండలో ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో నీళ్లు త్రాగవచ్చు, ఎందుకంటే త్రాగక ముందు త్రాగిన తరువాత మీ పనిలో మరియు చుటూ ఉన్న ఉష్ణోగ్రతలో తేడా లేదు కనుక. ఏదైనా పనిని ఆపి తరువాత ఆ పనిని చేయకుండా రెస్ట్ తీసుకుంటాం అనే సందర్భంలో మాత్రం వెంటనే నీళ్ళను త్రాగకూడకు. ఆ శరీరం పూర్తిగా రిలాక్స్ అయిన తరువాత మరియు శరీర ఉష్ణోగ్రత చుట్టూ ఉన్న పరిస్థితికి అలవాటు అయిన తరువాత నీళ్లను త్రాగటం శ్రేయస్కరం.
అలానే నిద్రలో ఉన్నప్పుడు మధ్యలో దాహం వేస్తె నీళ్ళు త్రాగవచ్చును. అదీనూ కొన్నే నీళ్ళు త్రాగాలి ఎందుకంటే రాత్రి మనం రిలాక్స్ అవుతుంటాము కావున ఎక్కువ నీళ్ళు త్రాగటం వలన మన శరీరంలో ఆ నీళ్ళు ఖర్చు కాకపోయేసరికి ఇబ్బంది కలుగుతుంది. అందుకు కొన్నే నీళ్ళు త్రాగాలి. అలానే ఉదయం నిద్రలో నుండి మేలుకున్నాక వెంటనే నీళ్లు త్రాగకూడదు. కొందరు ఇలానే చేస్తారు ఏమి అంటే ఉషాపానం చేయాలి అని,
నిద్ర నుండి లేవగానే త్రాగుతారు. అలా ఎప్పుడు చేయకూడదు.
ఉషాపానం చేయాలి అంటే ఎలా ?
నిద్ర మధ్యలో అయితే త్రాగవచ్చును ఎందుకంటే త్రాగకముందు త్రాగినతర్వాత కూడా మీరు నిద్రిస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ మీరు నిద్రలో నుండి మేలుకున్నారు మరియు మల్లి మీరు నిద్రించరు కావున మీ శరీరం ఆ స్థితికి అలవాటుపడాలి కావున వెంటనే నీళ్ళను త్రాగకూడదు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక 15 నిమిషాలు ఆగి నీళ్ళను త్రాగాలి.Methods of drinking water part 4 యొక్క వీడియో చూడండి.
మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి.
KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.
KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips
ఇంకా ఉంది...
తర్వాత భాగం పార్ట్-5 లో ఇంకా కొన్ని విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం.
ఇవి కూడా చదవండి...
భవతు సర్వ మంగళం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి