నాస్తికుడికి శిష్యరికం సాధ్యమవుతుందా?

Qualities of Shishya # 2

శిష్యుడి లక్షణాలు # 2


Ananda Bodhini

 


          ఓషో రజనీష్ గారిని వారి శిష్యులు ఒకరోజు నాస్తికుడికి శిష్యరికం సాధ్యమవుతుందా? అని అడిగినప్పుడు ఓషో రజనీష్ గురూజీ ఈ విధంగా వివరించారు. 

Ananda Bodhini
ఓషో ఏమన్నారంటే.... 

          నాస్తికుడికి, ఆస్తికుడికి ఇద్దరికీ శిష్యరికం సాధ్యంకాదు అని, అసలు వారు శిష్యులు కాలేరు అని తెలిపినారు. ఎందుకంటే వారు ముందుగానే ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకొని ఉంటారు, వారు ముందుగానే ఒక నిర్ణయం తీసుకోని ఉంటారు. అలా ఉన్నవారు శిష్యుడు కావడం అన్న విషయమే అర్ధం లేనిది అని అంటారు. మీకు ముందుగానే తెలిసిఉంటే ఇక మీరెందుకు శిష్యులు కావాలి? అని అంటారు.  ఓషో అంటారు అసలు శిష్యుడు అవ్వడము అంటేనే నాకేమి తెలియదు, అని తెలుసుకోవడం లాంటిది. అలాంటప్పుడు నాస్తికులు, ఆస్తికులు ఇద్దరు శిష్యులు ఎలా అవుతారు అని. 

          గురూజీ ఓషో ఇలా చెప్పారు... మీరు ఎప్పుడైతే దేన్నయినా నమ్ముతారో, అప్పుడు శిష్యరికంలోని సౌందర్యాన్ని మీరు ఆస్వాదించలేరు. మీకు ముందుగానే ఏ విషయమైనా తెలిసి ఉంటె, ఆ తెలిసి ఉండటం అనేది నీకు అహాన్ని ఇస్తుంది. అది మిమ్మల్ని లొంగి ఉండనీయదు. అందుకే పండితులు, విధ్వాంసులు పొందలేనిది, కొన్నిసార్లు పాపులు కూడా పొందారు. కానీ జ్ఞానులనబడేవారు కొందరు పొందలేదు. వారికీ ఎక్కువగా తెలుసు. వారి తెలివి మీరిపోయింది, వారి తెలివే వారికీ సమస్యగా మారి, అది ఆత్మహత్య సదృశమయింది. వారు వినరు ఎందుకంటే వారు నేర్చుకోవడానికి సద్దపడరు కాబట్టి. 

          గురూజీ ఓషో అంటారు... శిష్యరికం అంటే నేర్చుకునేందుకు సంసిద్ధత అని. 

          అనుక్షణం "నాకు తెలియదు" అన్న సృహ నీకు, ప్రపంచానికి మధ్య రాజ మార్గమవుతుంది. అప్పుడు మీరు మూయబడి వుండరు. ఎప్పుడైతే "నాకు తెలుసు" అని చెబుతారో, మీరు ఒక వృత్తంలో ఉన్నట్లు. అక్కడ మార్గం ఎప్పుడూ  తెరవబడదు. ఎప్పుడైతే మీరు "నాకు తెలియదు" అని అంటారో మీరు తెలుసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు అని అర్ధం. అంటే మార్గము తెరిచి ఉంది అన్నట్లు. 

          ఇంకా అంటారు... మీరు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చివుంటే, మీరు శిష్యులు కాలేరు. ఎవరైనా స్వీకరించే తత్వాన్ని కలిగి ఉండాలి. ఎవరైనా అనుక్షణం, వాస్తవం ఏమిటో నాకు తెలియదు అన్న సృహతో ఉండాలి. "ఏదైతే నీకు తెలుసో అదంతా అర్ధం లేనిది, చెత్త".  నీకేం తెలుసు? చాలా సమాచారం మీ దగ్గర ఉండవచ్చు. కానీ అది జ్ఞానం కాదు. మీరు విశ్వవిద్యాలయాల ద్వారా చాలా దుమ్మును పోగు చేసుకొని ఉండొచ్చు. అది జ్ఞానం కాదు. మీకు బుద్దుడి గురించి తెలిసి ఉండొచ్చు. జీసస్ గురించి తెలిసి ఉండొచ్చు. అయితే అది జ్ఞానం కాదు. మీరు బుద్ధుడు కానంత వరకు అక్కడ జ్ఞానం లేనట్టే. మీరు జీసస్ కానంత వరకు అక్కడ జ్ఞానం లేనట్టే. అని గురూజీ ఓషో అంటారు. 

          ఇంకా ఓషో అంటారు...  జ్ఞానం నీవు ఉనికిలో ఉండడం ద్వారా వస్తుంది. జ్ఞాపకం ద్వారా రాదు. నీకు సుశిక్షితమైన జ్ఞాపకం ఉండవచ్చు, జ్ఞాపకం అనేదొక ప్రక్రియ. ఆ జ్ఞాపకం నిన్ను నీ ఉనికిని ఉన్నతం చేయలేదు. ఆ జ్ఞాపకం నీకు భయంకరమైన పిడకలను ఇవ్వచ్చు. కానీ నీ చైతన్యాన్ని సంపాదత్వం చేయలేదు. మీరు దుమ్మూ ధూళితో కప్పబడి అలాగే ఉంటారు. దానితో వచ్చే అహం నాకు తెలుసు అన్న భావన, నిన్ను ప్రపంచానికి దూరం చేస్తుంది. అప్పుడు మీరు శిష్యులు కాలేరు. మీరు శిష్యులు కాకపోతే మీరు యోగ మార్గంలో ప్రవేశించలేరు. అందుకే యోగ మార్గంలోకి ఏమి తెలియని వాడిలాగా, ని అజ్ఞానం పట్ల సృహతో రా.. నీకు ఏమి తెలియదన్న సంపూర్ణ భావనతో రా.. ఇది మాత్రమే జ్ఞానం. "నాకు తెలియదు"అన్న జ్ఞానమే నీకు సహాయం చేస్తుంది అని అంటారు ఓషో. 

          "నాకు తెలియదు" అన్న జ్ఞానం వలన మీలో అంతర్గతమైన వినయం పుడుతుంది, మిమ్మల్ని వినయంగా ఉంచుతుంది. అప్పుడు అహం నెమ్మది నెమ్మదిగా మాయం అవుతుంది.  అని అంటారు ఓషో రజనీష్ గురూజీ. 

          మీరు తెలియదు అన్న సృహతో తెలుసుకుంటే, అహంకారిగా ఎలా ఉండగలరు? అహానికి జ్ఞానమే సూక్ష్మమైన ఆహారం. మీరు ఫలానా అని భావిస్తే, మీరు ఫలానా అవుతారు. మీరు ఎవరో ఒకరుగా ఉంటే జ్ఞానోదయం ఎప్పటికి సాధ్యం కాదు. ఎవరో ఒకరుగా ఉండడం అనేది పెద్ద అడ్డంకి లాంటిది అని అంటారు ఓషో. 

          మీరు ఎప్పుడైతే నేను ఎవర్ని కాను అనుకుంటారో, నేను ఏమి కాను అనుకుంటారో, అప్పుడు అకస్మాత్తుగా చాలా రహస్యాలు మీకు అందుబాటులోకి వస్తాయి. మార్మికమైన అనుభవాలు కలుగుతాయి. ఒకానొక రహస్య ప్రపంచంలోకి మీరు ప్రవేశిస్తారు. నీ మార్గము తెరుచుకుంటుంది. అక్కడ సూర్యుడు ఉదయించగలడు. సూర్యకిరణాలు మీలోకి చొచ్చుకొని పోగలవు. మీరు వికసిస్తారు. కానీ అదే నాస్తికులు, ఆస్తికులు ఇలా ఉండలేరు. కావున వారు ఈ యోగ మార్గంలోకి ప్రవేశించలేరు అని గురూజీ ఓషో రజనీష్ సమాధానం ఇచ్చారు. 

          ఇదంతా యోగ అనే ఈ పుస్తకం లోనిది. ఈ పుస్తకంలో పతంజలి యోగ సూత్రాల గురించి చాలా చక్కగా ఓషో రజనీష్ గారు వివరించారు. 

ఈ పుస్తకం తప్పకుండా చదవండి, చదివించండి, సరియైన అర్ధ భావనతో జీర్ణించుకోండి. మీలో గొప్ప అనుభవాలు కలుగుతాయి. ఈ మార్గంలో ఎంతో ఉన్నతిని పొందుతారు. 

ఈ ఆర్టికల్ వీడియో చూడండి .... 

 


మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి. 

KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.
  
KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips  


ఇవి కూడా చదవండి...

శిష్యుడి లక్షణాలు

 నిజాయితీ

        

భవతు సర్వ మంగళం 

  

కామెంట్‌లు