నేలమీద కూర్చొనే భోజనం చేయాలా? ఎందుకు?

Right Posture To Eat Food...

నేలమీద కూర్చొనే భోజనం చేయాలా? ఎందుకు?


          ఈ మధ్యకాలంలో భోజనాన్ని నిలబడి తినే సాంప్రదాయం మొదలైంది. మన భారతదేశంలో ఒక 25 సంవత్సరాల పూర్వం ఒక స్టేటస్ గా మన ఇంట్లోకి వచ్చి చేరిన వస్తువు డైనింగ్ టేబుల్. ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడం ఒక స్టేటస్ గా ఫిల్ అయ్యేవారు. అలానే ఇప్పుడు డైనింగ్ టేబుల్ నుండి బఫెట్ మీల్స్ కు వచ్చాము. ఏదైనా పార్టీ కి గాని, ఏదైనా శుభకార్యానికి వెళితే అక్కడ భోజనం పెట్టె పద్దతి బఫెట్. అలా బఫెట్ పెట్టడం ఇప్పుడు ఫ్యాషన్ అయింది. ఒక స్టేటస్ కు సింబల్ అయింది. అదికాక దీని ద్వారా సమయం, ప్లేస్ ఆదా అవుతుందని, అందరు దీనినే ఆచరిస్తున్నారు. ఇప్పుడు మనం కూడా భోజనం అనగానే బఫెట్ ఏ కదా అని అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం కూర్చొని తినే పద్దతిని ఒక శిక్షలాగా చూస్తున్నాము. అంతసేపు కింద కూర్చోలేము కూడా అందుకని ఈ బఫెట్ సంప్రదాయం విజృంభించింది. ఎంతవరకు అంటే ఇప్పుడు ఈ బఫెట్ అనేది... మారుమూల గ్రామాలకు కూడా పాకింది. అయితే ఈ బఫెట్ మీల్స్ చేయడం మంచిదేనా? 

          తినడం ముఖ్యం కానీ నిలబడి తిన్నావా? కూర్చొని తిన్నావా? అనేది ఏంటి? ఎలా తింటే ఏమి? మనం తిన్నది కడుపులోకి పోయిందా లేదా కావాలిగాని! అని అనుకుంటుంటారు కొందరు. అసలు ఈ భోజనం ను ఏ పద్దతిలో చేయాలి అనే విషయమై మన భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో ఎంతో చక్కగా వివరించబడింది. ఆ విషయమై కొన్ని సంవత్సరాల క్రితమే మన రాజీవ్ దీక్షిత్ గారు వివరించారు. అతను వివరించిన దానినే ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకుందాం. 

         
Right posture to eat food


          ఇంతకీ మనం కూర్చొని తినాలా..? నిలబడి తినాలా..? ఏది కరెక్ట్, ఇప్పటి జనరేషన్ కు బఫెట్ అంటే ఎంతో సంతోషిస్తారు కూడా. ఇప్పటి జనరేషనే కాదు అందరూ దీనికే ఓటు వేస్తున్నారు. రాజీవ్ దీక్షిత్ గారు దీనిని బఫెట్ సిస్టమ్ కాదు బఫెలో సిస్టమ్ అని అంటారు. అంటే గేదెలు ఎలా తింటాయి, అలా అని దానర్ధం. జంతువులు అన్ని నిలబడే తింటాయి. కానీ మనం మానవులం, మనం మాత్రం వాటిలా నిలబడి తినకూడదు, ఆరోగ్య దృష్ట్యా కూడా మంచిది కాదు. అలా నిలబడి తినడం జంతువులకే ఈ నియమం వర్తిస్తుంది, మనకు కాదు. మనకు మాత్రం కూర్చొని తినే నియమము ఉంది, మంచిది కూడా. మన ఆయుర్వేదశాస్త్రం కూడా ఇలా కూర్చొనే తినాలని చెబుతుంది. 


 ఎందుకు? మనకు కూర్చొనే తినాలనే నియమం ఉంది. అంటే.... 

          జంతువులకు నాలుగు కాళ్ళు , ఆ నాలుగు కాళ్ళతో అవి నడుస్తాయి. కానీ అదే మనకు రెండే కాళ్ళు . జంతువులకు నాలుగు కాళ్ళ వల్ల దాని వెన్నపూస భూమికి సమాంతరంగా ఉంటుంది. అదే మనకు వెన్నపూస నిటారుగా ఉంటుంది. దీని వలన జంతువుల శరీర గురుత్వాకర్షణ కేంద్రం, మానవుల శరీర గురుత్వాకర్షణ కేంద్రానికి భిన్నంగా ఉంటుంది. అందువల్ల జంతువులకు నిలబడి తినడానికి ఆయుర్వేదం అనుమతించబడింది. అదే మనకు నిలబడి తినడం అనుమతించబడలేదు. 

          ఈ గురుత్వాకర్షణ కేంద్రం కూడా మనం నిలబడినప్పుడు, కూర్చున్నప్పుడు మారుతూ ఉంటుంది. అందుకు మనం భోజనం చేసేప్పుడు ఖచ్చితంగా కూర్చొనే తినాలి అని ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. ఈ గురుత్వాకర్షణ వలన ఏమి జరుగుతుంది అని అనుకుంటున్నారా..? ఆయుర్వేద ప్రకారం నిలబడి ఆహారం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంది. ఎలా అంటే...!

          మీరు నిలబడి భోజనం చేసేప్పుడు భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మీపై ఎక్కువగా ఉంటుంది. అదే మీరు కూర్చొని భోజనం చేసేప్పుడు భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మీపై నిలబడి భోజనం చేసేప్పుడు ఉండే దానికంటే తక్కువగా ఉంటుంది. నిలబడి తినేప్పుడు గురుత్వాకర్షణ ఎక్కువగా ఉండడం వలన మీరు తిన్న ఆహారం వేగంగా లోపలికి వెళుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఆహారం నెమ్మదిగా దిగాలి. కానీ మీరు నిలబడి తినడం వల్ల ఆహారం వేగంగా వెళుతుంది. ఆలా వేగంగా వెళ్లడం వలన ఆహారం లాలాజలంతో అంతగా కలవదు. దాంతో ఆ ఆహారం జీర్ణక్రియలో సమస్యను కలిగిస్తుంది. అందువల్ల నిలబడి తిన్న ఆహారాన్ని జీర్ణించుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాక శరీర అవయవాలకు కూడా జీర్ణక్రియ సమయంలో ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల కూర్చొని తినడం ఉత్తమం అని ఆయుర్వేదంలో చెప్పబడింది. 

          ఇంతకీ కూర్చొని తినాలి అంటే ఎలా  కూర్చోవాలి..?

కూర్చోమన్నారు కదా అని కుర్చీలో కూర్చొని తినడం అని అనుకుంటున్నారా? అది కాదు! దాదాపుగా అందరు ఇంట్లో ఇలానే తింటారు. కుర్చీలో కూర్చొని డైనింగ్ టేబుల్ మీద తింటుంటారు. ఇది సరైన పద్దతి కాదు. ఇలా డైనింగ్ టేబుల్ పై తినడం యూరోపియన్ల పద్దతి, మనది కాదు. వాళ్ళు అలా డైనింగ్ టేబుల్ పై తినడానికి ఒక కారణం ఉంది. అది ఏంటంటే... అక్కడి ప్రాంతం అంత చలి ప్రదేశం కావడం వలన అక్కడి ప్రాంత ప్రజల శరీరంలో సైనోవియల్ అనే ద్రవం తక్కువగా ఉంటుంది. ఈ సైనోవియల్ ద్రవం శరీరంలోని అన్ని కీళ్ళ మధ్యలో ఉండే ఒక ద్రవం. ఇది ఎముకల ఘర్షణను తగ్గిస్తుంది, మరియు ఎముకలు అరిగిపోకుండా నిరోధిస్తుంది. 

          చలి ప్రాంతంలో ఉండే వారికీ ఈ ద్రవం తక్కువగా ఉండటం వలన వాళ్ళ కీళ్ళ మూమెంట్ ప్ర్రేగా ఉండవు. కావున వాళ్ళు మనలాగా సుఖాసనంలో కూర్చోలేరు. అందుకని వారు డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తినే అలవాటు చేసుకున్నారు. 

          కానీ ఇక్కడ భారతదేశం అంత  చలి ప్రదేశం కాదు, ఇక్కడి వాతావరణం సాధారణం, అంత చలికాదు అంత వేడి కాదు. అందుకు భారతదేశంలో నేలమీద కూర్చొని భోజనం చేయడం మంచిది. కాబట్టి ఆయుర్వేదం ఆరోగ్యంగా ఉండటానికి నేలమీద కూర్చోమని చెప్పింది. 

          ఇలా నేలమీద కూర్చొని తినడం వలన మీ మనస్సు ఆహారం మీదనే దృష్టిపెట్టగలదు, మరియు ఇలా నేలమీద కూర్చోవడం వలన మీరు అతిగా తినలేరు. దీని వలన మీ బరువు అదుపులో ఉంటుంది. 

          ఇంకా మీరు పద్మాసనంలో కూర్చుంటే మీ నడుము, వీపు , ఉదరం అన్ని ఒకే ఆక్సిస్ లో ఉండటం వలన మీ జీర్ణక్రియ హాయిగా జరుగుతుంది. దీనితో మీ శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. 

          నేలమీద సుఖాసనంలో కూర్చొని భోజనం చేస్తుంటే నోటిలో ముద్ద పెట్టుకోవడానికి కొంచెం ముందుకు వస్తారు, మళ్ళి తిరిగి వెనక్కి వెళ్తారు. ఇలా ముందుకు, వెనుకకు మీ శరీరం కదలడం వలన మీ కడుపు కండరాలు చురుకుగా మారి , మీరు తినే ఆహారాన్ని జీర్ణం చేయడం సులభం అవుతుంది. దీనితో మీ జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. 

          మీరు నేలమీద కూర్చొని తినేటప్పుడు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మీ గుండే, జీర్ణక్రియకు సహాయపడే అన్ని అవయవాలకు రక్తాన్ని పంపిస్తుంది. అదే మీరు కుర్చీలో లేదా నిలబడి తినేటప్పుడు రక్త ప్రసరణ కాళ్ళకు కూడా జరుగుతుంది. ఆ సమయంలో కాళ్ళకు రక్త ప్రసరణ అంతగా అవసరం లేదు. కాబట్టి కూర్చొని తినడం వలన రక్త ప్రసరణ జీర్ణక్రియకు సహాయపడే అవయవాలకు జరిగి జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. 

          ఇంకో అతి ముఖ్య విషయం ఏమిటంటే ... ఇలా నేలమీద పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చోవడం వలన మీ శరీరమంతా ప్రయోజనం కలుగుతుంది. ఇది మీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా, మీ కీళ్ళు మృదువుగా మరియు ఫ్లెక్సిబుల్ గా మారుతాయి. ఇలా కూర్చోవటం వలన ఆర్థరైటిస్, ఎముకల వ్యాధుల నుండి రక్షింపబడుతాము. శరీరంలో కీళ్ళు అన్ని ఫ్లెక్సిబుల్ గా మారుతాయి. నేలమీద పద్మాసనంలో గాని సుఖాసనంలో గాని కూర్చొని తినడం వలన ఇన్ని లాభాలు కలుగుతాయని ఆయుర్వేదశాస్త్రం చెబుతుంది. 

          ఇంతగా మన శాస్త్రం చెబుతుంటే మనం ఏమి చేస్తున్నాం? ప్రాశ్చాత్యుల ప్రాంతానికి అనువైన వస్తువులను మనం స్టేటస్ గా గుర్తించి మన ఇంట్లోకి తెచ్చుకొని, ఆరోగ్యాన్ని కల్గించే మన సాంప్రదాయక పద్దతిని వదిలి డైనింగ్ టేబుల్ పైన, బఫెట్ సిస్టమ్ అని అలవాటు చేసుకొని మనం అనారోగ్యపాలు అవుతున్నాం. వీటన్నింటికి కారణం నేలమీద కూర్చొని తినక పోవడం అనేది మాత్రం గుర్తించలేకపోతున్నాం. 

          ఎవరు చూడు కీళ్ళ నొప్పులు కింద కూర్చోలేము అని అంటున్నారు. మనం నేలమీద కూర్చోవటం మానేసి డైనింగ్ టేబుల్ అలవాటు చేసుకున్నాకనే ఈ కీళ్ళ నొప్పులు వచ్చాయనే సంగతి ఎవరు గుర్తించలేకపోతున్నారు. కావున మన భారతీయ సాంప్రదాయ పద్దతిలో నేలమీద సుఖాసనంలో కూర్చొని భోజనం చేస్తూ ఆరోగ్యాంగా ఉంటారని తలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. 

 ఈ ఆర్టికల్ వీడియో చూడండి .... 


మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి. 

KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.
  
KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips  

ఇవి కూడా చదవండి... 


Simple methods to control diabetes

Full detail information about curd

భవతు సర్వ మంగళం 

కామెంట్‌లు