ఆరోగ్యంగా ఉండడానికి నీరు త్రాగే విధానం Part-5
Methods of drinking water part-5
Part-1, Part-2, Part-3 & Part-4 లో మనం మంచినీటిని ఎప్పుడెప్పుడు త్రాగాలి ? ఏ ఏ సమయంలో ఏమేమి త్రాగాలి ? అలా పాటించకపోతే ఏమిజరుగుతుంది ? ఆ water ని ఎలా త్రాగాలి? ph value గురించి, చల్లటి నీరు, ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా గోరువెచ్చటి నీటినే త్రాగాలని, ఆ నీటిని ఎందులో త్రాగాలి? ఆ నీటిని ఋతువుల ప్రకారం ఎందులో స్టోర్ చేసుకోవాలి, మన నిత్యా జీవితంలో చేసే చిన్న చిన్న తప్పుల గురించి తెలుసుకున్నాం.
అలానే వాటి తరువాతి Part ఈ Part-5...
పని ఒత్తిడిలో చేసే చిన్నచిన్న తప్పులు !
కొందరు పని ఒత్తిడిలో ఉండి దాహం వేస్తున్న వాటర్ త్రాగకుండా అలానే పనిలోనే ఉంటారు. కొందరు దాహం వేస్తున్న సంగతి కూడా గమనించే స్థితిలో లేకుండా వారు చేసే పనిలో నిమగ్నమై ఉంటారు. ఇంకొందరైతే నీళ్ళు త్రాగాలి అని, ఇంకొందరు నీళ్ళు త్రాగటం ఆరోగ్యానికి మంచిది అని ఎక్కడో చదివి, లేక డాక్టర్ చెప్పినాడు అని లెక్క లేకుండా, కొందరు బలవంతంగా కూడా త్రాగుతుంటారు. ఇలా దాహం కాకపోయినా త్రాగడం, దాహం అయినా గమనించుకోకుండా ఉండడం వలన కూడా చాల అనారోగ్యాలకు దారితీస్తాయి.దాహం కాకపోయినా నీటిని త్రాగకూడదా? అలా త్రాగడం వలన కలిగే పరిణామాలు ఏంటి?
మన శరీరానికి ఎప్పుడు నీరు అవసరమో అప్పుడు మనకు చెబుతుంది దాహం రూపంలో. అలా మనకు దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లను త్రాగాలి. దాని కోసం కొంత దృష్టి మనపై కూడా పెట్టుకోవాలి. ఒక్క ఉషాపానం చేసేటప్పుడు మాత్రం దాహం తో పనిలేదు. దాహం అయినా కాకపోయినా ఉషాపానం చేయవచ్చు.రోజు మన శరీరానికి కావలసినంత నీరు మనం త్రాగక పొతే మనలోని మలినాలను బయటికి పంపడానికి కిడ్నీలు వాటర్ కోసం మిగతా అవయవాల దగ్గరనుండి వాటర్ ను గ్రహిస్తుంది. దానితో ఆ అవయవాల పనికి ఆటంకం ఏర్పడుతుంది. అలాగే కిడ్నీకూడా స్ట్రైన్ కు గురి అవుతుంది. మళ్ళి మనలోని మలినాలు పూర్తిగా బయటికి పోక మూత్రపిండాల్లోనే ఉండిపోతాయి, అదికాక రక్తం కూడా సరిగా శుద్ధికాక అనారోగ్యాలు ఏర్పడుతాయి.
అలానే మనకు కావలసిన నీళ్ళ కంటే ఎక్కువ నీళ్లను త్రాగడం వలన మూత్రపిండాలపైనా ఒత్తిడి పెరిగి వాటి పనితీరులో మార్పు వచ్చి దాని లైఫ్ తగ్గిపోతుంది. కిడ్నీస్ కూడా ఒక లిమిట్ ఉంటుంది రోజుకు ఇన్ని వాటర్ అని. దానికి మించి మనం అందిస్తే దాని లైఫ్ పై ప్రభావం పడుతుంది .
అసలు మన శరీరానికి రోజుకు ఎంత నీరు అవసరం?
మనకు ఆ లిమిట్ ఇంత అని ఎలా తెలుసుకోవాలి దానికేమైనా సూత్రం ఉందా అంటే.... ఉంది.
అది ఏమనగా మీ శరీర బరువును 10 అంకెతో భాగించగా వచ్చిన దానిలో నుండి 2 అంకెను తీసివేయగా వచ్చిన మొత్తం, మీరు త్రాగవలసిన లీటర్ల నీరు.
సింపుల్ గా చెప్పాలంటే ఉదాహరణకు మీ బరువు 50kg లు అని అనుకుంటే, దాన్ని 10 తో భాగిస్తే 5 వస్తుంది. ఆ 5 నుండి 2 తీసివేయగా 3 వస్తుంది. అంటే మీరు రోజుకు త్రాగవలసిన నీళ్ళు అందాధగా 3లీటర్స్ అన్నమాట.
ఇంకొక విషయం ఇక్కడ 3 లీటర్స్ అంటే కేవలం నీళ్ళే కాదు, మీరు నీళ్లు కలిపిన వాటిని సేవించినవి కూడా లెక్కలోకి తీసుకోవాలి. అనగా మీరు త్రాగే మజ్జిగలో నీళ్ళు ఉంటాయి, జ్యూస్ లో నీళ్ళు ఉంటాయి ఇలాంటివి అన్నమాట. వీటన్నింటిని కలిపి మీ బరువుకు ఎన్ని లీటర్స్ అని వచ్చాయో అందాధగా అన్ని లీటర్స్ నీళ్ళను తీసుకోవడం మంచిది.
చిట్టచివరి అతి ముఖ్యమైన విషయం.
ఇగ చిట్టచివరి ఒక విషయం ఉంది, అది ఏంటంటే మనం నీళ్ళను త్రాగేటప్పుడు కూర్చొని త్రాగాలి, నిల్చొని త్రాగేలా అనేది. ఇది ఎంతో ముఖ్యమైన విషయం. ఇంతకు ముందు చెప్పినవన్నీ పాటిస్తూ ఈ ఒక్క విషయం పాటించకపోతే అంతా వ్యర్ధమే. వాటితో కలిగే ఫలితాలు ఏవి మీకు కలుగవు కావున ఇప్పుడు చెప్పబోయేది ఖచ్చితంగా పాటించాల్సిందే. అది ఏంటంటే.. మనం నీళ్ళను ఎప్పుడు త్రాగినా కూర్చొనే త్రాగాలి.కానీ ఈ విషయాన్నీ దాదాపుగా 80 శాతం మందికి తెలువదు. అందరు సర్వసాధారణంగా నిల్చొనే త్రాగుతారు. అలా ఎప్పుడు త్రాగకండి. ఎప్పుడు త్రాగినా కూర్చొనే త్రాగండి. నిలబడి త్రాగడం వలన మూత్రపిండాల పైనా ప్రభావం పడుతుంది, అలానే మోకాళ్ళ నొప్పులు కూడా కలుగుతాయి. ఇప్పుడు అందరికి ఈ మోకాళ్ళ నొప్పులని అంటున్నారు, దీనికి ఇలా నిలబడి త్రాగటం కూడా ఒక కారణం కూడా.
నీరును త్రాగేటప్పుడు కూర్చునే పద్దతి ఏమైనా ఉందా?
కూర్చొని త్రాగాలన్నారు అని ఎదో కుర్చీలోనో లేక సగం కూర్చొనో త్రాగేరు. అలా కాదు, ఆ కూర్చునే విధానం కూడా ఎలా ఉండాలంటే... పాలు పితికేటప్పుడు ఎలా కూర్చుంటారో అలా కూర్చోవాలి. ఇలా కూర్చోవడం శ్రేష్టం. అలా కూర్చోలేము అంటే అల కాకుండా ఉన్న ఒకే ఒక ఆసనం అంటే అది సుఖాసనం. ఇది తప్పించి ఇంకేవిధంగా కూర్చొని నీళ్లను త్రాగకూడదు. ఒకవేళ మీరు కుర్చీలో కూర్చొని ఉంటె దానిపైన సుఖాసనం లో కూర్చొని నీళ్లను త్రాగండి.రాగి పాత్రలోని నీటిని త్రాగేటప్పుడు కూర్చునే విధానంలో తీసుకోవలసిన జాగ్రత్తలు..
రాగి పాత్రలోని నీటిని త్రాగేటప్పుడు మాత్రము మీరు చెక్క కుర్చీలో
కూర్చొని త్రాగాలి, లేకపోతె మీ కాళ్లకు చెప్పులు వేసుకొని అయినా త్రాగాలి
లేక శరీరం భూమికి తగలకుండా.. అంటే ఎర్తింగ్ (Earthing) కాకుండా
ఉండే విధంగా ఉండి త్రాగాలి. ఎందుకనగా.. రాగి విధ్యుత్ వాహకంగా
పనిచేస్తుంది, దానితో రాగి యొక్క ions తో అందులోని నీరు ఛార్జ్ (charge)
చేయబడతాయి. కావున వాటిని మనం త్రాగినప్పుడు మన శరీరం భూమితో ఎర్తింగ్
(Earthing) కాకుండా చూసుకోవాలి. మన శరీరం భూమితో ఎర్తింగ్ అవ్వడం వలన ఆ
నీటి గుణాలు మనకు అందకుండా పోతాయి. కావున ఇది దృష్టిలో పెట్టుకొని
త్రాగండి. అలానే రాగి బిందె, రాగి చెంబు అయినా ఒక చెక్కపైన మాత్రమే
పెట్టుకోండి. ఆ పాత్ర కూడా ఎర్తింగ్ కాకుండా ఉండి, అందులోని నీరు ఛార్జ్
అయ్యి మనకు ఎంతో ఉపయోగపడుతాయి.
మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి.
KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.
KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips
రాగి పాత్రలోని నీరు దాని ఛార్జ్ తీసుకోవడం నిజమేనా?
ఇక్కడ ఒకటి గుర్తుతెచ్చుకుందాం...
మనం చిన్నప్పుడు స్కూల్ లో చదువుకున్నాం.. నీరు అనేది దానికి స్వాభావికంగా ఎలాంటి గుణం ఉండదు అని కదా.. !
ఆ
నీటిలో ఏ రంగు కలుపుతే ఆ రంగుగా కనపడుతుంది కదా, అలానే ఈ నీటిని ఏ పాత్రలో
నిల్వ ఉంచుతే ఆ పాత్ర గుణం స్వీకరిస్తుంది. అంతేకాక ఈ నీటిని ఎందులో
కలిపినా ఆ పదార్ధతత్వం ను స్వీకరిస్తుంది. అందుకే మనం భోజనానంతరం నీళ్లను
త్రాగవద్దు కానీ మజ్జిగ తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా.. మరి అందులో
ఎక్కువ శతం నీళ్ళే ఉంటాయి. నీటికి ఏ గుణం ఉండదు కావున నీరు ఆ పెరుగు తో
కలిసి దాని గుణం పొంది మజ్జిగగా మారి మనకు ఉపయోగకారిణిగా ఉంటుంది.
అలాగే
నీటిని గట గట గా త్రాగడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పుకున్నాం కదా.. అదే
నీటిని నోటిలోని లాలాజలంతో కలిపి త్రాగుట వల్ల ఆ నీరు క్షారగుణం పొంది మన
కడుపులోని ఆసిడ్స్ ను చల్లబరుస్తుంది అని చెప్పుకున్నాం కదా..
అలానే
మట్టికుండలో పోసిన నీరు, రాగి పాత్రలో పోసిన నీరు, బంగారు పాత్రలో పోసిన
నీరు లో వాటి వాటి పాత్రల ద్వారా ఆ నీరు లో కూడా గుణాలు మారుతూ ఉంటాయి.
అందువల్ల మన శరీరానికి ఏ
ఋతువులో ఎలాంటి గుణం కలిగిన నీరు కావాలో అంలాంటి నీటిని పొందడానికి ఆ ఆ
పాత్రలను వాడాలి. అంతేగాని ఇంతకూ ముందు వీడియో లో చెప్పుకున్న వాటికీ అటు
ఇటు గా మార్చవద్దు.
ఇంకొక
విషయం బంగారు పాత్రలోని నీరు కొన్ని వ్యాధులను నయం చేస్తుందని, వారు
చలికాలంలో కాకుండా ఎండాకాలంలో కూడా తీసుకుంటే ఆ నీటితో చెడు ఫలితాలు
కలుగుతాయి. కావున చలికాలంలోనే బంగారు పాత్రల నీరు వాడాలి.
నీటిని త్రాగే విధానంలోని అన్ని విషయాలను కవర్ చేసానని భావిస్తున్నాను...
ఈ విధంగా మీ నిత్యజీవితంలో నీరును త్రాగే క్రియలో మార్పులు చేసుకొని ఆరోగ్యవంతులుగా జీవిస్తారని తలుస్తూ...
ఇంతటితో methods of drinking water to stay healthy అనే టాపిక్ ను ముగిస్తున్నాను.
Methods of drinking water part 5 యొక్క వీడియో చూడండి.
Methods of drinking water part 5 యొక్క వీడియో చూడండి.
మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి.
KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.
KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips
ఇవి కూడా చదవండి...
భవతు సర్వ మంగళం
Online Gaming at JSMH Gaming Casino - KTHub
రిప్లయితొలగించండిJSMH Gaming 삼척 출장마사지 offers a wide 청주 출장안마 range of gaming games including 의왕 출장샵 progressive jackpot slots, classic bingo, 속초 출장샵 live 제주도 출장마사지 dealer games, scratch cards, video poker,