Real facts about millets Part 2

చిరు ధాన్యాల వాస్తవాలు Part-2

Real facts about millets Part-2


        


           Part-1 లో ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందిన ఈ అయిదు రకాల చిరుధాన్యాల గురించి తెలుసుకున్నాం. అలానే ఈ పార్ట్-2 లో ఈ చిరుధాన్యాలు ఇంత ప్రాచుర్యం పొందడానికి గల వాస్తవం గురించి తెలుసుకుందాం. 

          అయితే చిరుధాన్యాలు అంటే ఈ అయిదేనా...? మరి అలా అయితే ఇన్ని రోజులు ఇవి ఎందుకు ప్రాచుర్యంలోకి రాలేదు. ఇన్ని రోగాలను నయం చేస్తుంది అని ఇవి తినండి అని ఇప్పుడు చెబుతున్నారు. మరి ఇన్ని రోజులు ఏమైయ్యారు వీళ్లంతా...! అసలు దీని కథ ఏంటి అంటే.... 

          ఏమిలేదు ఇదంతా ఒక రకమైన వ్యాపారం. మనకు స్వాతంత్ర్యం వచ్చాక మన జనాభాకు సరిపడా ఆహార దిగుబడి లేదని భారతదేశం కరువులో మునిగిపోయి ఆహార కొరత ఏర్పడుతుందని.. అప్పటి విదేశీ కంపెనీలు మనకు మాయమాటలు చెప్పి, మన సాంప్రదాయక పద్దతిలో వ్యవసాయం చేస్తే మీరు తేరుకోవడానికి చాల సంవత్సరాలు పడుతుంది అని, అదే వాళ్ళ రసాయనాలతో పంటలు పండిస్తే దిగుబడి పెరిగి ఈ దేశం సస్యశ్యామలం అవుతుంది అని వారి వ్యాపార లబ్ధికోసం మన దేశంలో అడుగిడి మన సాంప్రదాయక వ్యవసాయాన్ని మాన్పించి వారి రసాయనాలతో పంటలు పండించడం నేర్పించారు. దానితో పంట దిగుబడి పెరిగింది. అందరు దిగుబడే చూసారు కానీ రసాయనాలతో వచ్చే పర్యవసానం ఏమి జరుగుతుంది అని ఆలోచించలేదు. దానికి మనం హరిత విప్లవం అని పేరు కూడా పెట్టుకున్నాం.

          అలా అల మన పంటల దిగుబడి పెరిగింది మరియు వాడి వ్యాపారాలు పెరిగాయి. దానితో ఒక 20, 25 సంవత్సరాలకు వారి దేశాల మాదిరిగా మన దేశంలో కూడా B.P. లు, డైబెటిస్ లు, గుండె జబ్బులు రావడం మొదలైనాయి.  దానితో వారు మీరు వాడే ఉప్పు వాడకూడదు అని కెమికల్స్ తో చేసిన ఫ్రీ ఫ్లో ఐయోడిన్ ఉప్పు వాడాలన్నారు. తర్వాత మన నూనెలతో గుండె జబ్బులు వస్తున్నాయని refined sunflower oil వాడాలని చెప్పినారు. ముడిబియ్యం కంటే పాలిష్ పెట్టిన బియ్యం రుచిగా ఉంటుందని మనకు అలవాటు చేసినారు, అలా పాలిష్ పెట్టడం వలన బియ్యంలోని ఫైబర్ మాయమై దానితో షుగర్ లెవెల్స్ పెరిగాయి. ఆ తరువాత బియ్యం తినడం వలన డైబిటిస్ వస్తుంది అని బియ్యం బదులు గోధుమలు తినాలని చెప్పి వాటిని రిఫైన్డ్ చేసి అమ్మినారు, ఆ తరువాత ఒక 6,7 సంవత్సరాల నుండి గోధుమల కంటే మల్టీ గ్రైన్ atta మంచిదని వ్యాపారం మొదలెట్టినారు. ఇలా వాడి వ్యాపారార్జన కోసం మనల్ని వాడుకుంటూ... మన వంటిళ్లలోని ప్రతి దాన్ని మార్చినాడు, చివరికి మనం త్రాగే నీటిని కూడా, ముందుగా 1లీటర్ బాటిల్ రూపంలో వాటి రుచిని అలవాటు చేసి మెల్లిగా can water అని, filter water అని, RO, UV water అని వ్యాపారం చేస్తున్నారు. అలా అలా వాడి వ్యాపారాలను వృద్ధి చేసుకుంటూ మనల్ని అనారోగ్యాల పాలు చేస్తూ మళ్ళి వాడే మందులు కనిపెట్టి ఆ మందులతో ఇంకోరకమైన వ్యాపారవృద్ధి పొందుతున్నారు. అదేవిదంగా ఇప్పుడు ఈ చిరుధాన్యాల పరిస్థితి కూడా అంతే. 

          ఒక్కటి గమనించండి... ఏదైతే వాడి చేతిలో పడిందో అది కల్తీగా మారింది. మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకసారి గమనించండి.. ఏదైతే మంచివి ఇవి తినాలని అన్నారో ఇగ అప్పటినుండి అది కల్తీకి గురి అవుతూ వచ్చాయి. ఈ social media లో చిరుధాన్యాల ప్రస్తావన రాకముందు వీటి ధర ఎంత ఉండేదో, ఇప్పుడు ఎంత ఉందొ ఒకసారి గమనించండి. ఆనాడు అంటే ఇంత అక్షరాస్యత లేదు కావున వారు చెప్పింది నడిచింది, కానీ ఇప్పుడు మనం దాన్ని ఎంతో సాధించాం కూడా, అయినా వారు మన weekness పైన కొడుతుంటారు కూడా. కానీ మనం వారిని follow కాకుండా కొద్దిగా ఆలోచిద్దాం.. వాళ్ళు చెప్పేది నిజామా.. అబద్దమా అని!

          అసలు చిరుధాన్యాలు అంటే ఇంతకూ ముందు చెప్పుకున్న ఈ ఐదు రకాలేనా...  అంటే కాదు!  చిరుధాన్యాలు అంటే చిన్న ధాన్యాలు అని అర్ధం. అందులో ఇంతకూ ముందు చెప్పుకున్న కొర్రలు, అరికలు, ఊదలు, అండు కొర్రలు, సామల తో పాటు, రాగులు, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్నలు, బియ్యం, గోధుమలు మొదలైన వాటిన్నన్నింటిని కలిపి చిరుధాన్యాలు అని అంటారు. 

          ఇప్పుడు వీళ్ళు చెబుతున్నారు... పూర్వం మన తాతలు, అంతకు ముందు పూర్వికులు కూడా ఈ ఐదు రకాల చిరుధాన్యాలనే తినేవాళ్లు, అవి మానేసాకే మనకు ఈ అనారోగ్యాలు వచ్చాయని, కానీ అసలు అది నిజం కాదు. వాళ్ళు చెబుతున్నట్లు మన తాతలు, అంతకు పూర్వం వాళ్ళు చిరుధాన్యాలను తిన్నారు నిజమే, కానీ వాళ్ళు చెబుతున్న చిరుధాన్యాలను మాత్రమే తినలేదు. 

          మన భారతదేశం యొక్క ముఖ్య ఆహార పంట వరి, గోధుమ కదా... అలానే మిగతా చిరుధాన్యాలను కూడా పండిస్తారు, కానీ వరి, గోధుమల కంటే తక్కువగా పండిస్తారు. అందులోను ఉత్తరం వైపు వారు ఎక్కువగా గోధుమలు మరియు దక్షిణం వైపు వారు వరి ని పండిస్తారు. ఇలానే తిన్నారు మన తాతలు, అంతకుపూర్వం వాళ్ళు కూడా.

          బియ్యం కొనే స్తోమత లేని వారు మాత్రం బియ్యంకు బదులు జోన్నలతో గడ్క, రంగులతో సంకటి, మొక్కజొన్నలతో గడ్క చేసుకొని తినేవారు. వీరు కూడా పండుగకు, శుభకార్యానికి మాత్రం తప్పకుండా బియ్యంనే వండుకొని తినేవారు. అంతేగాని ఇంతకూ ముందు చెప్పుకున్న ఆ చిరుధాన్యాలను రోజువారి ఆహారంగా రోజులతరబడి తినలేదు. 

అలా అయితె చిరుధాన్యాలను తినకూడదా...?


          చిరుధాన్యాలను తినకూడదా.. అంటే తినకూడదని కాదు... తినాలి. వాటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కూడా. తప్పకుండా తినాలి, కానీ వీటినే మన వాళ్ళు తిన్నారు అనేది మాత్రం తప్పు మాట అంటున్నాను. 

మరి ఏవిదంగా తినాలి అంటే...!


          ఔషధగుణాలు కల్గిన వాటిని ఔషదాల లాగానే తీసుకోవాలి. అనగా మనకు అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వేసుకుంటాం. ఆరోగ్యం పొందాక ఆ మేడిసిన్స్ ను వేసుకోవడం ఆపేస్తాము, అంతేనా... లేకుంటే మనం ఆ మెడిసిన్స్ తో నయం అయిందని అవి మంచివి అని ఇలానే వాడుతే మళ్ళి అనారోగ్యపాలు కామని అలానే వేసుకోముకదా... అలానే ఈ చిరుధాన్యాలనే చెప్పేవాటిని కూడా అలానే చూడాలి. 

చిరుధాన్యాలు ఔషధ గుణాలు కల్గినవా?

          ఈ చిరుధాన్యాలు ఔషధగుణాలు కల్గినవా? అంటే...  అవును. ఈ 5 రకాల చిరుధాన్యాలు మిగతా చిరుధాన్యాలతో పోలిస్తే ఫైబర్, micro-nutrients చాల అంటే చాల ఎక్కువగా ఉంటాయి. ఇగ ఇవి తప్ప మిగతా carbohydrates, fats మరియు కొన్ని విటమినులు అన్ని ఈ 5 రకాల చిరుధాన్యాలలో మరియు మిగతా అన్ని చిరుధాన్యాలలో దాదాపుగా సమానంగా ఉంటాయి. ఈ micro-nutrients, ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన వీటికి ఇంతకూ ముందు పార్ట్-1 లో చెప్పుకున్న ఫలితాలూ కాలుగుతాయి. కావున వాటిని ఔషదాలుగా మాత్రమే చూడాలి. 

          వీటిలో micro-nutrients చాలా ఉన్నాయని రోజులతరబడి తింటే మొదట మనలో ఏ nutrients వెలితి ఉన్నాయో అవి భర్తీ అయ్యి దానితో మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఆ తర్వాత ఆ nutrients యే కావాల్సిన దానికంటే ఎక్కువగా భర్తీ అవుతుంటే దానితో కూడా అనారోగ్యాలు కలుగుతాయి. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా ఇలా రోజులతరబడి తీసుకోవడం వలన మంచి చేసే ఈ ఫైబర్ మన శరీరంలో ఎక్కువై దానితో సైడ్ ఎఫెక్ట్స్ ఎర్పడుతాయి. మన శరీరంలో ఉండవలసిన మోతాదులోనే ఉండాలి తప్ప, తక్కువ, ఎక్కువగా ఉంటె అనారోగ్యమే కలుగుతుంది. 

          చిరుధాన్యాలనే తినాలని చెప్పేవారు మేము ఇంతమంది మీద ప్రయోగాలు చేసాం వారికీ నయం అయినాయి అని చెబుతున్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళు చెప్పినట్లుగా రోజుల తరబడి తీసుకుంటే ఏమి జరుగుతుంది అనేది ఎవరు చెప్పడం లేదు. 
          వీటి విలువ మన పూర్వీకులకు తెలుసుకాబట్టే వాటిని ఔషదాలుగా గానే తీసుకున్నారు. ఎలా అంటే... మన భారత సంప్రదాయంలో ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క రకమైన ఆహారం ప్రసాదంగా తీసుకుంటాం. ఉదాహరణకు... ఉగాది నాడు షట్ రుచులు అని, అదే బతుకమ్మ పండుగనాడు సద్దముద్దలని, నువ్వుల ముద్దలని, పల్లీల ముద్దలని, జోన్నలతో పొడులు ఇలా చిరుధాన్యాలతో లడ్డులు చేసుకొని తింటాం. ఇలానే మన పూర్వికులు తిన్నారు. వారిలో nutrients బాలన్స్ కోసం ఇలా పండుగలప్పుడు లేదా నెలలో కొన్ని సార్లు వీటితొ చిరుతిండ్లు, అల్పాహారం లాగా చేసుకొని తినేవారు. అంతేగాని వీళ్ళు చెప్పినట్లు రోజుమొత్తం ఆహారంగా రోజులతరబడి తినలేదు. 
          బియ్యం, గోధుమలు అనేవి మన శరీరానికి తక్కువ, ఎక్కువ కాకుండా ఒక న్యూట్రల్ గా ఉండి, మనకు కావాల్సిన విటమినులు, ప్రోటీన్ లు కల్గిన వాటిని ఆహారంగా తీసుకోవడానికి ఒక మాధ్యమంగా ఉపయోగపడుతాయి. కావున ఇవ్వే మన ప్రధాన ఆహారంగా ఉంది. ఆ తర్వాత కొద్దిగా nutrients కలిగిన సజ్జలు, రాగులు, జొన్నలు, మొక్కజొన్నలు ఇలా ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువ nutrients, ఫైబర్ కలిగినవి ఈ 5 రకాల చిరుధాన్యాలు. కావున వీటిని nutrients బాలన్స్ కోసం మాత్రమే తీసుకోవాలి. 

ఇంతకీ ఆయుర్వేదశాస్త్రం ఏమి చెబుతుంది?

 

          మనం నివసించే ప్రదేశానికి ఒక 100 కీ. మీ. ల పరిధిలో పండే పంటలనే ఆహారంగా తీసుకోవాలి అని. ఎందుకంటే మన శరీరానికి ఏమి కావాలో ఆ ప్రాంత భూమిలో పండే పంట ద్వారా ఈ ప్రకృతి అందిస్తుంది. కావున మీ పరిసర ప్రాంతంలో పండినవే ఆహారంగా తీసుకోవడం ఉత్తమం. ఇవి కాకా మిగతావి ఔషదాలుగా ఉపయోగపడుతాయి. కావున 100 కీ. మీ. అవతల లభ్యం అయ్యే వాటిని ఔషదాలుగా మాత్రమే గుర్తించి వాటిని ఆ విధంగానే తీసుకోవాలని వాగ్భాటాచార్యులు తను రచించిన ఆయుర్వేదశాస్త్రంలో వివరించారు. 

           ఈ చిరుధాన్యాలు కాకా మిగతావి మంచివి కావు అని చెబుతున్నారే, కానీ ఆ మిగతావి కల్తీ జరుగుతున్నాయి, మనకు అనారోగ్యం కలిగే విధంగా తయారు చేస్తున్నారు, అలా జరగకుండా ఆపుదాం అని చెప్పట్లేదు. ఎందుకంటే అది వ్యాపారం కాబట్టి. 
           వీళ్ళు చెప్పారని ఏమి ఆలోచించకుండా ఈ 5 రకాల వాటిపై మీరు ఒక్కసారిగా ఎగబడితే... ఏమి జరుగుతుంది? వాటి డిమాండ్ పెరిగి వాటి ధర పెరుగుతుంది. ఇది ఎప్పుడో జరిగింది కూడా... అలానే వీటిని కూడా కల్తీ చేయడానికో లేక రిఫైన్డ్ చేయడానికో ఆస్కారం ఉంది. ఈ చిరుధాన్యాలు మాత్రమే కల్తీ లేకుండా దొరుకుతున్నాయి ఇప్పటివరకు. ఇగ మీ చర్యలకు అతి కొద్దీ కాలంలోనే వీటిని కూడా వారి కల్తీ వ్యాపారంలో కలిపేస్తారు. 

          కావున ఈ 5 రకాల చిరుధాన్యాలే మంచివి అనే ఆలోచనలు విడిచి, ఇంతవరకు వారు చెప్పినట్టు నడిచాం అలాకాకుండా మనకు కావల్సినట్లు వాళ్ళు అందించే విదంగా మార్చాలి. మన భారత దేశ ప్రధాన ఆహారాన్ని ఇప్పుడు మార్కెట్ చేస్తున్నదానిలా కాకుండా మన పూర్వంలా కావాలని డిమాండ్ చేద్దాం. దాంతో వాడి వ్యాపారం వీడి మన బియ్యాన్ని పాలిష్ పెట్టకుండా మొత్తం ముడిబియ్యాన్నే అమ్ముతారు. దానితొ మీకు ఇప్పటి బియ్యం, గోధుమల తో కలిగే అనారోగ్యాలు కలుగవు. వీటితో పాటు  మన తాతలు తిన్నట్లు ఈ చిరుధాన్యాలను చిరుతిండ్లుగా, అల్పాహారంగా చేసుకొని మీ nutrients ను బాలన్సుగా ఉంచుకోవడం కోసం తీసుకోండి. దానితొ ఈ చిరుధాన్యాల ధర కూడా ఆకాశం నుండి క్రిందికి దిగి వచ్చి అందరికి అందుబాటులో ఉంటుంది. 

          కావున ఈ విధంగా మీ ఆలోచనలు మార్చుకొని ఆరోగ్యవంతమైన ఆహారాలు తీసుకుంటూ సుఖ జీవనం పొందుతారని భావిస్తూ...  సెలవుతీసుకుంటున్నాను. 

Real Facts about millets part 1 యొక్క వీడియో చూడండి.




మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి. 

KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.
 
KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips  

ఇవి కూడా చదవండి... 


Simple methods to control diabetes

Full detail information about curd


 ఈ వీడియో మీకు నచ్చినదని భావిస్తూ 

భవతు సర్వ మంగళం








   

కామెంట్‌లు