Real facts about millets

చిరు ధాన్యాల వాస్తవాలు 

Real facts about millets

 

 

 

గత కొద్దీ కాలంగా T.V లోను, సోషల్ మీడియా లోను, ఒక 4, 5 గురు కలిసిన ఈ చిరుధాన్యాల గురించి చర్చలు, స్పీచ్ లు చూస్తున్నాము, వింటున్నాము. అందులోను ఈ కొర్రలు, అరికలు, ఊదలు, అండు కొర్రలు, సామలు అని చెప్పే ఈ ఐదింటినే చిరుధాన్యాలని, ఇవి తప్ప మిగతావి కావు అన్నట్లుగా సాగుతున్నాయి. ఈ ఐదింటినే ఇంతగా ప్రాచుర్యం ఎందుకు తెస్తున్నారు అనే విషయమై ప్రతి ఒక్కరు తప్పకుండా ఆలోచించాలి. దానికంటే ముందు ఈ చిరుధాన్యాలు తినడం వలన ఈ ఈ రోగాలు నయం అవుతాయి అని చెబుతున్న విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. 

కొర్రలు 

 దీనిని ఇంగ్లీష్ లో Foxtail millet అని అంటారు. ఇవి ఎక్కువగా ఇటాలియన్ దేశంలో పండుతుంది కావున వీటికి Italian millet అని కూడా పేరు ఉంది. 
ఈ కొర్రల పంట వ్యవధికాలం 90 రోజులు. ఇందులో 8% Fiber ఉంటుంది. ఈ కొర్రలు తినడం వలన నరాల సంబంధిత రోగాలను, bone joints related problems ను నయం చేస్తుంది. ఇంకా అరికాల మంటలు తగ్గిస్తుంది. 

అరికలు 

దీనిని ఇంగ్లీష్ లో Kodo millet అని అంటారు. ఇవి హిమాలయాల్లో పండే పంట. అరిక అంటే సూర్యుడు అని అర్ధం. హిమాలయాల్లో చలికాలంలో సూర్యుని కిరణాలకు మంచు కరగడం వలన గడ్డి మొలుస్తుంది. అవే అరికలు కావున వీటికి Himalian millet అని కూడా పేరు ఉంది. ఈ అరికల పంట వ్యవధికాలం 120 రోజులు. ఇందులో 9% Fiber ఉంటుంది. ఈ అరికలు తినడం వలన రక్త సంబందీత రోగాలు అనగా రక్త శుద్ధి, bone marrow, కొలెస్ట్రాల్, హార్ట్ బ్లాక్, స్ట్రోక్, అలెర్జిస్, టైఫాయిడ్, డెంగు, బ్లడ్ క్లాటింగ్, కిడ్నీస్ సమస్యలను నయం చేస్తుంది. 

ఊదలు 

దీనిని ఇంగ్లీష్ లో Barnyard millet అని అంటారు. ఇవి ఎక్కువగా జపాన్ దేశంలో పండుతుంది కావున వీటికి Japanese millet అని కూడా పేరు ఉంది.
ఈ ఊదల పంట వ్యవధికాలం 90 రోజులు. ఇందులో 10% Fiber ఉంటుంది. ఈ ఊదలను తినడం వలన లివర్, జాండీస్, టైఫాయిడ్, గ్లాడ్ బ్లాడర్ స్టోన్స్, ఇన్ఫెక్షన్ అఫ్ లివర్, urinary blader ల సమస్యలను నయం చేస్తుంది. 

అండు కొర్రలు 

వీటిని ఇంగ్లీష్ లో కూడా Andu Korralu అనే అంటారు. ఇవి ఎక్కువగా అమెరికా దేశాల్లో పండుతుంది. కావున వీటికి American millet అని కూడా పేరు ఉంది. ఈ అండు కొర్రల పంట వ్యవధికాలం 70 రోజులు. ఇందులో 12.5% Fiber ఉంటుంది. ఈ అండు కొర్రలు తినడం వలన నరాల సంబంధిత సమస్యలు, కీళ్ళ సంబంధిత సమస్యలు, gastric problems, పైల్స్, మలవిసర్జన లో మంట, చీము సమస్యలు మరియు కాన్సర్ ను నయం చేస్తుంది. 

సామలు 

వీటిని ఇంగ్లీష్ లో Little millet అని అంటారు. ఇవి ఎక్కువగా ఆఫ్రికన్ దేశాల్లో పండుతుంది. కావున వీటికి African millet అని కూడా పేరు ఉంది. ఈ సామల పంట వ్యవధికాలం కూడా 90 రోజులు. ఇందులో 10% Fiber ఉంటుంది. ఈ సామలు తినడం వలన Re-generated organs, Re-product organs purification కు, Hormone related problems  ను, Injuries, Bone fracture  ను నయం చేస్తుంది. 

          ఈ అయిదు రకాల చిరుధాన్యాలను తినడం వలన ఇలాంటి సంబంధిత రోగాలు నయం అవుతాయని ఇప్పటి డాక్టర్లు, శాస్త్రవేత్తలం అని చెప్పేవారు చెబుతున్నారు.  


          అయితే ఇవి మంచివి అని అన్ని కలిపి తీసుకుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుందని మరికొందరు వారి వారి అనారోగ్యాలను నయం చేసేవి 2,3 రకాల చిరుధ్యానాలలో ఉన్నాయని ఆ 2,3 రకాల చిరుధ్యానాలను కలిపి తీసుకుందాం అని వారికీ వారు ఆలోచనలు చేసుకొని తింటున్నారు. అలా ఎప్పుడూ తినకూడదు. అలా తినడం వలన కలిగే లాభాల కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు మనవి కావు, ఇవి మనకు పెద్ద పెద్ద బ్రాండ్ లు అని చెప్పే కంపెనీలు అలా అలవాటు చేసినాయి. multi grain వాడటం వలన అన్ని రకాల పోషకాలు అందుతాయి అని మనల్ని భ్రమలో పడేసి వారు వ్యాపారాలు చేసుకుంటున్నారు. 

          ఇలా multi grain ను ఎప్పుడు వాడకూడదు, ముఖ్యంగా ఈ చిరుధ్యానాలను కలిపి అసలుకే వాడకూడదు. ఎందుకంటే మన శరీరానికి కావాల్సిన పోషకాలు రోజుకు ఇంత అవసరం అని ఒక లెక్క ఉంటుంది. ఇది ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు. అలాగే ఎదో ఒక రకమైన పోషకం లోపంతో ఉన్నవారికి ఆ పోషకాన్ని మాత్రం మిగతా వాటికంటే కొద్దిగా ఎక్కువగా అందిచాల్సివుంటుంది. అప్పుడు ఇలా మల్టీ గ్రైన్స్ అని చెప్పి మీరు అవి కొన్ని ఇవి కొన్ని మిక్స్ చేసి రోజు తీసుకోవడం వలన శరీరానికి కావాల్సినంత ఏ పోషకం పూర్తిగా అందదు. ఎందుకంటే అందులో ఏది పూర్తిగా లేదు, అన్ని కొద్దీ కొద్దిగా ఉన్నాయి దానితో ఏ పోషకం పూర్తిగా అందదు. దీనితో మనకు కావాల్సిన పోషకాలు మనలో భర్తీ కావు. కావున చిరుధాన్యాలనే కాదు ఏది తిన్న పూర్తిగా ఒక రకమైన వాటినే పూర్తిగా తీసుకోండి. దాని సహజసిద్ధమైన రుచిని, లక్షణాన్ని ఆస్వాదిస్తూ తినండి, మేలు జరుగుతుంది.

చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునే పద్దతి...

          అందుకు మీరు ఈ చిరుధాన్యాలన్ని తినాలనుకుంటే వాటిని కలపకుండా ఒక్కొక్కటిగా తినండి. ఎలా అంటే ఒకరోజు కొర్రలు తింటే, ఇంకోరోజు అరికలు తినండి, ఇంకోరోజు ఊదలు.. ఇలా వారం మొత్తం తినండి, ఒకరోజు gap ఇవ్వండి, మళ్ళి తరువాత వారం ఒక రోజుకు ఒక చిరుధాన్యం తినండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యతో భాధపడేవారు ఆ సమస్యను నయం చేసే చిరుధాన్యాన్ని ఒక రోజు కాకుండా 2 రోజులు తినండి. తరువాత రోజు ఇంకో రకం చిరుధాన్యం, ఇంకోరోజు ఇంకొక రకం చిరుధాన్యం ఇలా ఆ వారం తిని ఒక రోజు gap ఇచ్చి మళ్ళి తరువాత వారం అలాగే 2రోజులు మీ సమస్యను నయం చేసే చిరుధాన్యం తీసుకోని, తరువాత రోజు నుండి రోజుకొక చిరుధాన్యం తీసుకోండి, ఫలితం కలుగుతుంది. 

          ఇంతవరకు ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందిన ఈ అయిదు రకాల చిరుధాన్యాల గురించి తెలుసుకున్నాం. అయితే చిరుధాన్యాలు అంటే ఈ అయిదేనా...? మరి అలా అయితే ఇన్ని రోజులు ఇవి ఎందుకు ప్రాచుర్యంలోకి రాలేదు. ఇన్ని రోగాలను నయం చేస్తుంది అని ఇవి తినండి అని ఇప్పుడు చెబుతున్నారు. మరి ఇన్ని రోజులు ఏమైయ్యారు వీళ్లంతా...! అసలు దీని కథ ఏంటి అనే విషయమై ఇంకొక పార్ట్ లో తెలుసుకుందాం. 
ఇంకా ఉంది .... 

Real Facts about millets part 1 యొక్క వీడియో చూడండి.

 


మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి. 

KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.
 
KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips  

ఇవి కూడా చదవండి... 


Simple methods to control diabetes

Full detail information about curd


భవతు సర్వ మంగళం

కామెంట్‌లు