గోధుమలు మన ఆరోగ్యానికి మంచివేనా ?
బరువు పెరగారా ? అయితే చపాతీలు తినండి. డయాబెటిస్ వచ్చిందా? అయితే అన్నంకు బదులు చపాతీలు తినండి. ఆఫీసుకు లేట్ అవుతుంది, టిఫిన్ తినే టైం లేదా.. అయితే రెండు బ్రెడ్ స్లైసెస్ కు jam పెట్టిస్తా తింటూ వెళ్ళండి. సాయంత్రం పిల్లలకు snaks time లో త్వరగా అవ్వాలంటే పాస్తా, నూడిల్స్ ఇవ్వండి ఇష్టంగా తింటారు. అబ్బా sunday రోజు కూడా వంట చేయాలా...? పిజ్జా ఆర్డర్ చేయండి, లంచ్ లోకి నాన్స్, బిర్యానీ తెప్పించుకుందాం. మధ్యాహ్నానికి నీవు బాక్స్ లో పెట్టిన చపాతీలు గట్టిగా అయ్యి తినలేకపోతున్నా... అనగానే t.v. లో వచ్చే యాడ్ ప్రత్యక్షమవుతుంది. మా గోధుమ పిండితో చేసిన చపాతీలు 4,5 గంటల వరకు మృదువుగా ఉంటాయి అని. ఇలా.... ప్రతి ఇంట్లో ఎదో ఒక సందర్భం జరుగుతునే ఉంటుంది.
అసలు మన దక్షిణ భారతదేశపు ముఖ్య ఆహరం వరి. అలాంటిది దీని నుండి గోధుమ ఆహారంలోకి మారుతున్నాము. ఎక్కడ చూసిన గోధుమ పిండితో చేసిన పానీపూరి... సమోసా... పాస్తా.... నూడిల్స్.... donuts .... బర్గర్... పిజ్జా.... నాన్స్ .... పఫ్స్... పావ్ బాజీ.... బ్రెడ్.... తినుబండారాలే. అంతేకాక ఈ పేర్లు వినగానే ఈ కాలం పిల్లల్లో, పెద్దవాళ్ళో కూడా నోరూరుతుంది. సాయంత్రం అయిందంటే చాలు... సమోసా, పానీపూరి... బండిల దగ్గర, బెకెరీ షాపులో జనం... , రాత్రి అయిందంటే కర్రీ పాయింట్ లలో చపాతీలా కోసం క్యూలు...
అసలు ఇంతగా మనం ఉపయోగిస్తున్న ఈ గోధుమల తిండి మంచిదేనా..? లేక ఏమైనా నష్టం ఉందా...? అసలు మన శరీరానికి ఈ గోధుమలు వంటబడుతాయా...? మనం తినవచ్చా...?
Is wheat good for our health?
అదేంటి బాబు ...! డయాబెటిస్ వచ్చిందని డాక్టర్ చపాతీలు తినాలని చెబుతుంటే... ఇప్పుడిప్పుడే వాటిని అలవాటు చేసుకుంటున్నాము, మీరు ఇప్పుడు లేనిపోని కొత్త డౌట్ పెట్టకండి మాకు. అని అనుకునే వారి కోసం మరియు గోధుమల ప్రియులందరి కోసం ఈ ఆర్టికల్ .
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ చపాతీలు తినడం మొదలుపెడుతున్నారు. దీనికి కారణం ఏమి అంటే కొందరు డయాబెటిస్ అని, మరికొందరు బరువు తగ్గడానికి డైట్ అని చెబుతుంటారు. ఈ మార్పు వెనకాల ఆరోగ్య కారణాలకంటే వ్యాపార సంస్థలు చేస్తున్న ప్రకటనల ప్రభావం ఎక్కువగా ఉంది. దాంతో పాటు ... డాక్టర్ కూడా డయాబెటిస్ అనగానే అన్నం వదిలేసి చపాతీలు తినండి అని అంటున్నారు. దీనితో చపాతీలు ఇష్టం లేకున్నా , కష్టంగానే తింటుంటారు. ఇంత ఇబ్బంది కరంగా ఉన్నా ఆరోగ్యానికి ఇవే మంచివి అని సాగుతున్న ప్రకటనల ప్రభావం మరియు డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తుండటంతో... కష్టంగానే ఇలా అలవాటు చేసుకుంటున్నారు.
కానీ బియ్యంతో పోలిస్తే గోధుమలను అరగించడంలో చాలా సమస్యలు ఏర్పడుతాయి. అందులో సెలియాజ్ డిసీస్, వీట్ ఎలెర్జి , గ్లూటెన్ సేన్సిటివిటి వంటి ఇబ్బందులతో మన శరీరం తెగ సతమతమవుతుంది. వీటి వల్ల తలనొప్పి, దగ్గరనుంచి విరోచనాల వరకు నానారకాల సమస్యలు తలెత్తుతాయి. కానీ ఈ సమస్యల వెనక గల కారణం గోధుమలతో చేసిన ఆహరం అన్న విషయం చాలా మందికి తెలువదు. అసలు 90 శాతం కి పైగా జనాలకు తమకు గోధుమలు పడవు అన్న విషయమే తెలువది. ఇలా పడని వాటిని తినమని ఈ డాక్టర్లు ఎందుకు చెబుతున్నారు.? ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్స్ కి.

అలా అయితే గోధుమలే ఆహరం కల్గిన ఇతర దేశాల్లో ఈ డయాబెటిస్ అనేది ఉండొద్దు కదా.. అంతెందుకు మన ఉత్తర భారతదేశంలో గోధుమలే వారి ఆహరం. మరి అలాంటప్పుడు డాక్టర్లు చెప్పేదానిబట్టి చూస్తే ... ఉత్తరం వైపు వాళ్లకు ఈ డయాబెటిస్ అనేదే రావద్దు కదా..! మరి వారికీ కూడా డయాబెటిస్ ఎందుకు వస్తుంది?
పైన ఉన్న చార్టులో మన తెలుగు రాష్ట్రములో 8.4% ఉంటె, కర్ణాటకలో 7.5% ఉంది, అలాగే తమిళనాడులో 10.4% గా ఉంది. అంటే ఇక్కడ వరి అన్నం ఎక్కువగా తింటారు కావున అంత ఉంది అని అనుకుందాం. అలానే గుజరాత్ ను చూస్తే 7.1% ఉంది, అంటే మన కంటే ఒకే ఒక్క శాతమే తక్కువగా ఉంది, అలానే మహారాష్ట్రను చూస్తే 8.4% ఉంది, అంటే మనకు సమానంగా ఉంది, మరి ఈ రెండు రాష్ట్రాల ప్రధాన ఆహరం గోధుమలే. గోధుమలు అనగానే గుర్తుకొచ్చే రాష్ట్రం పంజాబ్. మరి అలాంటి రాష్ట్రంలో ఏకంగా 10% ఉంది. మరి ఇది ఎలా సాధ్యం. డాక్టర్లు చెబుతున్నట్లు వీరికి డయాబెటిస్ అనేది ఒక్క శాతం కూడా ఉండవద్దు. మరి అలాంటిది భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంది. ఇది ఎలా?
అంటే వీళ్ళు చెబుతున్నది సరియైనది కాదు అన్నమాట. దీనికంతటికి కారణం మనం హరితవిప్లవం అని గొప్పగా చెప్పుకుంటాం కదా... అదే దీనికి కారణం. ఇప్పుడున్న గోధుమలు అప్పటి మన సాంప్రదాయక భారతీయ గోధుమల రకం కాదు. ఈ హరిత విప్లవం ద్వారా మనం వాటిని నాశనం చేసి దాని స్థానంలో హైబ్రీడ్ విత్తనాలను తయారు చేసారు. ఇదంతా మన చుట్టూ ఉన్న దేశాల పని కూడా. ఈ హరిత విప్లవం ద్వారా మన దేశంలోకి విదేశీ కంపెనీలు ఎలా అడుగుపెట్టాయి అనే అంశంను ఇంతకు ముందు చేసిన "చిరుధాన్యాల వాస్తవాలు // Real Facts about Millets" అనే ఆర్టికల్ లో వివరించాను.
ఇలా గోధుమలను తిన్నగాని డయాబెటిస్ అనేది వస్తుంది, అంతేనా ఇంకా ముఖ్యంగా గోధుమల వల్ల వచ్చే ప్రధాన సమస్య జీర్ణ సమస్య. ఇలాంటి సమస్యలు కల్గిస్తున్న గోధుమలలో అసలు ఏమి ఉందో ... ఎందువల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయో ఒకసారి పరిశీలిద్దాం.
గోధుమ విత్తనం అనేది 3 భాగాలుగా ఉంటుంది. మొదటిది Bran అని అంటారు. Bran అంటే ఇది విత్తనం పైన ఉన్న పొట్టు. దీనిలో విటమిన్లు, మినరల్స్, బి-కాంప్లెక్స్ , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
ఇక రెండవది Germ, గోధుమ విత్తనం నుండి మొలక రావడానికి ఈ Germ యే కారణం. ఇందులో కూడా విటమిన్స్,మినరల్స్, ప్రోటీన్స్ ఉంటాయి.
ఇక ముచ్చటగా మూడవది Endosperm. మనకు సమస్యలు రావడానికి ఈ భాగమే కారణం. ఎందుకంటే ఈ భాగం మొత్తం Starch తో నిండి ఉంటుంది. అంటే కార్బోహైడ్రేట్స్ తో ఉంటుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్ అనేవి ఏ కొద్దో గొప్పో తప్ప దాదాపుగా శూన్యంగా ఉంటాయి, మరియు ఇందులో గ్లూటెన్, గ్లియాడిస్ అనే ప్రోటీన్స్ Starch తో కలిసి ఉంటాయి. ఈ గ్లూటెన్ ప్రోటీన్ తోనే సమస్య అంతా...!
మనం చపాతికోసం పిండిని నీళ్ళతో తడిపినప్పుడు కొద్దిగా బంకలాగా సాగుతూ అంటుకుంటూ ఉంటుంది కదా..! దానికి ఈ గ్లూటెన్ ప్రోటీన్ యే కారణం. ఈ గ్లూటెన్ ప్రోటీన్ ఒక పట్టాన జీర్ణం కాదు కూడా. ఎందుకంటే ఇది మన ప్రేగుల గోడలకి బంకలాగా అంటుకుంటుంది. దీనితో జీర్ణ సమస్యలు ఏర్పడుతాయి. ఎలా అనగా ఈ గ్లూటెన్ ప్రోటీన్ ప్రేగుల గోడలకి అతుక్కోవడం వల్ల మనం తిన్న ఆహరం లోని పోషకాలను గ్రహించలేక పోతాయి మన ప్రేగులు. దీనితో జీర్ణ శక్తి మందగిస్తుంది. ఆహరం సరిగా జీర్ణం కాకపోవడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలవుతాయి. ఆ తర్వాత చెడు కొలెస్ట్రాల్ మన శరీరంలో పెరుగుతుంది, దీనితో ఇంకా కొన్ని సమస్యలు మొదలవుతాయి. ఇగ రాత్రిల్లో చపాతీలు తినడం వల్ల ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన శరీరానికి, కడుపుకు రాత్రి విశ్రాంతి ని ఇచ్చి శరీరం లోపలి అన్ని అంగాలు మెయింటెనెన్స్ పని చేస్తూంటాయి, ఇలా చేస్తేనే మనలో ఎర్పడిన మలినాలను ఉదయం బయటికి పంపించగలుగుతుంది. కానీ మనం రాత్రిల్లో చపాతీలు తినడం వలన అది సరిగా జీర్ణించుకోలేక మన శరీరం సతమతమవుతోంది, దీంతో ఈ చర్యలకు ఆటంకం ఏర్పడి మొదటగా పొట్ట రావడం దానితో గ్యాస్ట్రిక్, కొలెస్ట్రాల్ సమస్యలకు దారితీస్తాయి.
మనం ఈ గోధుమలను మనమే ఆడించి ఆ పిండితో చపాతీలు చేసుకొంటే, ఆ పిండిలో ఈ Endosperm తో పాటు Bran, Germ కూడా ఉంటుంది, కాబట్టి ఈ సమస్య ఒక 20 నుండి 30 శాతం వరకు తగ్గవచ్చు, ఎందుకంటే Bran , Germ ఉండటం వలన ఈ పిండిలో ఫైబర్ ఉంటుంది. దానితో మనం తిన్న ఏ పదార్ధనైనా జీర్ణం కావడానికి ఈ ఫైబర్ తోడ్పడుతుంది. కాబట్టి సమస్య కొద్దిగా తగ్గుతుంది కానీ సమస్య అయితే సమస్యగానే ఉంటుంది.
అదే పిండిని మీరు బయట దొరికే బ్రాండ్ కంపెనీలు మరియు లూస్ గోధుమ పిండి వాడుతుంటే మాత్రం ఈ సమస్య 100 కు 100% ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో దొరికే గోధుమ పిండిలో ఈ Bran అనగా గోధుమ యొక్క పై పొట్టు ఉండదు. ఎందుకంటే వారు ఆ పిండిని ఫైన్ గా జల్లడ పడుతారు, దానితో గోధుమ గింజ పైన ఉండే Bran వెళ్ళిపోతుంది. దింతో ఆ పిండిలో ఫైబర్ ఉండదు కాబట్టి పిండి మెత్తగా ఉంటుంది. ఇలా పిండిని ఫైన్ గా చేస్తున్నకొద్దీ పిండి మెత్తగా సాఫ్టుగా వస్తుంది. పిండి ఎంత మెత్తగా తయారవుతున్నకొద్దీ అందులోని మైక్రో న్యూట్రీయంట్స్ కాస్త మాయమవుతూ ఉంటాయి.
ఇలా మెత్తటి పిండిని చూపెట్టే ఆ కంపెనీలు మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. కానీ ఇందులో కేవలం Endosperm మాత్రమే ఉంటుంది కావున ఈ Endosperm లో ఉండే గ్లూటెన్ ప్రోటీన్ ఒక్కటే ఉండి, ఫైబర్ లేకపోవడం వలన గ్లూటెన్ ప్రోటీన్ ప్రభావం ఎక్కువగా ఉండి సమస్యలు ఎక్కువవుతాయి. కానీ మనం వాళ్ళ ప్రకటనలకు ప్రభావితం అయ్యి , అవి తింటేనే ఆరోగ్యం కలుగుతుంది అని భావిస్తూ పరోక్షంగా అనారోగ్యాలకు దగ్గరమవుతున్నాము. అయినా వీటి ద్వారా సమస్యలు ఎదురవుతాయని ఎవరు చెప్పరు ... ఎందుకంటే ఇదంతా ఒక వ్యాపారం కాబట్టి .
ఒక దానికోసం చూసుకొంటే ఈ చపాతీలతో వచ్చే ఆరోగ్య సమస్యల సంగతి ఏంటి? ఇంకేముంది... ఆ సమస్యల వల్ల మళ్ళి వాళ్ళ దగ్గరికే వెళ్తాము కదా..! అదే కావాలి కదా వాళ్లకు. ఇదే జరుగుతుంది బయట. ఈ గ్లూటెన్ ప్రభావం అనేది మనం పిండిని ఆడించుకుంటే తక్కువగా ఉంటుంది, మార్కెట్లో దొరికే పిండితో ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ గోధుమ లతో తయారయ్యే మైదా పిండి సంగతి అయితే ఇగ చెప్పనక్కరలేదు.
ఈ మైదాను తయారుచేయడానికి గోధుమ గింజల పైన ఉండే Bran ను, గోధుమ గింజలోని Germ ను ఈ రెండింటిని పూర్తిగా తీసివేసి కేవలం Endosperm ను మాత్రమే పిండి పడ్తారు. అలా వచ్చిన పిండిని మళ్ళి ఫైన్ గా జల్లెడ పట్టి, దానిని రిఫైన్డ్ చేయటం వలన సాఫ్టుగా తయారవుతుంది. అయితే ఒరిజినల్ గా మైదాపిండి కొద్దిగా పసుపు రంగులో ఉంటుంది. కానీ మనం బయటకొనే మైదాపిండి మాత్రం వైట్ గా ఉంటుంది కదా..! దీనికోసం పూర్వం ఈ పిండిని స్టోర్ చేసేవారు. దానితో ఆ పిండి వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ తో ఆక్సీడియేషన్ కు గురియై నాచురల్ గా బ్లీచ్ అయ్యి వైట్ గా మారేది. ఇలా జరగడానికి ఒక నెల నుండి 2 నెలల సమయం పడేది. మరి అంత ఎక్కువ సమయం పడుతుంటే మార్కెట్ లో ఉన్న డిమాండ్ కు సరిపడా అందించలేరు కదా.. అందుకు ఒక కంపెనీ 1900 సం. లో నాచురల్ పద్దతిలో కాకుండా కెమికల్ పద్దతిలో బ్లీచ్ చేయడం మొదలుపెట్టింది.
ఎందుకంటే ఈ కెమికల్ బ్లీచ్ పద్దతితో కేవలం 48 గంటల సమయం సరిపోతుంది, కావున ఈ కెమికల్ బ్లీచింగ్ పద్దతినే ఇప్పుడు అన్ని కంపెనీ లు పాటిస్తున్నాయి. ఈ కెమికల్ బ్లీచింగ్ పద్దతిలో Benzol peroxide, Calcium peroxide, Chlorine, Chlorine dioxide, Nitrogen dioxide, Azodicarbonamide లను వాడుతారు. ఈ కెమికల్ బ్లీచింగ్ లో వాడే కెమికల్స్ వల్ల ఒక bi-product గా Alloxan chemical పుట్టుకొస్తుంది.
ఈ Alloxan chemical అత్యంత ప్రమాదకరమైనది. ఎలా అనగా డయాబెటిస్ రీసెర్చ్ కొరకు ఎలుకలకు ఈ కెమికల్ నే ఎక్కించి వాటికీ డయాబెటిస్ వ్యాధిని తెప్పించి ప్రయోగాలు చేస్తుంటారు. ఇంతటి ప్రమాదకరమైన Alloxan chemical ఈ మైదాపిండిలో ఉంటుంది. కాబట్టి ఈ మైదా తినడం వల్ల డయాబెటిస్ వస్తుంది. ఎవరికైనా డయాబెటిస్ రావాలంటే ఈ మైదాను రోజూ తినండి, తప్పకుండా డయాబెటిస్ వస్తుంది. అలానే డయాబెటిస్ ను జీవితకాలం ఉంచుకోవాలనుకుంటే మాత్రం రోజూ గోధుమలను తినండి.
జీవితకాలం మొత్తం ఈ డయాబెటిస్ ను ప్రోలాంగ్ చేస్తూనే ఉంటుంది ఈ గోధుమలు. ఎలా అనగా... ఈ గోధుమల్లో గ్లూటెన్ ప్రోటీన్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా...! అది మన పొట్టలో జీర్ణం కాక, మన ప్రేగుల గోడలకు అతుక్కొని ప్రేగులు ఇతర పోషకాలు గ్రహించే గుణం పోగొట్టి జీర్ణ సమస్యలు వస్తాయని చెప్పుకున్నాం కదా.. అలానే ఈ గ్లూటెన్ ప్రోటీన్ మన శరీరంలోని Pancreas పైన కూడా ప్రభావం చూపెడుతుంది. ఈ Pancreas beta cells ఇన్సులిన్ ను విడుదల చేస్తాయని అందరికి తెలిసిన విషయమే. ఈ గ్లూటెన్ ప్రోటీన్ అనేది ఈ Pancreas beta cells లను డామేజ్ చేస్తుంది. దింతో డయాబెటిస్ వచ్చిన వాళ్లకు ఈ వ్యాధి ప్రోలాంగ్ అవుతూనే ఉంటుంది.
ఈ గ్లూటెన్ ప్రోటీన్ ప్రేగుల గోడలకు అతుక్కుంటూ పేరుకుపోతుంటే దింతో భ్యాక్టీరియా వృద్ధి చెంది, చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, దాంతో బరువు పెరుగుతారు, B.P. వస్తుంది ఇంకా గుండె జబ్బులు వస్తాయి. ఆ తరువాత ప్రేగుల గోడలకు ఏళ్ళతరబడి అతుక్కోవడం వలన కోలన్ కాన్సర్ కు కూడా దారి తీస్తుంది జాగ్రత్త.
ఇదండీ గోధుమల యొక్క వాస్తవాలు, గోధుమల గురించి మరియు వాటితో కలిగే చెడు ఫలితాల గురించి మీకు అర్ధం అయ్యేలా వివరించాను అని అనుకుంటున్నాను.
మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి.
KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.
KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips
Methods of drinking water to stay healthy part3
Methods of drinking water to stay healthy part4
Methods of drinking water to stay healthy part5
అంటే వీళ్ళు చెబుతున్నది సరియైనది కాదు అన్నమాట. దీనికంతటికి కారణం మనం హరితవిప్లవం అని గొప్పగా చెప్పుకుంటాం కదా... అదే దీనికి కారణం. ఇప్పుడున్న గోధుమలు అప్పటి మన సాంప్రదాయక భారతీయ గోధుమల రకం కాదు. ఈ హరిత విప్లవం ద్వారా మనం వాటిని నాశనం చేసి దాని స్థానంలో హైబ్రీడ్ విత్తనాలను తయారు చేసారు. ఇదంతా మన చుట్టూ ఉన్న దేశాల పని కూడా. ఈ హరిత విప్లవం ద్వారా మన దేశంలోకి విదేశీ కంపెనీలు ఎలా అడుగుపెట్టాయి అనే అంశంను ఇంతకు ముందు చేసిన "చిరుధాన్యాల వాస్తవాలు // Real Facts about Millets" అనే ఆర్టికల్ లో వివరించాను.
ఇలా గోధుమలను తిన్నగాని డయాబెటిస్ అనేది వస్తుంది, అంతేనా ఇంకా ముఖ్యంగా గోధుమల వల్ల వచ్చే ప్రధాన సమస్య జీర్ణ సమస్య. ఇలాంటి సమస్యలు కల్గిస్తున్న గోధుమలలో అసలు ఏమి ఉందో ... ఎందువల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయో ఒకసారి పరిశీలిద్దాం.
అసలు గోధుమలలో ఏమి ఉంది... ?
గోధుమ విత్తనం అనేది 3 భాగాలుగా ఉంటుంది. మొదటిది Bran అని అంటారు. Bran అంటే ఇది విత్తనం పైన ఉన్న పొట్టు. దీనిలో విటమిన్లు, మినరల్స్, బి-కాంప్లెక్స్ , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
ఇక రెండవది Germ, గోధుమ విత్తనం నుండి మొలక రావడానికి ఈ Germ యే కారణం. ఇందులో కూడా విటమిన్స్,మినరల్స్, ప్రోటీన్స్ ఉంటాయి.
ఇక ముచ్చటగా మూడవది Endosperm. మనకు సమస్యలు రావడానికి ఈ భాగమే కారణం. ఎందుకంటే ఈ భాగం మొత్తం Starch తో నిండి ఉంటుంది. అంటే కార్బోహైడ్రేట్స్ తో ఉంటుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్ అనేవి ఏ కొద్దో గొప్పో తప్ప దాదాపుగా శూన్యంగా ఉంటాయి, మరియు ఇందులో గ్లూటెన్, గ్లియాడిస్ అనే ప్రోటీన్స్ Starch తో కలిసి ఉంటాయి. ఈ గ్లూటెన్ ప్రోటీన్ తోనే సమస్య అంతా...!
రాత్రి భోజనంలో చపాతీలు తినకూడదా?
మనం చపాతికోసం పిండిని నీళ్ళతో తడిపినప్పుడు కొద్దిగా బంకలాగా సాగుతూ అంటుకుంటూ ఉంటుంది కదా..! దానికి ఈ గ్లూటెన్ ప్రోటీన్ యే కారణం. ఈ గ్లూటెన్ ప్రోటీన్ ఒక పట్టాన జీర్ణం కాదు కూడా. ఎందుకంటే ఇది మన ప్రేగుల గోడలకి బంకలాగా అంటుకుంటుంది. దీనితో జీర్ణ సమస్యలు ఏర్పడుతాయి. ఎలా అనగా ఈ గ్లూటెన్ ప్రోటీన్ ప్రేగుల గోడలకి అతుక్కోవడం వల్ల మనం తిన్న ఆహరం లోని పోషకాలను గ్రహించలేక పోతాయి మన ప్రేగులు. దీనితో జీర్ణ శక్తి మందగిస్తుంది. ఆహరం సరిగా జీర్ణం కాకపోవడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలవుతాయి. ఆ తర్వాత చెడు కొలెస్ట్రాల్ మన శరీరంలో పెరుగుతుంది, దీనితో ఇంకా కొన్ని సమస్యలు మొదలవుతాయి. ఇగ రాత్రిల్లో చపాతీలు తినడం వల్ల ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన శరీరానికి, కడుపుకు రాత్రి విశ్రాంతి ని ఇచ్చి శరీరం లోపలి అన్ని అంగాలు మెయింటెనెన్స్ పని చేస్తూంటాయి, ఇలా చేస్తేనే మనలో ఎర్పడిన మలినాలను ఉదయం బయటికి పంపించగలుగుతుంది. కానీ మనం రాత్రిల్లో చపాతీలు తినడం వలన అది సరిగా జీర్ణించుకోలేక మన శరీరం సతమతమవుతోంది, దీంతో ఈ చర్యలకు ఆటంకం ఏర్పడి మొదటగా పొట్ట రావడం దానితో గ్యాస్ట్రిక్, కొలెస్ట్రాల్ సమస్యలకు దారితీస్తాయి.
మనం ఈ గోధుమలను మనమే ఆడించి ఆ పిండితో చపాతీలు చేసుకొంటే, ఆ పిండిలో ఈ Endosperm తో పాటు Bran, Germ కూడా ఉంటుంది, కాబట్టి ఈ సమస్య ఒక 20 నుండి 30 శాతం వరకు తగ్గవచ్చు, ఎందుకంటే Bran , Germ ఉండటం వలన ఈ పిండిలో ఫైబర్ ఉంటుంది. దానితో మనం తిన్న ఏ పదార్ధనైనా జీర్ణం కావడానికి ఈ ఫైబర్ తోడ్పడుతుంది. కాబట్టి సమస్య కొద్దిగా తగ్గుతుంది కానీ సమస్య అయితే సమస్యగానే ఉంటుంది.
అదే పిండిని మీరు బయట దొరికే బ్రాండ్ కంపెనీలు మరియు లూస్ గోధుమ పిండి వాడుతుంటే మాత్రం ఈ సమస్య 100 కు 100% ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో దొరికే గోధుమ పిండిలో ఈ Bran అనగా గోధుమ యొక్క పై పొట్టు ఉండదు. ఎందుకంటే వారు ఆ పిండిని ఫైన్ గా జల్లడ పడుతారు, దానితో గోధుమ గింజ పైన ఉండే Bran వెళ్ళిపోతుంది. దింతో ఆ పిండిలో ఫైబర్ ఉండదు కాబట్టి పిండి మెత్తగా ఉంటుంది. ఇలా పిండిని ఫైన్ గా చేస్తున్నకొద్దీ పిండి మెత్తగా సాఫ్టుగా వస్తుంది. పిండి ఎంత మెత్తగా తయారవుతున్నకొద్దీ అందులోని మైక్రో న్యూట్రీయంట్స్ కాస్త మాయమవుతూ ఉంటాయి.
ఇలా మెత్తటి పిండిని చూపెట్టే ఆ కంపెనీలు మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. కానీ ఇందులో కేవలం Endosperm మాత్రమే ఉంటుంది కావున ఈ Endosperm లో ఉండే గ్లూటెన్ ప్రోటీన్ ఒక్కటే ఉండి, ఫైబర్ లేకపోవడం వలన గ్లూటెన్ ప్రోటీన్ ప్రభావం ఎక్కువగా ఉండి సమస్యలు ఎక్కువవుతాయి. కానీ మనం వాళ్ళ ప్రకటనలకు ప్రభావితం అయ్యి , అవి తింటేనే ఆరోగ్యం కలుగుతుంది అని భావిస్తూ పరోక్షంగా అనారోగ్యాలకు దగ్గరమవుతున్నాము. అయినా వీటి ద్వారా సమస్యలు ఎదురవుతాయని ఎవరు చెప్పరు ... ఎందుకంటే ఇదంతా ఒక వ్యాపారం కాబట్టి .
మరి డాక్టర్లకు ఈ గ్లూటెన్ గురించి తెలువదా...?
ఒకవేళ డాక్టర్లకు ఈ గ్లూటెన్ గురించి తెలిసి ఉంటె, గోధుమలు తినాలని ఎందుకు చెబుతున్నారు ? అనే సందేహంతో ఒకసారి నేను ఇలానే చెప్పే ఒక డాక్టరును అడిగా ఎందుకు గోధుమలే తినాలి అని? దానికి ఆ డాక్టర్ చెప్పిన సమాధానం ఏంటంటే... అన్నం అయితే మీరు కంట్రోల్ లేకుండా ఎక్కువ అన్నం తింటారు. ఎలా అంటే కొంత పచ్చడితోనూ, కొంత కూరతో, కొంత రసంతో, కొంత పెరుగుతో, ఇగ సాంబారుతో అయితే ఇంకో 2,3 ముద్దలు ఎక్కువ తింటారు. ఇలా అన్నంను ఎక్కువ మొత్తంలో తీసుకుంటారు. అదే చపాతీలు అయితే 2 లేక 3, మరి అయితే 4 చపాతీలతో ముగించేస్తారు. దీనితో తినే తిండి పైన కంట్రోల్ ఉంటుంది. అందుకే చపాతీలు తినమని చెబుతామని అన్నారు.ఒక దానికోసం చూసుకొంటే ఈ చపాతీలతో వచ్చే ఆరోగ్య సమస్యల సంగతి ఏంటి? ఇంకేముంది... ఆ సమస్యల వల్ల మళ్ళి వాళ్ళ దగ్గరికే వెళ్తాము కదా..! అదే కావాలి కదా వాళ్లకు. ఇదే జరుగుతుంది బయట. ఈ గ్లూటెన్ ప్రభావం అనేది మనం పిండిని ఆడించుకుంటే తక్కువగా ఉంటుంది, మార్కెట్లో దొరికే పిండితో ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ గోధుమ లతో తయారయ్యే మైదా పిండి సంగతి అయితే ఇగ చెప్పనక్కరలేదు.
మైదాపిండిని ఎలా తయారు చేస్తారు?
ఈ మైదాను తయారుచేయడానికి గోధుమ గింజల పైన ఉండే Bran ను, గోధుమ గింజలోని Germ ను ఈ రెండింటిని పూర్తిగా తీసివేసి కేవలం Endosperm ను మాత్రమే పిండి పడ్తారు. అలా వచ్చిన పిండిని మళ్ళి ఫైన్ గా జల్లెడ పట్టి, దానిని రిఫైన్డ్ చేయటం వలన సాఫ్టుగా తయారవుతుంది. అయితే ఒరిజినల్ గా మైదాపిండి కొద్దిగా పసుపు రంగులో ఉంటుంది. కానీ మనం బయటకొనే మైదాపిండి మాత్రం వైట్ గా ఉంటుంది కదా..! దీనికోసం పూర్వం ఈ పిండిని స్టోర్ చేసేవారు. దానితో ఆ పిండి వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ తో ఆక్సీడియేషన్ కు గురియై నాచురల్ గా బ్లీచ్ అయ్యి వైట్ గా మారేది. ఇలా జరగడానికి ఒక నెల నుండి 2 నెలల సమయం పడేది. మరి అంత ఎక్కువ సమయం పడుతుంటే మార్కెట్ లో ఉన్న డిమాండ్ కు సరిపడా అందించలేరు కదా.. అందుకు ఒక కంపెనీ 1900 సం. లో నాచురల్ పద్దతిలో కాకుండా కెమికల్ పద్దతిలో బ్లీచ్ చేయడం మొదలుపెట్టింది.
కెమికల్ బ్లీచింగ్ ఎందుకు చేస్తారు?
ఎందుకంటే ఈ కెమికల్ బ్లీచ్ పద్దతితో కేవలం 48 గంటల సమయం సరిపోతుంది, కావున ఈ కెమికల్ బ్లీచింగ్ పద్దతినే ఇప్పుడు అన్ని కంపెనీ లు పాటిస్తున్నాయి. ఈ కెమికల్ బ్లీచింగ్ పద్దతిలో Benzol peroxide, Calcium peroxide, Chlorine, Chlorine dioxide, Nitrogen dioxide, Azodicarbonamide లను వాడుతారు. ఈ కెమికల్ బ్లీచింగ్ లో వాడే కెమికల్స్ వల్ల ఒక bi-product గా Alloxan chemical పుట్టుకొస్తుంది.
Alloxan కెమికల్ ఏమి చేస్తుంది...
ఈ Alloxan chemical అత్యంత ప్రమాదకరమైనది. ఎలా అనగా డయాబెటిస్ రీసెర్చ్ కొరకు ఎలుకలకు ఈ కెమికల్ నే ఎక్కించి వాటికీ డయాబెటిస్ వ్యాధిని తెప్పించి ప్రయోగాలు చేస్తుంటారు. ఇంతటి ప్రమాదకరమైన Alloxan chemical ఈ మైదాపిండిలో ఉంటుంది. కాబట్టి ఈ మైదా తినడం వల్ల డయాబెటిస్ వస్తుంది. ఎవరికైనా డయాబెటిస్ రావాలంటే ఈ మైదాను రోజూ తినండి, తప్పకుండా డయాబెటిస్ వస్తుంది. అలానే డయాబెటిస్ ను జీవితకాలం ఉంచుకోవాలనుకుంటే మాత్రం రోజూ గోధుమలను తినండి.
గోధుమలలో ఉండే గ్లూటెన్ డయాబెటిస్ ఏమి చేస్తుంది.
జీవితకాలం మొత్తం ఈ డయాబెటిస్ ను ప్రోలాంగ్ చేస్తూనే ఉంటుంది ఈ గోధుమలు. ఎలా అనగా... ఈ గోధుమల్లో గ్లూటెన్ ప్రోటీన్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా...! అది మన పొట్టలో జీర్ణం కాక, మన ప్రేగుల గోడలకు అతుక్కొని ప్రేగులు ఇతర పోషకాలు గ్రహించే గుణం పోగొట్టి జీర్ణ సమస్యలు వస్తాయని చెప్పుకున్నాం కదా.. అలానే ఈ గ్లూటెన్ ప్రోటీన్ మన శరీరంలోని Pancreas పైన కూడా ప్రభావం చూపెడుతుంది. ఈ Pancreas beta cells ఇన్సులిన్ ను విడుదల చేస్తాయని అందరికి తెలిసిన విషయమే. ఈ గ్లూటెన్ ప్రోటీన్ అనేది ఈ Pancreas beta cells లను డామేజ్ చేస్తుంది. దింతో డయాబెటిస్ వచ్చిన వాళ్లకు ఈ వ్యాధి ప్రోలాంగ్ అవుతూనే ఉంటుంది.
గోధుమ చపాతీలే తినాలని ఎందుకు అనిపిస్తుంది..?
అంతేకాదు ఈ గోధుమలలోని 3వ భాగం అయిన Endosperm లో గ్లూటెన్ ప్రోటీన్ తో పాటు గ్లియాడిస్ ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది ఏమి చేస్తుంది అంటే... మనకు రోజు చపాతీలే తినాలని అనిపించేలా ఒక వ్యసనంలాగ మారేలా చేస్తుంది. అందుకే గోధుమ చపాతీలు తినే నార్త్ వాళ్ళకు చపాతీలు తప్ప ఇంకేమి తినబుద్దికాదు. వారికీ ఇంకేమి పెట్టిన చపాతీలే కావాలంటారు గమనించండి. మన వారిలో కూడా డయాబెటిస్ వచ్చిందని చపాతీలు తినడం అలవాటుచేసుకున్నాక ఇగ చపాతీలే తినాలనిపిస్తుంటుంది వారికీ. జీర్ణ సమస్యలు వస్తున్నా వాటిని భరిస్తూ వాటికోసం డాక్టర్లను సంప్రదిస్తుంటారు కానీ ఈ సమస్యలు చపాతీలు తినడం వలన కలుగుతుందని మాత్రం గుర్తించలేకపోతారు.ఈ గ్లూటెన్ ప్రోటీన్ ప్రేగుల గోడలకు అతుక్కుంటూ పేరుకుపోతుంటే దింతో భ్యాక్టీరియా వృద్ధి చెంది, చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, దాంతో బరువు పెరుగుతారు, B.P. వస్తుంది ఇంకా గుండె జబ్బులు వస్తాయి. ఆ తరువాత ప్రేగుల గోడలకు ఏళ్ళతరబడి అతుక్కోవడం వలన కోలన్ కాన్సర్ కు కూడా దారి తీస్తుంది జాగ్రత్త.
ఇదండీ గోధుమల యొక్క వాస్తవాలు, గోధుమల గురించి మరియు వాటితో కలిగే చెడు ఫలితాల గురించి మీకు అర్ధం అయ్యేలా వివరించాను అని అనుకుంటున్నాను.
ఈ ఆర్టికల్ వీడియో చూడండి ....
మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి.
KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.
KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips
ఇవి కూడా చదవండి...
Real facts about millets part 1
Real facts about millets part 2
Methods of drinking water to stay healthy part 1
Methods of drinking water to stay healthy part 2
Real facts about millets part 2
Methods of drinking water to stay healthy part 1
Methods of drinking water to stay healthy part 2
Methods of drinking water to stay healthy part3
Methods of drinking water to stay healthy part4
Methods of drinking water to stay healthy part5
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి